Pandiraj directed
-
రేర్ కాంబినేషన్లో.. ఇళయదళపతి..!
రేటేంబ కథా చిత్రాల దర్శకుడు పాండిరాజ్‌తో మాస్ హీరో విజయ్ చేతులు కలపనున్నారా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టార్ నటుడు విజయ్. బిగిల్ చిత్రం తరువాత ప్రస్తుతం మాస్టర్ అనే చిత్రంలో నటిస్తున్నారు. మలయాళ బ్యూటీ మాళవిక మోహన్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి మానగరం, ఖైదీ చిత్రాల ఫేమ్ లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి ఇటీవలే మాస్టర్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇది విజయ్ నటిస్తున్న 64వ చిత్రం. మాస్టర్ చిత్రం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. కాగా విజయ్ తదుపరి చిత్రం ఏమిటి? దర్శకుడెవరు? హీరోయిన్గా నటించే లక్కీచాన్స్‌ను దక్కించుకునే నటి ఎవరూ?.. అన్న ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ముఖ్యంగా విజయ్ అభిమానుల్లో కాస్త ఎక్కువగానే ఉంటుంది. అలాంటి వారకి తాజా సమాచారం ప్రకారం విజయ్ తదుపరి పాండిరాజ్ దర్శకత్వంలో నటించనున్నారన్నది. కాగా పాండిరాజ్ కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా ముద్ర వేసుకున్నారు. విశాల్‌తో పాండినాడు వంటి కమర్శియల్ కథా చిత్రాన్ని ఇంతకు ముందు తెరకెక్కించినా, ఎక్కువ చిత్రాలను చిన్న హీరోలతోనే చేశారు. ఈయన ఇటీవల కార్తీతో కడైకుట్టి సింగం, శివకార్తికేయన్ హీరోగా ఎంగవీట్టు పిళ్లై వంటి చిత్రాలను చేసి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు దళపతి విజయ్‌తో చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారన్నది తాజా సమాచారం. ఈ రేర్ కాంబినేషన్లో రానున్న చిత్రం ఎలా ఉంటుందన్న ఆసక్తి ఇప్పటి నుంచే నెలకొంది. కాగా దీనికి సంబంధించిన అధికారపూర్వక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
చెన్నైలో కొన్ని రోజులు... తెన్‌కాశీలో 40 రోజులు!
మ్యాగ్జిమమ్ హీరోలు ఓ సినిమా చిత్రీకరణ పూర్తిచేసిన తర్వాత మరో సినిమా చిత్రీకరణ ప్రారంభిస్తారు. అందువల్ల, దర్శకులకు హీరోలతో పెద్ద చిక్కులేవీ వుండవు... షెడ్యూల్స్ విషయంలో! హీరోయిన్లు మాత్రం ఒక్కోసారి రెండు మూడు సినిమాలు చేస్తుండడంతో వాళ్ల కోసం కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు! ఇప్పుడు తమిళ హీరో కార్తీ, దర్శకుడు పాండిరాజ్, నిర్మాత సూర్యలది సేమ్ సిట్యువేషన్. తమ్ముడు కార్తీ హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో అన్నయ్య అండ్ హీరో సూర్య ఓ సినిమా నిర్మిస్తున్నారు. ఇందులో ‘అఖిల్’ ఫేమ్ సాయేషా సైగల్ హీరోయిన్. ఇప్పుడామె ప్యారిస్‌లో మరో తమిళ సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. అందువల్ల, ఆమె కోసం ఓ షెడ్యూల్‌ను కాస్త అలస్యంగా ప్లాన్ చేశారట! దర్శకుడు ఈలోపు చెన్నైలో హీరో, ఇతర తారాగణంపై సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ప్యారిస్ నుంచి రాగానే సాయేష ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటారు. చెన్నైలో కొన్ని రోజులు చిత్రీకరించిన తర్వాత, తెన్‌కాశీలో 40 రోజులు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. తెన్‌కాశీ అంటే... తమిళనాడులోని తిరుణవేళి జిల్లాలోని ఓ ప్రాంతం పేరు. కార్తీ సినిమాలో నేనున్నాను: సాయేషా సైగల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో తమిళ హీరోయిన్ ప్రియా భవానీశంకర్ కీలక పాత్రలో నటించనున్నారు. అయితే... మూవీ ఓపెనింగ్ రోజున ప్రియ ఎక్కడా కనిపించకపోవడంతో సినిమాలో ఆమె నటించడం లేదని వార్తలొచ్చాయి. వీటిని ఖండించారామె. ‘‘కార్తీ–పాండిరాజ్ మూవీలో నటించబోతున్నందుకు ఆనందంగా ఉంది. మై బ్యాడ్ లక్... ఓపెనింగ్ పిక్స్‌లో నేను కనిపించలేదు. అందువల్లే ఈ కన్ప్యూజన్. దీనికి ఐయామ్ సారీ’’ అని వివరణ ఇచ్చారు ప్రియ. ఈ సినిమా చిత్రీకరణ మధ్యలో రెండు మూడు రోజులు కార్తీ సెలవులు తీసుకోనున్నాడు. హెచ్. వినోద్ దర్శకత్వంలో ఆయన హీరోగా ‘ధీరమ్ అధిగారమ్ ఒండ్రు’ ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకొస్తుంది. రకుల్ హీరోయిన్గా నటించిన ఆ సినిమాను తెలుగులో ‘ఖాకి’గా విడుదల చేస్తున్నారు. -
రొంబ బిజీ!
అవును... సాయేషా సైగల్ రుంబ బిజీ. రొంబ అంటే... తమిళంలో చాలా అని అర్థం. ‘అఖిల్’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ మీద కోలీవుడ్వారి కన్నుపడింది. అంతే.. అక్కణ్ణుంచి ఆఫర్లు మొదలయ్యాయి. అందుకే ‘రొంబ’ అన్నాం. ఇప్పటికే అక్కడ ‘వనమగన్’ అనే సినిమా చేశారామె. ఇప్పుడు ‘జంగా’ అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఇది కాకుండా మరో తమిళ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఇంకో చాన్స్. కార్తీ హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో సాయేషాని అడిగారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే ప్రేమకథతో ఈ చిత్రం రూపొందనుంది. చెన్నైలో ఈ చిత్రం ప్రారంభోత్సవం జరిగింది. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ 17న ‘ఖాకి’ ద్వారా రానున్న కార్తీ ఆల్రెడీ ఈ విలేజ్ లవ్‌స్టోరీ కోసం రెడీ అవుతున్నారు. -
మావ వెయిటింగ్!
‘నీ కోసం నీ మావ వెయిట్ చేస్తున్నాడే భామా..’ అని కుర్రాడు కూనిరాగాలు తీస్తే, కుర్రదాని మనసు కరగకుండా ఉంటుందా? మావతో కాలు కదపకుండా ఉండగలుగు తుందా? కుర్రాడూ, కుర్రదీ చిందేయాలని ఫిక్స్ అయిపోయారు. ఆ బ్యూటీ అదాశర్మ. ఆ కుర్రాడేమో శింబు. పాండిరాజ్ దర్శకత్వంలో శింబు, నయనతార జంటగా నటించిన చిత్రం ‘ఇదు నమ్మ ఆళు’. ఒకప్పుడు ప్రేమించుకుని, విడిపోయాక కలిసి నటించడం మానేసిన శింబు, నయనతార దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత జత కట్టిన చిత్రం ఇదే. ఈ సినిమాకి అదే హైలైట్. కాగా, ప్రత్యేక ఆకర్షణగా నిలిచే పాట ఒకటుంది. ఈ పాటను బాగా డ్యాన్స్ చేయడంతో పాటు పేరున్న కథానాయికతో చేయించాలనుకున్నారట. హిందీలో నటించిన ‘హసీ తో ఫసీ’లో అదాశర్మ డ్యాన్స్ చూసి, ఈ పాటకు ఎంపిక చేశారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి స్పెషల్ సాంగ్ రాలేదని చెన్నై టాక్. తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్న అదా ఇప్పటివరకూ తమిళంలో ఒక్క సినిమా కూడా చేయలేదు. ఈ పాట ద్వారా తమిళ తెరపై కని పించనున్నారు. రెగ్యులర్ ఐటమ్ సాంగ్ అయితే ఒప్పుకునేవారు కాదట. ‘మామన్ వెయిటింగ్...’ అనే పదాలతో ఈ పాట మొదలవుతుంది. అంటే... తెలుగులో మావ వెయిటింగ్ అని అర్థం.