మావ వెయిటింగ్! | Pinakin Studios to release Simbu starrer ‘Idhu Namma Aalu’ in the US | Sakshi
Sakshi News home page

మావ వెయిటింగ్!

Published Thu, Mar 10 2016 10:57 PM | Last Updated on Sun, Sep 3 2017 7:26 PM

మావ వెయిటింగ్!

మావ వెయిటింగ్!

‘నీ కోసం నీ మావ వెయిట్ చేస్తున్నాడే భామా..’ అని కుర్రాడు కూనిరాగాలు తీస్తే, కుర్రదాని మనసు కరగకుండా ఉంటుందా? మావతో కాలు కదపకుండా ఉండగలుగు తుందా? కుర్రాడూ, కుర్రదీ చిందేయాలని ఫిక్స్ అయిపోయారు. ఆ బ్యూటీ అదాశర్మ. ఆ కుర్రాడేమో శింబు. పాండిరాజ్ దర్శకత్వంలో శింబు, నయనతార జంటగా నటించిన చిత్రం ‘ఇదు నమ్మ ఆళు’. ఒకప్పుడు ప్రేమించుకుని, విడిపోయాక కలిసి నటించడం మానేసిన శింబు, నయనతార దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత జత కట్టిన చిత్రం ఇదే. ఈ సినిమాకి అదే హైలైట్. కాగా, ప్రత్యేక ఆకర్షణగా నిలిచే పాట ఒకటుంది. ఈ పాటను బాగా డ్యాన్స్ చేయడంతో పాటు పేరున్న కథానాయికతో చేయించాలనుకున్నారట. హిందీలో నటించిన ‘హసీ తో ఫసీ’లో అదాశర్మ డ్యాన్స్ చూసి, ఈ పాటకు ఎంపిక చేశారు.

ఈ మధ్యకాలంలో ఇలాంటి స్పెషల్ సాంగ్ రాలేదని చెన్నై టాక్. తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్న అదా ఇప్పటివరకూ తమిళంలో ఒక్క సినిమా కూడా చేయలేదు. ఈ పాట ద్వారా తమిళ తెరపై కని పించనున్నారు. రెగ్యులర్ ఐటమ్ సాంగ్ అయితే ఒప్పుకునేవారు కాదట. ‘మామన్ వెయిటింగ్...’ అనే పదాలతో ఈ పాట మొదలవుతుంది. అంటే... తెలుగులో మావ వెయిటింగ్ అని అర్థం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement