డైలమాలో మాస్ మహారాజా | Mahesh's Srimanthudu worries Ravi Teja | Sakshi
Sakshi News home page

డైలమాలో మాస్ మహారాజా

Published Thu, Aug 13 2015 10:06 AM | Last Updated on Wed, Jul 25 2018 2:35 PM

డైలమాలో మాస్ మహారాజా - Sakshi

డైలమాలో మాస్ మహారాజా

హైదరాబాద్: వరుస హిట్స్తో ఓ రేంజ్లో దూసుకుపోతున్న మాస్ మహారాజా రవితేజ డైలమాలో పడ్డాడని సమాచారం. 2009లో రవితేజ నటించి కిక్ చిత్రం విడుదలై ఆయన అభిమానులకు, ప్రేక్షకులకు మాంచి కిక్ ఇచ్చారు. దాని కొనసాగింపుగా ఆయనే హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కిక్ - 2 చిత్రం షూటింగ్ జరుపుకొని... ఆగస్టు 21న విడుదలై ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సమస్య అంతా ఇక్కడే వచ్చిందట. ఇప్పటికే ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా నటించిన శ్రీమంతుడు చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 7న విడుదల అయింది.

శ్రీమంతుడు విడుదలైన అన్ని థియేటర్లలో హల్చల్ చేయడమే కాకుండా... కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాడు. ఇదే సమయంలో కిక్ - 2 విడుదల చేస్తే ఆ చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా తీసుకుంటారో అని మాస్ మహారాజా రవితేజ తెగ వర్రీ అవుతున్నాడు. ఇదే విషయాన్ని దర్శకుడు సురేందర్ రెడ్డితోపాటు ఆ చిత్రానికి ప్రోడ్యుసర్గా వ్యవహరించిన నందమూరి కల్యాణ్రామ్కు తెలిపినట్లు తెలిసింది. దాంతో వారు ఆలోచనలో పడినట్లు సమాచారం. కిక్ - 2లో రవితేజ సరసన హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement