Thalapathy 67 Update: Samantha To Team Up With Vijay For Lokesh Kanagaraj Movie - Sakshi
Sakshi News home page

Samantha In Thalapathy 67: ఆ హీరోతో నాలుగోసారి సినిమా చేస్తున్న సమంత !

Published Sat, Jun 4 2022 7:48 AM | Last Updated on Sat, Jun 4 2022 9:30 AM

Samantha Team Up With Vijay And Lokesh Kanagaraj For Thalapathy 67 - Sakshi

Samantha Team Up With Vijay And Lokesh Kanagaraj For Thalapathy 67: తెలుగులో వరుస చిత్రాలతో దూసుకెళ్తుంది సమంత. శాకుంతలం, యశోద, ఖుషి సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్న సామ్‌ తాజాగా ఓ తమిళ చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని టాక్‌. కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ హీరోగా నటించనున్న 67వ (Thalapathy 67) చిత్రంలో హీరోయిన్‌గా నటించనుందట సమంత. ‘మాస్టర్‌’ వంటి హిట్‌ చిత్రం తర్వాత లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో విజయ్‌ హీరోగా ఓ సినిమా రూపొందనుంది. ఈ చిత్రంలో విజయ్‌కి జోడీగా సమంత ఫిక్స్‌ అయిందని కోలీవుడ్‌ టాక్‌.

‘కత్తి, తేరి, మెర్సల్‌’ వంటి చిత్రాల్లో మంచి జోడీ అనిపించుకున్నారు విజయ్‌-సమంత. తాజా చిత్రంలో నటిస్తే వీరిద్దరూ నాలుగోసారి జత కట్టినట్లు అవుతుంది. లోకేశ్‌ గత సినిమాలతో పోలిస్తే ఈ చిత్రంలో హీరోయిన్‌ పాత్రకు ప్రాధాన్యత ఉందని సమాచారం. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇదిలా ఉంటే.. సమంత లీడ్‌ రోల్‌లో నటించిన ‘శాకుంతలం, యశోద’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండగా, విజయ్‌ దేవరకొండ సరసన చేస్తున్న ‘ఖుషి’ షూటింగ్‌ జరుగుతోంది.  

చదవండి: సమంత చేతుల మీదుగా నూనుగు మీసాల సాంగ్‌ రిలీజ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement