ఈసారి మరింత కిక్ షురూ! | Ravi Teja -Surender Reddy's 'Kick 2' from | Sakshi
Sakshi News home page

ఈసారి మరింత కిక్ షురూ!

Published Sat, Aug 16 2014 11:39 PM | Last Updated on Sat, Sep 2 2017 11:58 AM

ఈసారి మరింత కిక్ షురూ!

ఈసారి మరింత కిక్ షురూ!

రవితేజ, సురేందర్‌రెడ్డి కాంబినేషన్ అనగానే... ‘కిక్’ సినిమా గుర్తొస్తుంది. అయిదేళ్ల క్రితం బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా చేసిన హంగామా అంతాఇంతా కాదు. మళ్లీ ఈ కాంబినేషన్‌లో సినిమా రూపొందనుంది. మసాలా సినిమాలను ఇష్టపడే వారికి ఇది నిజంగా శుభవార్తే. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించనుండటం విశేషం
 
 . ‘కిక్’ని మరపించే స్థాయిలో పక్కా ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు సురేందర్‌రెడ్డి. ఈ నెల 20న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాకు సంబంధించిన కథానాయిక, ఇతర వివరాలు ప్రారంభోత్సవం నాడు తెలియజేస్తామనీ, రవితేజ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్‌గా ఈ చిత్రం నిలుస్తుందనీ కల్యాణ్‌రామ్ చెబుతున్నారు. ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: తమన్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement