అప్పుడు కూతురు హీరోయిన్ ఇప్పుడు తండ్రి విలన్‌ | Arjun acting as villain to vishal | Sakshi
Sakshi News home page

అప్పుడు కూతురు హీరోయిన్ ఇప్పుడు తండ్రి విలన్‌

Published Tue, Feb 7 2017 2:46 AM | Last Updated on Tue, Sep 5 2017 3:03 AM

అప్పుడు కూతురు హీరోయిన్  ఇప్పుడు తండ్రి విలన్‌

అప్పుడు కూతురు హీరోయిన్ ఇప్పుడు తండ్రి విలన్‌

ఇప్పుడు సినిమా ట్రెండ్‌ మారుతుందనాలో, హీరోల మనసు మారుతుందనాలో తెలియదు గానీ ఒక కొత్త ఒరవడికి మాత్రం భీజం పడుతోంది. హీరోలు, హీరోయిన్లు ఇమేజ్‌ అనే చట్రం నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మంచి మాస్‌ హీరో ఇమేజ్‌ ఉన్న విశాల్‌ మళయాళంలో విలన్ గా నటించడానికి రెడీ అవుతున్నారు. అదే విధంగా యాక్షన్  కింగ్‌గా పేరొందిన అర్జున్ ఇప్పుడు విలన్ గా మారుతున్నారన్న తాజా సమాచారం. మరో విషయం ఏమిటంటే అర్జున్  కూతురు ఐశ్వర్య విశాల్‌ సరసన పట్టత్తు యానై చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అయ్యారన్నది తెలిసిందే.

ఇప్పుడు ఆమె తండ్రి అర్జున్  విశాల్‌కు విలన్ నికి సిద్ధం అవుతున్నారని తెలిసింది. ప్రస్తుతం మిష్కిన్ దర్శకత్వంలో తుప్పరివాలన్  చిత్రంలో నటిస్తున్న విశాల్‌ తదుపరి ఇరుంబు కుదిరై చిత్రంలో నటించనున్నారు. ఇందులో ఆయనకు విలన్ గా నటుడు ఆర్య నటించనున్నారనే ప్రచారం జరిగింది. ఆయన ఈ చిత్రం నుంచి వైదొలగడంతో ఆ పాత్రలో అర్జున్ నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని విశాల్‌ తన విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మించనున్నారు. కాగా అర్జున్  విశాల్‌కు గురువన్నది గమనార్హం. ఆయన వద్ద విశాల్‌ ఆదిలో సహాయ దర్శకుడిగా పని చేశారు. కాగా తనకు గురువు కావడంతో అర్జున్ కు విశాల్‌ పెద్ద మొత్తంలోనే పారితోషికాన్ని ముట్ట చెబుతున్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement