కండే కాదు గుండె కూడా కలవాడు....
బాలీవుడ్ బాత్
సోనూ సూద్ మనకు విలన్. కాని పంజాబ్‌లో ఉన్న అతని సొంత ఊరులో హీరో. ఆరోగ్యం పట్ల, ఫిట్‌నెస్ పట్ల శ్రద్ధ ఉన్న సోనూ సూద్ పేద మధ్యతరగతి వాళ్లకు జిమ్ సౌకర్యం లేకపోవడాన్ని గమనించి తన ఊరు ‘మొగా’లో అత్యాధునికమైన జిమ్‌ను తెరిచాడు. విశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ జిమ్‌లో అన్ని రకాల సామాగ్రులు, జిమ్ పరికరాలు ఉన్నాయి. ఎవరైనా సరే వచ్చి ఉచితంగా వీటిని ఉపయోగించుకోవచ్చు. ఫిట్‌నెస్ పెంచుకోవచ్చు.
అంతేకాదు ఈ జిమ్‌లో దాదాపు 50 మంది ఉద్యోగులు పని చేస్తూ సోనూ వల్ల తమ జీవనాన్ని గడుపుతున్నారు. ఇటీవల సొంత ఊరు వచ్చిన సోను తన స్టాఫ్ అందరికీ ఉచితంగా సైకిళ్లు పంచిపెట్టాడు. సైక్లింగ్ ఆరోగ్యానికి మంచిది, పెట్రోల్ వాహనాల మీద రావడం కన్నా సైకిల్ మీద రావడం పర్యావరణానికి కూడా మంచిది. వాళ్ల ఖర్చు కూడా కొంచెం తగ్గించినట్టవుతుంది అన్నాడు సోనూ సూద్. మంచి పనే కదూ.