టైగర్‌ ప్రియురాలు ఈమెనే.. | Kriti Sanon reveals sister Nupur's first look poster from 'Tiger Nageswara Rao' - Sakshi
Sakshi News home page

Tiger Nageswara Rao Movie: టైగర్‌ ప్రియురాలు ఈమెనే..

Published Tue, Aug 29 2023 1:02 AM | Last Updated on Tue, Aug 29 2023 9:36 AM

Kriti Sanon reveals sister Nupur first look poster from Tiger Nageswara Rao - Sakshi

నూపుర్‌ సనన్‌

రవితేజ హీరోగా నటిస్తున్న తాజా పాన్‌ ఇండియా చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నూపుర్‌ సనన్‌ (నటి కృతీ సనన్‌ చెల్లెలు), గాయత్రీ భరద్వాజ్‌ హీరోయిన్లు. ‘ది కాశ్మీర్‌ ఫైల్స్, కార్తికేయ 2’ వంటి వరుస విజయాలు అందుకున్న అభిషేక్‌ అగర్వాల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ మూవీలో సారా పాత్రలో నటిస్తున్నారు నూపుర్‌. ‘టైగర్‌ లవ్‌ సారా’ అంటూ సోమవారం నూపుర్‌ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ‘‘రవితేజ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’. అక్టోబర్‌ 20న సినిమాని రిలీజ్‌ చేస్తాం’’ అని యూనిట్‌ పేర్కొంది. అనుపమ్‌ ఖేర్, రేణూ దేశాయ్‌ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్‌ కుమార్, కెమెరా: ఆర్‌. మది, సమర్పణ: తేజ్‌ నారాయణ్‌ అగర్వాల్, సహనిర్మాత: మయాంక్‌ సింఘానియా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement