
విలన్‌గా శరత్‌కుమార్
నటుడు శరత్‌కుమార్ కొంచెం గ్యాప్ తరువాత పూర్తిగా ఇన్వాల్ అయి ఆయనే కథను వండి చిత్ర నిర్మాణంలో పాలు పంచుకుని కథా నాయకుడిగా నటించిన చిత్రం సండమారుతం. అంతేకాదు ప్రతి నాయకుడిగాను ఆయనే నటించడం విశేషం. మ్యాజిక్ ఫ్రేమ్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి రాధికా శరత్‌కుమార్, ఎస్టిన్ స్టీపెగ్‌లు నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరించారు. ఇంతకుముందు ఏయ్ వంటి కొన్ని విజయవంతమైన చిత్రాలను శరత్‌కుమార్ హీరోగా తెరకెక్కించిన దర్శకుడు ఎ.వెంకటేశ్ ఈ చిత్రానికి దర్శక బాధ్యతలు నిర్వహించారు.
మీరానందన్, ఓవియ నాయికలుగా నటించిన ఈ చిత్రంలో రాధారవి, సముద్రకణి, టాలీవుడ్ నటుడు నరేష్, తంబిరామయ్య, ఇమాన్ అన్నాచ్చి, వెన్నిరాడైమూర్తి, సింగం పులి, నళిని తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. సర్వేశ్వరన్ (శరత్‌కుమార్) అనే కరుడుగట్టిన దాదా మదురై దాని చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలను, పోలీసుల్ని కూడా ఎలా హడలెత్తించారు. ఈ పాత్రలో శరత్‌కుమార్ విజృంభించారు. అందుకు కారణాలేమిటి? అన్నదే సండమారుతం చిత్ర కథ.
పోలీసు అధికారి సూర్య (మరో శరత్‌కుమార్) సర్వేశ్వరన్‌ను ఎదుర్కొనడానికి ఎలాంటి వ్యూహం పన్నారు? దాన్ని ఫలితం ఏమిటి? అన్న పలు ఆసక్తికరమైన సన్నివేశాలతో ఉత్కంఠ భరిత యాక్షన్ సన్నివేశాలతో దర్శకుడు ఎ.వెంకటేశ్ తెరపై ఆవిష్కరించిన సండమారుతం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా 390 థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ప్రేక్షకులు విశేష ఆదరణను చూరగొనడంతో తొలి రోజు సాయంత్రమే అదనంగా మరో 70 థియేటర్లలో విడుదల చేసినట్లు చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి. అంతేకాదు మంచి విజయానందంలో ఉన్న శరత్‌కుమార్ యూనిట్ సభ్యులకు విందు ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నారట.