జూన్‌లో ‘కిక్-2’?
జూన్‌లో ‘కిక్-2’?
Published Tue, Feb 11 2014 11:05 PM | Last Updated on Sat, Sep 2 2017 3:35 AM
2009లో బాక్సాఫీస్ వద్ద ‘కిక్’ సినిమా హంగామా అంతా ఇంతా కాదు. పాత్ర పోషణలో రవితేజ ఉత్సాహానికి, ఉత్తేజానికి ప్రతీకగా నిలిచిన సినిమా అది. ‘కిక్’ సినిమాకు సీక్వెల్ రానున్న విషయం తెలిసిందే. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలోనే హీరో కల్యాణ్‌రామ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం రవితేజ ‘పవర్’ షూటింగ్‌లో బిజీగా ఉంటే... దర్శకుడు సురేందర్‌రెడ్డి ‘రేసుగుర్రం’తో బిజీగా ఉన్నారు. మరి ‘కిక్-2’ మొదలయ్యేదెప్పుడు? అటు పరిశ్రమలోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ ఇదే ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం చూచాయగా దొరికేసింది.
జూన్‌లో ‘కిక్-2’ను సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారట. ఒకవైపు ‘రేసుగుర్రం’ పనిలో బిజీగా ఉంటూ, మరోవైపు ‘కిక్-2’ స్క్రిప్ట్‌ని కూడా సురేందర్‌రెడ్డి పూర్తి చేసినట్లు సమాచారం. ‘అతనొక్కడే’ చిత్రంతో సురేందర్‌రెడ్డిని దర్శకునిగా పరిచయం చేశారు కల్యాణ్‌రామ్. ఆ రుణాన్ని తీర్చుకోవడమే లక్ష్యంగా సురేందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. నిర్మాతగా కల్యాణ్‌రామ్‌కి ఘనవిజయం అందించాలనే కసితో ఆయన ఈ చిత్రాన్ని చేయనున్నట్లు సమాచారం.
Advertisement
Advertisement