శింబు ట్రిపుల్ ఏ ప్రారంభం | Triple a start with Shimbu | Sakshi
Sakshi News home page

శింబు ట్రిపుల్ ఏ ప్రారంభం

Published Mon, Jul 11 2016 2:13 AM | Last Updated on Mon, Sep 4 2017 4:33 AM

శింబు ట్రిపుల్ ఏ ప్రారంభం

శింబు ట్రిపుల్ ఏ ప్రారంభం

సంచలన నటుడు శింబు తాజా చిత్రం ఆదివారం ఉదయం దిండుగల్‌లో ప్రారంభమైంది. ఇదునమ్మఆళు చిత్రం తరువాత శింబు గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో అచ్చంయంబదు మడమయడా చిత్రంలో నటించారు. ఆ చిత్రం నిర్మాణం చివరి దశకు చేరుకుంది. దీంతో అన్బానవన్ అసరాధవన్ అడంగాదవన్ చిత్రానికి రెడీ అయ్యారు. త్రిష ఇల్లన్నా నయనతార చిత్రం ఫేమ్ ఆధిక్ రవిచందర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అన్భానవన్ అసరాదవన్ అదంగాదవన్(ఏఏఏ) అనే పేరును నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని మైఖెల్ రాయప్పన్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.


ఇందులో శింబు త్రిపాత్రాభినయం చేయడం విశేషం. ఆయనకు జంటగా ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు. అందులో ఒక పాత్రకు నటి శ్రీయ నటించనున్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది. మరో ఇద్దరు ఎవరన్నది తెలియాల్సి ఉంది. శింబు నటించనున్న మూడు పాత్రల్లో ఒకటి 80 ప్రాంతానికి చెందినది. ఈ పాత్రకు జంటగానే శ్రీయ నటించనున్నారు. ప్రారంభ దృశ్యాలను శింబు 80 ప్రాంత పాత్రతోనే ప్రారంభించారు. ఆయనతో పాటు నటుడు మహంత్ ముఖ్య పాత్రను పోషిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో తొమ్మిది పాటలు ఉంటాయని చిత్ర వర్గాలు తెలిపాయి. ఇప్పటికే  ఇందులోని పాటలను యువన్ రెడీ చేశారట. శింబు గెటప్‌ల కోసం సీన్‌బుట్ అనే ప్రముఖ హాలీవుడ్ మేకప్‌మెన్‌ను రప్పించినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement