సూపర్ స్టార్ కోసం సింగర్గా..! | Raashi Khanna turns singer for Mohanlal Movie | Sakshi
Sakshi News home page

సూపర్ స్టార్ కోసం సింగర్గా..!

Published Thu, Apr 13 2017 1:40 PM | Last Updated on Tue, Sep 5 2017 8:41 AM

Raashi Khanna turns singer for Mohanlal Movie

తొలిసారిగా ఎన్టీఆర్ లాంటి టాప్ స్టార్ సరసన జోడి కట్టే అవకాశం రావటంతో ఫుల్ జోష్ లో ఉన్న రాశీఖన్నా ఇప్పుడు మరింత ఆనందంగా ఉంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో యమా బిజీగా ఉన్న ఈ బ్యూటీ మలయాళ ఎంట్రీకి సిద్ధమవుతోంది. అది కూడా మలయాళ సూపర్ స్టార్ మోహల్ లాల్ సినిమాతో కావటంతో రాశీ ఆనందానికి అవధుల్లేవు. అయితే తాజాగా ఈ భామకి మరో గోల్డెన్ ఆఫర్ వచ్చింది.

ఇప్పటికే తెలుగులో జోరు సినిమాలో టైటిల్ సాంగ్ పాడిన ఈ భామ, మోహన్ లాల్ సినిమాలోనే అదే ఫీట్ను రిపీట్ చేయబోతోంది. ఇప్పటికే పాటను రికార్డ్ చేసిన రాశీ, రికార్డ్ స్టూడియోలో దిగిన ఫోటోతో పాటు తన చిన్ననాటి ఫోటను సోషల్ మీడియా పేజ్లో పోస్ట్ చేసింది. నా చిన్ననాటి కల నెరవేరింది అంటూ ట్వీట్ చేసింది. విలన్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాశీ నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో విశాల్, హన్సిక, శ్రీకాంత్ లు కీలక పాత్రల్లో నటిస్తుండటంతో మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement