మరోసారి జయంరవితో అరవింద్‌సామి ఢీ | Prabhudeva to produce Jayam Ravi's next? | Sakshi
Sakshi News home page

మరోసారి జయంరవితో అరవింద్‌సామి ఢీ

Published Sat, Nov 28 2015 4:15 AM | Last Updated on Thu, Sep 27 2018 8:48 PM

మరోసారి జయంరవితో అరవింద్‌సామి ఢీ - Sakshi

మరోసారి జయంరవితో అరవింద్‌సామి ఢీ

జయంరవి, అరవింద్‌సామిలది హిట్ కాంబినేషన్. వీరిద్దరు కలిసి నటించిన తనీఒరువన్ విజయదుందుభి మ్రోగించిన విషయం తెలిసిందే. తాజాగా అరవింద్‌సామి మరోసారి జయంరవికి విలన్‌గా మారనున్నారన్నది కోలీవుడ్ టాక్. తనీఒరువన్ చిత్రం తరువాత జయంరవి రోమియో జూలియట్ చిత్రం ఫేమ్ లక్ష్మణన్ దర్శకత్వంలో ప్రభుదేవా నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో నటుడు విజయ్‌సేతుపతి గానీ, బాబీసింహ గానీ అతిథి పాత్రలో నటించే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది.  

తాజాగా ఈ చిత్రంలో అరవింద్‌సామి విలన్‌గా నటించనున్నారనే ప్రచారం జోరందుకుంది. ఇద్దరు ప్రముఖ నటీమణులు నటించనున్న ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం గురించి జరుగుతున్న ప్రచారం గురించి దర్శకుడు లక్ష్మణన్‌ను అడగ్గా తమ చిత్రంలో జయంరవికి విలన్‌గా అరవింద్‌సామిని నటింపజేయాలని భావించిన విషయం నిజమేనన్నారు. ఆయనకు కథను కూడా వినిపించినట్లు తెలిపారు.

అయితే అరవింద్‌సామి తన అంగీకారాన్ని చెప్పాల్సిందని అన్నారు.అయితే తాను కథ చెప్పి అరవింద్‌సామిని కన్విన్స్ చేయగలిగానని పేర్కొన్నారు. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రం తరువాత రోమియోజూలియట్ చిత్రాన్ని తెలుగులో దర్శకత్వం వహించనున్నట్లు, దాన్ని కేఎస్.రామారావు నిర్మించనున్నారని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement