నో ఛేంజ్.. దసరాకి టైగర్‌ వేట కన్ఫర్మ్ | Ravi Teja Tiger Nageswara Rao will release as planned | Sakshi
Sakshi News home page

Tiger Nageswara Rao Movie: దసరాకి టైగర్‌ వేట కన్ఫర్మ్

Published Wed, Aug 2 2023 5:25 AM | Last Updated on Wed, Aug 2 2023 7:21 AM

Ravi Teja Tiger Nageswara Rao will release as planned - Sakshi

రవితేజ హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నూపుర్‌ సనన్, గాయత్రీ భరద్వాజ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తేజ్‌ నారాయణ్‌ అగర్వాల్‌ సమర్పణలో అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌పై అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్‌ 20న రిలీజ్‌ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు మేకర్స్‌. అయితే ఈ సినిమా విడుదల ఆలస్యమయ్యే అవకాశం ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి.

ఈ నేపథ్యంలో ‘టైగర్‌ నాగేశ్వరరావు’ విడుదలలో ఎలాంటి మార్పు లేదని, ముందుగా ప్రకటించినట్లు దసరాకి అక్టోబర్‌ 20నే విడుదల చేస్తామనీ చిత్రబృందం ఓ ప్రకటన రిలీజ్‌ చేసింది. ‘‘టైగర్‌ నాగేశ్వరరావు’ చిత్రం అక్టోబర్‌ 20న విడుదల కావడం లేదంటూ కొన్ని శక్తులు వదంతులు వ్యాప్తి చేస్తున్నాయి.  ఆ వదంతులను నమ్మవద్దు. మీకు (ప్రేక్షకులు) అత్యుత్తమ సినిమా అనుభూతిని అందించడానికి మేము కృషి చేస్తున్నాం. అక్టోబరు 20 నుంచి బాక్సాఫీస్‌ వద్ద టైగర్‌ వేట ప్రారంభమవుతుంది’’ అని మేకర్స్‌ తెలియజేశారు. ఈ చిత్రానికి సహనిర్మాత: మయాంక్‌ సింఘానియా, సంగీతం: జీవీ ప్రకాష్‌ కుమార్, కెమెరా: ఆర్‌ మది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement