రవితేజ కొడుకు కథే కిక్ 2 | Allu Arjun, NTR launch Ravi Teja's Kick 2 | Sakshi
Sakshi News home page

రవితేజ కొడుకు కథే కిక్ 2

Published Wed, Aug 20 2014 11:43 PM | Last Updated on Sat, Sep 2 2017 12:10 PM

రవితేజ కొడుకు కథే కిక్ 2

రవితేజ కొడుకు కథే కిక్ 2

ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చే చిత్రాలెప్పుడూ ఘనవిజయాన్ని సొంతం చేసుకుంటాయి. రవితేజ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించిన ‘కిక్’ అలాంటి విజయాన్నే సొంతం చేసుకుంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో బుధవారం మరో చిత్రం మొదలైంది. ‘కిక్ 2’ పేరుతో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ సంస్థపై కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది.
 
  మహానటుడు ఎన్టీఆర్ చిత్రపటంపై తీసిన తొలి సన్నివేశానికి హీరో రవితేజ కెమెరా స్విచాన్ చేయగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్లాప్ ఇచ్చారు. స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ గౌరవ దర్శకత్వం వహించారు. ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే చిత్రమని రవితేజ అన్నారు. ‘కిక్’లో జంటగా నటించిన రవితేజ, ఇలియానా పాత్రల కొడుకు కథే ఈ ‘కిక్ 2’ అని దర్శకుడు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 28న చిత్రాన్ని విడుదల చేస్తామని కల్యాణ్‌రామ్ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement