![Vijay Is Going To Do Next Film Under Direction Of Pandiraj - Sakshi](/styles/webp/s3/article_images/2020/01/15/5.jpg.webp?itok=Tp0m7xyW)
విజయ్, దర్శకుడు పాండిరాజ్
రేటేంబ కథా చిత్రాల దర్శకుడు పాండిరాజ్‌తో మాస్ హీరో విజయ్ చేతులు కలపనున్నారా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టార్ నటుడు విజయ్. బిగిల్ చిత్రం తరువాత ప్రస్తుతం మాస్టర్ అనే చిత్రంలో నటిస్తున్నారు. మలయాళ బ్యూటీ మాళవిక మోహన్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి మానగరం, ఖైదీ చిత్రాల ఫేమ్ లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి ఇటీవలే మాస్టర్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇది విజయ్ నటిస్తున్న 64వ చిత్రం. మాస్టర్ చిత్రం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది.
కాగా విజయ్ తదుపరి చిత్రం ఏమిటి? దర్శకుడెవరు? హీరోయిన్‌గా నటించే లక్కీచాన్స్‌ను దక్కించుకునే నటి ఎవరూ?.. అన్న ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ముఖ్యంగా విజయ్ అభిమానుల్లో కాస్త ఎక్కువగానే ఉంటుంది. అలాంటి వారకి తాజా సమాచారం ప్రకారం విజయ్ తదుపరి పాండిరాజ్ దర్శకత్వంలో నటించనున్నారన్నది. కాగా పాండిరాజ్ కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా ముద్ర వేసుకున్నారు. విశాల్‌తో పాండినాడు వంటి కమర్శియల్ కథా చిత్రాన్ని ఇంతకు ముందు తెరకెక్కించినా, ఎక్కువ చిత్రాలను చిన్న హీరోలతోనే చేశారు.
ఈయన ఇటీవల కార్తీతో కడైకుట్టి సింగం, శివకార్తికేయన్ హీరోగా ఎంగవీట్టు పిళ్‌లై వంటి చిత్రాలను చేసి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు దళపతి విజయ్‌తో చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారన్నది తాజా సమాచారం. ఈ రేర్ కాంబినేషన్‌లో రానున్న చిత్రం ఎలా ఉంటుందన్న ఆసక్తి ఇప్పటి నుంచే నెలకొంది. కాగా దీనికి సంబంధించిన అధికారపూర్వక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment