
డబుల్ ‘కిక్’
రవితేజ ఇచ్చిన ‘కిక్’ని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఆ చిత్రానికి మించిన స్థాయిలో ‘కిక్-2’ ద్వారా డబుల్ కిక్ ఇవ్వడానికి కృషి చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై హీరో నందమూరి కల్యాణ్‌రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు ఎస్. పి. సురేందర్‌రెడ్డి. ఈ చిత్రానికి సంబంధించిన పతాక సన్నివేశాలను ఇటీవల రాజస్థాన్‌లోని జైసాల్మీర్‌లో చిత్రీకరించారు. నేడు రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్, టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ - ‘‘‘కిక్’లో రవితేజ, ఇలియానాల కొడుకు కథే ఈ ‘కిక్-2’. ‘కిక్’కి ఇది సీక్వెల్ మాత్రం కాదు ’’ అని చెప్పారు. రకుల్‌ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, సంగీతం: ఎస్.ఎస్.థమన్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్.