బాలీవుడ్‌లో మ్యాడ్‌మ్యాక్స్ విలన్! | Bollywood villain Mad Max | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌లో మ్యాడ్‌మ్యాక్స్ విలన్!

Published Tue, Oct 6 2015 11:12 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

బాలీవుడ్‌లో మ్యాడ్‌మ్యాక్స్ విలన్! - Sakshi

బాలీవుడ్‌లో మ్యాడ్‌మ్యాక్స్ విలన్!

మొన్న సమ్మర్‌లో రిలీజైన హాలీవుడ్ సూపర్‌హిట్ మూవీ ‘మ్యాడ్ మాక్స్’ సినిమాలో విలన్ గుర్తున్నాడా...? కండలు తిరిగిన దేహం... చూడగానే భయపెట్టే భారీ ఆకారమున్న నాథన్ జోన్స్ ప్రేక్షకులను అవలీలగా భయపెట్టేశాడు. రెజ్లర్‌గా రిటైరైన నాథన్ ప్రస్తుతం పలు హాలీవుడ్ చిత్రాల్లో విలన్‌గా నటిస్తున్నారు. నాథన్ జోన్స్‌పై ఇండియన్ ఫిలిం మేకర్స్ కన్ను పడింది. ఇటీవలే ఆయన తమిళంలో ‘జయం’ రవి హీరోగా నటించిన ‘భూలోగమ్’ సినిమాలో విలన్‌గా నటించారు.
 
  తాజాగా ఆయనను ఓ బాలీవుడ్ ఆఫర్ వరించింది. ఏక్తాకపూర్ నిర్మాతగా, బాలీవుడ్ నృత్యదర్శకుడు రెమో డిసౌజా తెరకెక్కించనున్న చిత్రం ‘ఎ ఫ్లయింగ్ జాట్’. టైగర్ ష్రాఫ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ జంటగా నటించనున్న ఈ చిత్రం ఓ సూపర్ హీరో కథగా రూపొందనుంది. ఇందులో సూపర్‌విలన్‌గా నాథన్ జోన్స్‌ను ఎంపిక చేశారు. ‘‘అతనితో యాక్షన్ సన్నివేశాలు తీయడానికి ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నా’’ అని దర్శకుడు రెమో డిసౌజా అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement