Shimbu Nayanthara
-
శింబు ట్రిపుల్ ఏ ప్రారంభం
సంచలన నటుడు శింబు తాజా చిత్రం ఆదివారం ఉదయం దిండుగల్‌లో ప్రారంభమైంది. ఇదునమ్మఆళు చిత్రం తరువాత శింబు గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో అచ్చంయంబదు మడమయడా చిత్రంలో నటించారు. ఆ చిత్రం నిర్మాణం చివరి దశకు చేరుకుంది. దీంతో అన్బానవన్ అసరాధవన్ అడంగాదవన్ చిత్రానికి రెడీ అయ్యారు. త్రిష ఇల్లన్నా నయనతార చిత్రం ఫేమ్ ఆధిక్ రవిచందర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అన్భానవన్ అసరాదవన్ అదంగాదవన్(ఏఏఏ) అనే పేరును నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని మైఖెల్ రాయప్పన్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇందులో శింబు త్రిపాత్రాభినయం చేయడం విశేషం. ఆయనకు జంటగా ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు. అందులో ఒక పాత్రకు నటి శ్రీయ నటించనున్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది. మరో ఇద్దరు ఎవరన్నది తెలియాల్సి ఉంది. శింబు నటించనున్న మూడు పాత్రల్లో ఒకటి 80 ప్రాంతానికి చెందినది. ఈ పాత్రకు జంటగానే శ్రీయ నటించనున్నారు. ప్రారంభ దృశ్యాలను శింబు 80 ప్రాంత పాత్రతోనే ప్రారంభించారు. ఆయనతో పాటు నటుడు మహంత్ ముఖ్య పాత్రను పోషిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో తొమ్మిది పాటలు ఉంటాయని చిత్ర వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఇందులోని పాటలను యువన్ రెడీ చేశారట. శింబు గెటప్‌ల కోసం సీన్‌బుట్ అనే ప్రముఖ హాలీవుడ్ మేకప్‌మెన్‌ను రప్పించినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. -
మావ వెయిటింగ్!
‘నీ కోసం నీ మావ వెయిట్ చేస్తున్నాడే భామా..’ అని కుర్రాడు కూనిరాగాలు తీస్తే, కుర్రదాని మనసు కరగకుండా ఉంటుందా? మావతో కాలు కదపకుండా ఉండగలుగు తుందా? కుర్రాడూ, కుర్రదీ చిందేయాలని ఫిక్స్ అయిపోయారు. ఆ బ్యూటీ అదాశర్మ. ఆ కుర్రాడేమో శింబు. పాండిరాజ్ దర్శకత్వంలో శింబు, నయనతార జంటగా నటించిన చిత్రం ‘ఇదు నమ్మ ఆళు’. ఒకప్పుడు ప్రేమించుకుని, విడిపోయాక కలిసి నటించడం మానేసిన శింబు, నయనతార దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత జత కట్టిన చిత్రం ఇదే. ఈ సినిమాకి అదే హైలైట్. కాగా, ప్రత్యేక ఆకర్షణగా నిలిచే పాట ఒకటుంది. ఈ పాటను బాగా డ్యాన్స్ చేయడంతో పాటు పేరున్న కథానాయికతో చేయించాలనుకున్నారట. హిందీలో నటించిన ‘హసీ తో ఫసీ’లో అదాశర్మ డ్యాన్స్ చూసి, ఈ పాటకు ఎంపిక చేశారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి స్పెషల్ సాంగ్ రాలేదని చెన్నై టాక్. తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్న అదా ఇప్పటివరకూ తమిళంలో ఒక్క సినిమా కూడా చేయలేదు. ఈ పాట ద్వారా తమిళ తెరపై కని పించనున్నారు. రెగ్యులర్ ఐటమ్ సాంగ్ అయితే ఒప్పుకునేవారు కాదట. ‘మామన్ వెయిటింగ్...’ అనే పదాలతో ఈ పాట మొదలవుతుంది. అంటే... తెలుగులో మావ వెయిటింగ్ అని అర్థం.