Kollywood Talk
-
కమల్ హాసన్‌కు ప్రభుత్వం నోటీసులు ! కారణం ?
Is Kamal Haasan Get Notices From Tamil Nadu Government For Metro: యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ సుమారు నాలుగేళ్ల తర్వాత మాసీవ్ కమ్‌బ్యాక్ ఇచ్చిన చిత్రం 'విక్రమ్'. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్‌గా మారిన విషయం తెలిసిందే. ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి, సూర్య తమదైన నటనతో మెస్మరైజ్ చేశారు. జూన్ 3న విడుదలైన ఈ చిత్రం అంచనాలకు మించిన సక్సెస్ సాధించింది. రూ. 400 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్న కమల్ హాసన్‌కు షాక్ తగిలినట్లయింది. కమల్ హాసన్ ఇంటిన తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకోసం తమినాడు సర్కారు కమల్‌కు ఇప్పటికే నోటీసులు పంపించిందని కోలీవుడ్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం చెన్నైలో రెండో భాగం దశ మెట్రోను నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణంలో భాగంగానే అల్వార్ పేట స్టేషన్ కమల్ హాసన్ నివాసం నుంచే వెళ్తుంది. ఈ స్టేషన్ నిర్మాణం కోసం కమల్ భవనంలో 170 చదరపు అడుగులు కావాలట. ఈ స్థలం కోసమే కమల్‌కు ప్రభుత్వం నోటీసులు పంపించిందని టాక్. ఈ స్థలంలో ప్రధాన భాగం రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మక్కల్ నీది మయ్యం పార్టీ కార్యాలయాలు ఉన్నట్లు సమాచారం. చదవండి:👇 కేన్సర్‌తో పోరాటం.. అంతలోనే కరోనా.. 30 ఏళ్లకే స్టార్ నటుడు మృతి బాధాకరమైన పెళ్లిళ్లకు మీరే కారణం.. సమంత కామెంట్స్ వైరల్ అందుకు నాకు అర్హత లేదు: మహేశ్ బాబు వేశ్య పాత్రలో యాంకర్ అనసూయ..! -
రేర్ కాంబినేషన్లో.. ఇళయదళపతి..!
రేటేంబ కథా చిత్రాల దర్శకుడు పాండిరాజ్‌తో మాస్ హీరో విజయ్ చేతులు కలపనున్నారా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టార్ నటుడు విజయ్. బిగిల్ చిత్రం తరువాత ప్రస్తుతం మాస్టర్ అనే చిత్రంలో నటిస్తున్నారు. మలయాళ బ్యూటీ మాళవిక మోహన్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి మానగరం, ఖైదీ చిత్రాల ఫేమ్ లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి ఇటీవలే మాస్టర్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇది విజయ్ నటిస్తున్న 64వ చిత్రం. మాస్టర్ చిత్రం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. కాగా విజయ్ తదుపరి చిత్రం ఏమిటి? దర్శకుడెవరు? హీరోయిన్గా నటించే లక్కీచాన్స్‌ను దక్కించుకునే నటి ఎవరూ?.. అన్న ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ముఖ్యంగా విజయ్ అభిమానుల్లో కాస్త ఎక్కువగానే ఉంటుంది. అలాంటి వారకి తాజా సమాచారం ప్రకారం విజయ్ తదుపరి పాండిరాజ్ దర్శకత్వంలో నటించనున్నారన్నది. కాగా పాండిరాజ్ కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా ముద్ర వేసుకున్నారు. విశాల్‌తో పాండినాడు వంటి కమర్శియల్ కథా చిత్రాన్ని ఇంతకు ముందు తెరకెక్కించినా, ఎక్కువ చిత్రాలను చిన్న హీరోలతోనే చేశారు. ఈయన ఇటీవల కార్తీతో కడైకుట్టి సింగం, శివకార్తికేయన్ హీరోగా ఎంగవీట్టు పిళ్లై వంటి చిత్రాలను చేసి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు దళపతి విజయ్‌తో చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారన్నది తాజా సమాచారం. ఈ రేర్ కాంబినేషన్లో రానున్న చిత్రం ఎలా ఉంటుందన్న ఆసక్తి ఇప్పటి నుంచే నెలకొంది. కాగా దీనికి సంబంధించిన అధికారపూర్వక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
మళ్లీ ఆయనతో జతకడుతోంది..
అమలాపాల్ మరోసారి సిద్ధార్థ్‌తో రొమాన్స్‌కు సిద్ధమవుతోంది. ఈ కేరళాకుట్టికి ఈ మధ్య అవకాశాలు తగ్గుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇంతకుముందు తమిళం, తెలుగు, మలయాళం అంటూ వరుసగా చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్న అమలాపాల్‌ను వివాహానంతరం క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని అందరూ అనుకున్నారు. అలాంటిది ఈ అమ్మడిని తెరపై చూసి చాలా కాలం అవుతుండడంతో అవకాశాలు తగ్గాయా అని ఆమె అభిమానులకు అనుమానం కలుగుతోంది. అయితే త్వరలో అరవిందస్వామితో జత కట్టిన భాస్కర్ ఒరు రాస్కెల్ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం రాక్షసన్ అనే చిత్రంతో నటిస్తోంది. అదేవిధంగా ఒక మలయాళ చిత్రంలోనూ నటిస్తున్న అమలాపాల్‌కు చాలా గ్యాప్ తరవాత తెలుగులో అవకాశం వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా అమలాపాల్ సిద్ధార్థ్‌తో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ జంట 2012లో కాదలిల్ సొదప్పవదు ఎప్పడి అనే చిత్రంలో నటించారు. ఆ చిత్రం మంచి విజయాన్నే అందుకుంది. మళ్లీ సుమారు ఏడేళ్ల తరువాత వీరిద్దరూ కలిసి రొమాన్స్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి ఇంతకు ముందు లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్గా అరమ్ వంటి సంచలన చిత్రాన్ని తెరకెక్కించిన గోపినయినార్ దర్శకత్వం వహించినున్నారు. ఈయన్ని నయనతార అరమ్ చిత్రానికి సీక్వెల్ చేద్దాం అని చెప్పడంతో సిద్ధార్థ్, అమలాపాల్‌తో చేసే చిత్రాన్ని త్వరగా పూర్తి చేసే, తదుపరి నయనతారతో అరమ్-2 చేయనున్నట్లు తాజా సమాచారం. -
'దుల్కర్‌సల్మాన్‌తో హన్సిక రొమాన్స్?
దుల్కర్ సల్మాన్ మలయాళ సూపర్‌స్టార్ మమ్ముటి వారసుడన్న విషయం తెలిసిందే. వాయైమూడి పేసువుమ్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయిన ఈ మాలీవుడ్ యువ నటుడు మలి చిత్రంతోనే ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో (ఓ కాదల్ కణ్మణి)నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఆ రెండు చిత్రాలు విజయం సాధించడంతో దుల్కర్సల్మాన్ తమిళ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. మరోసారి మణిరత్నం దర్శకత్వంలో నటించే అవకాశాన్ని వదులుకున్న దుల్కర్ తాజాగా ఒక తమిళ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. విశేషమేమిటంటే ఇందులో దుల్కర్‌సల్మాన్‌తో క్రేజీ నటి హన్సిక జత కట్టనున్నారని తెలిసింది. ఈ రేర్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి దర్శక ద్వయం హరిశంకర్, హరీష్నారాయణన్ దర్శకత్వం వహించనున్నట్లు కోలీవుడ్ టాక్. ఈ క్రేజీ చిత్రాన్ని ఇంతకు ముందు అరణ్మణి వంటి సూపర్ హార్రర్ చిత్రాన్ని నిర్మించిన విజన్ ఐ మీడియా సంస్థ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రానికి సంబంధించిన అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. -
మరోసారి జయంరవితో అరవింద్‌సామి ఢీ
జయంరవి, అరవింద్సామిలది హిట్ కాంబినేషన్. వీరిద్దరు కలిసి నటించిన తనీఒరువన్ విజయదుందుభి మ్రోగించిన విషయం తెలిసిందే. తాజాగా అరవింద్‌సామి మరోసారి జయంరవికి విలన్‌గా మారనున్నారన్నది కోలీవుడ్ టాక్. తనీఒరువన్ చిత్రం తరువాత జయంరవి రోమియో జూలియట్ చిత్రం ఫేమ్ లక్ష్మణన్ దర్శకత్వంలో ప్రభుదేవా నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో నటుడు విజయ్‌సేతుపతి గానీ, బాబీసింహ గానీ అతిథి పాత్రలో నటించే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. తాజాగా ఈ చిత్రంలో అరవింద్‌సామి విలన్‌గా నటించనున్నారనే ప్రచారం జోరందుకుంది. ఇద్దరు ప్రముఖ నటీమణులు నటించనున్న ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం గురించి జరుగుతున్న ప్రచారం గురించి దర్శకుడు లక్ష్మణన్‌ను అడగ్గా తమ చిత్రంలో జయంరవికి విలన్‌గా అరవింద్‌సామిని నటింపజేయాలని భావించిన విషయం నిజమేనన్నారు. ఆయనకు కథను కూడా వినిపించినట్లు తెలిపారు. అయితే అరవింద్‌సామి తన అంగీకారాన్ని చెప్పాల్సిందని అన్నారు.అయితే తాను కథ చెప్పి అరవింద్‌సామిని కన్విన్స్ చేయగలిగానని పేర్కొన్నారు. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రం తరువాత రోమియోజూలియట్ చిత్రాన్ని తెలుగులో దర్శకత్వం వహించనున్నట్లు, దాన్ని కేఎస్.రామారావు నిర్మించనున్నారని వెల్లడించారు. -
విజయ్‌తో అమిజాక్సన్
ఇంగ్లీష్ బ్యూటీ అమిజాక్సన్కు అదృష్టం తేనెతుట్టిలాగా పట్టుకుంది. ఐ చిత్రం తరువాత తన రేంజ్ మారిపోతుందనే ఆమె నమ్మకం అక్షరాలా నిజమైంది. వరుసగా అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. సూర్యతో మాస్ చిత్రంలో నటించే అవకాశాన్ని జార విడుచుకున్నా ఆ తరువాత ధనుష్‌తో ఒక చిత్రం, ఉదయనిధి స్టాలిన్‌తో మరో చిత్రం చేసే అవకాశాలను అందుకుంది. ఈ రెండు చిత్రాలు ప్రారంభం కాకముందే అమిజాక్సన్ మరో భారీ అవకాశం వరించనుందన్నది తాజా సమాచారం. ఇళయదళపతి విజయ్‌తో రొమాన్స్ చేసే లక్కీ చాన్స్‌ను అమి కొట్టేసినట్లు కోలీవుడ్ టాక్. విజయ్ ప్రస్తుతం తన 58వ చిత్రం పులిని పూర్తి చేసే పనిలో ఉన్నారు. శింబుదేవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సోషియో, పోకలర్ కథాచిత్రంలో శ్రుతిహాసన్, హన్సికలు నాయకలుగా నటిస్తున్నారు. విజయ్ తన 59వ చిత్రానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని ఇంతకుముందు తుపాకీ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన కలైపులి ఎస్థాను భారీ ఎత్తున రూపొందించనున్నారు. ఈ చిత్రంలో ఇంతకుముందు కత్తి చిత్రంలో విజయ్‌తో రొమాన్స్ చేసిన సమంత మరోసారి డ్యూయెట్, పాడటానికి సిద్ధం అవుతుండగా మరో నాయకిగా అమిజాక్సన్ నటించనున్నారని సమాచారం. ఈ చిత్రంలోనూ ఇళయదళపతి ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తోంది. -
రజనీ, అమీర్ తో ఎందిరన్-2 ?
2010లో అద్భుత విజయాన్ని సాధించి తమిళ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన చిత్రం ఎందిరన్. అలాంటి చిత్రానికి సీక్వెల్ గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఆ చిత్ర కెప్టెన్ శంకర్ కూడా ఎందిరన్‌కు కొనసాగింపును తెరకెక్కించాలనుకుంటున్నారు. ఎందిరన్ చిత్రంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ రోబోగా, దాన్ని కనుగొన్న శాస్త్రవేత్తగా ద్విపాత్రాభినయం చేశారు. ఐశ్వర్యారాయ్ నాయకిగా నటించారు.ఈ చిత్ర సీక్వెల్ నిర్మాణం గురించి ఇటీవల మళ్లీ ప్రచారం ఊపందుకుంది. లింగా తరువాత రజనీ, ఐ చిత్రం తరువాత శంకర్ రిలాక్స్ అవడం అందుకు ఒక కారణం కావచ్చు. అయితే ఎందిరన్ చిత్రానికి కొనసాగింపు గురించి వీరిద్దరూ ఇటీవల కథా చర్చలు జరిపినట్లు కూడా కోలీవుడ్ టాక్. ఈ విషయంలో తాజా డెవలప్మెంట్ ఏమిటంటే ఎందిరన్-2లో సూపర్‌స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్ నటించే అవకాశం ఉంది. ఈ ఇద్దరిని కలిపి శంకర్ తమిళం, హిందీ భాషల్లో భారీ ఎత్తున వెండి తెరపై మరోసారి అద్భుతాలు చేయాలని ఆశిస్తున్నట్లు ఆ దిశగా ప్రయత్నాలు మొదలెట్టినట్లు సమాచారం. ఎందిరన్ చిత్ర నిర్మాణం 130 కోట్లుగా ప్రచారం అయ్యింది. అయితే ఈ చిత్రానికి అత్యధికంగా 200 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. శంకర్ ఐ చిత్రాన్ని 120 కోట్లతో తెరకెక్కించారు. కాగా అమీర్‌ఖాన్ నటించిన పికె చిత్ర నిర్మాణ వ్యయం 85 కోట్లు అని తెలిసింది. అయితే ఈ రెండు చిత్రాల బడ్జెట్ కలిపితే ఎందిరన్-2 తయారవుతుందన్నమాట. వీటిలో రజనీ, అమీర్‌ఖాన్, శంకర్ల పారితోషికమే 100 కోట్లకు చేరుతుందని మరో 100 కోట్లు నిర్మాణ వ్యయం అవుతుందనేది గణాంకాలు. చిత్ర ప్రచార ఖర్చు రూ.50 కోట్లు, పైగా మరో 50 కోట్లు వ్యయం ఉంటుందని మొత్తం 300 కోట్లు పెట్టుబడి పెట్టే నిర్మాత ముందుకు వస్తేనే ఎందిరన్-2 చిత్ర రూపకల్పన సాధ్యం అని సినీ పండితులు వాదన. వారి అంత భారీ బడ్జెట్‌తో చిత్రం చేయడానికి ఎవరు ముందుకు వస్తారన్నది ప్రశ్నార్థకం. -
విమర్శల వలలో ప్రియ
ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలన్నది ఆర్యోక్తి. అయితే నటి ప్రియాఆనంద్ ప్రవర్తన ఇందుకు భిన్నంగా ఉందనే అభిప్రాయం కోలీవుడ్‌లో వ్యక్తం అవుతోంది. మొన్నటి వరకు విజయం కోసం తహతహలాడిన ఈ బ్యూటీ ఇటీవల వరుసగా రెండు హిట్లు రావడంతో వాటిని తలకెక్కించుకున్నట్లు ప్రవర్తిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అమ్మడు ప్రస్తుతం నటుడు విమల్ సరసన ఒరు ఊరుల రెండు రాజా చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణ వ్యయం ముందుగా అనుకున్న దాని కంటే కోటిన్నర వరకు పెరిగి పోయిందట. ఇందుకు కారణం నటి ప్రియా ఆనందేనని అంటున్నారు. నిర్మాతల వద్ద ఆమె బాగా ఖర్చు పెట్టించిందనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కాస్ట్యూమ్స్ అలంకరణ సామగ్రి కోసం ప్రియా ఆనంద్ అధికంగా ఖర్చు చేయించినట్లు కోలీవుడ్ టాక్. మరో విషయం ఏమిటంటే ప్రియా ఆనంద్ తమిళ సంస్కృతి సంప్రదాయాలను మంట గలుపుతున్నట్లు ఆమె అభిమానులే ఆగ్రహిస్తున్నారు. పియా ఆనంద్ ఇంతకు ముందు చేసిన అరిమా నంబి చిత్రంలో మద్యంలో మునిగి తేలేలా నటించడాన్ని ఆమె అభిమానులు తీవ్రంగా ఖండిస్తూ ట్విట్టర్లో పేర్కొన్నారు. దీనికి ప్రియా ఆనంద్ ఘాటుగానే స్పందించారు. ఆడ - మగ సమానం అంటున్న ఈ రోజుల్లో మగవారు మద్యం సేవించగా లేనిది ఆడవారు సేవిస్తే తప్పా! మీకో న్యాయం మాకో న్యాయమా? అంటూ లా తీస్తుండడం ఆమె అభిమానులకే నచ్చడం లేదు. ప్రియా ఆనంద్ ప్రవర్తన మార్చుకోకపోతే సినిమాల్లో నిలదొక్కుకోవడం కష్టం అంటున్నారుు కోలీవుడ్ వర్గాలు.