Is Kamal Haasan Get Notices From Tamil Nadu Government For Metro - Sakshi
Sakshi News home page

Kamal Haasan: కమల్‌ హాసన్‌ ఇంటిని సర్కార్‌ స్వాధీనం చేసుకోనుందా ?

Published Sun, Jul 3 2022 9:17 PM | Last Updated on Mon, Jul 4 2022 8:33 AM

Is Kamal Haasan Get Notices From Tamil Nadu Government For Metro - Sakshi

Is Kamal Haasan Get Notices From Tamil Nadu Government For Metro: యూనివర్సల్‌ స్టార్‌ కమల్ హాసన్ సుమారు నాలుగేళ్ల తర్వాత మాసీవ్‌ కమ్‌బ్యాక్‌ ఇచ్చిన చిత్రం 'విక్రమ్‌'. లోకేష్ కనకరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్‌గా మారిన విషయం తెలిసిందే. ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి, సూర్య తమదైన నటనతో మెస్మరైజ్‌ చేశారు. జూన్‌ 3న విడుదలైన ఈ చిత్రం అంచనాలకు మించిన సక్సెస్ సాధించింది. రూ. 400 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్న కమల్‌ హాసన్‌కు షాక్‌ తగిలినట్లయింది. 

కమల్‌ హాసన్‌ ఇంటిన తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుందని సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకోసం తమినాడు సర్కారు కమల్‌కు ఇప్పటికే నోటీసులు పంపించిందని కోలీవుడ్‌ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం చెన్నైలో రెండో భాగం దశ మెట్రోను నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణంలో భాగంగానే అల్వార్‌ పేట స్టేషన్‌ కమల్ హాసన్‌ నివాసం నుంచే వెళ్తుంది. ఈ స్టేషన్‌ నిర్మాణం కోసం కమల్ భవనంలో 170 చదరపు అడుగులు కావాలట. ఈ స్థలం కోసమే కమల్‌కు ప్రభుత్వం నోటీసులు పంపించిందని టాక్‌. ఈ స్థలంలో ప్రధాన భాగం రాజ్ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్, మక్కల్‌ నీది మయ్యం పార్టీ కార్యాలయాలు ఉన్నట్లు సమాచారం. 

చదవండి:👇
కేన్సర్‌తో పోరాటం.. అంతలోనే కరోనా.. 30 ఏళ్లకే స్టార్‌ నటుడు మృతి
బాధాకరమైన పెళ్లిళ్లకు మీరే కారణం.. సమంత కామెంట్స్‌ వైరల్‌
అందుకు నాకు అర్హత లేదు: మహేశ్‌ బాబు

వేశ్య పాత్రలో యాంకర్‌ అనసూయ..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement