ప్రభు కూతురిని పెళ్లాడిన ప్రముఖ డైరెక్టర్‌, ఫోటో వైరల్‌ | Director Adhik Ravichandran Gets Married To Actor Prabhu Daughter Aishwarya Prabhu, Vishal Tweet Goes Viral - Sakshi
Sakshi News home page

Adhik Ravichandran Marriage Photos: ప్రముఖ డైరెక్టర్‌తో ప్రభు కూతురి రెండో పెళ్లి.. విశాల్‌ స్వీట్‌ వార్నింగ్‌..

Published Fri, Dec 15 2023 1:17 PM | Last Updated on Fri, Dec 15 2023 2:36 PM

Adhik Ravichandran Married to Aishwarya Prabhu - Sakshi

డార్లింగ్‌ అధిక్‌, నా ప్రియమైన సోదరి ఐశ్వర్య పెళ్లి బంధంతో ఒక్కటైనందుకు చాలా సంతోషంగా ఉంది. నా చెల్లిని పెళ్లి చేసుకున్న అధిక్‌.. నువ్వు తనను మహారాణిలా చూసుకోవాలి. అర్థమైందా? 

ప్రముఖ డైరెక్టర్‌ అధిక్‌ రవిచంద్రన్‌ పెళ్లిపీటలెక్కాడు. సీనియర్‌ నటుడు ప్రభు కూతురు ఐశ్వర్యను పెళ్లాడాడు. చెన్నైలో శుక్రవారం (డిసెంబర్‌ 15న) వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు హీరో విశాల్‌ సహా పలువురు సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫోటోను విశాల్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. 'డార్లింగ్‌ అధిక్‌, నా ప్రియమైన సోదరి ఐశ్వర్య పెళ్లి బంధంతో ఒక్కటైనందుకు చాలా సంతోషంగా ఉంది.

నా చెల్లిని మహారాణిలా చూసుకోవాలి
జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న మీకు అందరి ఆశీస్సులు ఉంటాయి. ముఖ్యంగా ప్రభు సర్‌, పునీత ఆంటీ ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉంటాయి. నా చెల్లిని పెళ్లి చేసుకున్న అధిక్‌.. నువ్వు తనను మహారాణిలా చూసుకోవాలి. అర్థమైందా? సరదాగా అన్నానులే.. నువ్వు తనను బాగా చూసుకుంటావని నాకు తెలుసు. అదేంటో కానీ నా సోదరీమణులందరూ ఐశ్వర్య అనే పేరుతోనే కనిపిస్తారు. మీ జంట జీవితాంతం సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని ఎక్స్‌ (ట్విటర్‌)లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది.

ఐశ్వర్యకు రెండో పెళ్లి..
కాగా ఐశ్వర్యకు ఇది రెండో పెళ్లి. 2009లో బంధువైన కునాల్‌తో ఆమె పెళ్లి జరిగింది. వివాహం తర్వాత భార్యాభర్తలిద్దరూ అమెరికాలో సెటిలయ్యారు. కానీ కొంతకాలానికి ఇరువురి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో భర్తకు విడాకులిచ్చేసి కొంతకాలంగా తల్లిదండ్రులతోనే ఉంటోంది. డైరెక్టర్‌ అధిక్‌ రవిచంద్రన్‌ విషయానికి వస్తే ఇతడు 'త్రిష ఇల్లన నయనతార' సినిమాతో దర్శకరచయితగా సినీ కెరీర్‌ ఆరంభించాడు. 'దబాంగ్‌ 3' అనే బాలీవుడ్‌ సినిమాకు రచయితగానూ పని చేశాడు. ఇటీవల 'మార్క్‌ ఆంటోని' సినిమాతో కోలీవుడ్‌కు బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఇచ్చాడు. ఈ డైరెక్టర్‌ 'కే-13', 'నేర్కొండ పార్వై', 'కోబ్రా' సినిమాల్లో అతిథి పాత్రలో నటించాడు. ప్రస్తుతం ఈ డైరెక్టర్‌ అజిత్‌తో ఓ సినిమా చేయనున్నట్లు టాక్‌!

చదవండి: మహారాణిలా బతకాలనుకున్నా.. 18 ఏళ్లు వచ్చేసరికే పెళ్లి, పిల్లలు, విడాకులు..

ప్రముఖ డైరెక్టర్‌తో ప్రభు కూతురి రెండో పెళ్లి (ఫొటోలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement