‘‘పిల్లలకు చదువుతోపాటు ఆటపాటలు, సంగీతం కూడా చాలా ముఖ్యం. కానీ, ప్రస్తుతం ఎంతోమంది తల్లిదండ్రులు కేవలం చదువు, ర్యాంకులు అంటూ పిల్లలపై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో వారు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. పిల్లల్ని చదువుతోపాటు సంగీతం, ఆటపాటల్లోనూప్రోత్సహించాలని చెప్పే చిత్రమే ‘మ్యూజిక్ స్కూల్’’ అన్నారు శ్రియ.పాపారావు బియ్యాల స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘మ్యూజిక్ స్కూల్’.
► శ్రియ, శర్మాన్ జోషి, షాన్ ప్రధానపాత్రల్లో నటించారు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ నెల 12న ఈ చిత్రం విడుదల కానుంది. తెలుగులో ‘దిల్’ రాజు, హిందీలో ‘పీవీఆర్’ సినిమాస్ ‘మ్యూజిక్ స్కూల్’ని రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా సోమవారం విలేకరుల సమావేశంలో శ్రియ చెప్పిన విశేషాలు.
► ఐఏఎస్‌గా ఉన్నత స్థానంలో ఉన్నపాపారావుగారు సినిమాపై ΄్యాషన్‌తో ఐదారు కథలు సిద్ధం చేసుకున్నారు. వాటిలో ‘మ్యూజిక్ స్కూల్’ ఒకటి. ఈ కథ వినగానే ఎగై్జటింగ్‌గా అనిపించడంతో నటించేందుకు ఓకే చె΄్పాను. ‘సంతోషం’ చిత్రంలో నేను సంగీతం నేర్చుకునే స్టూడెంట్‌గా చేశా. ‘మ్యూజిక్ స్కూల్’లో సంగీతం నేర్పించే టీచర్‌పాత్ర నాది.
► పిల్లల్లో ఉండే ప్రతిభని తల్లితండ్రులు గుర్తించి,ప్రోత్సహించాలి. ఆ విషయంలో నేను లక్కీ. మా తల్లితండ్రులు ఏ విషయంలోనూ నాకు అడ్డు చెప్పకుండాప్రోత్సహించారు. మా అమ్మాయి రాధను కూడా చదువుతోపాటు సంగీతం, డ్యాన్స్, ఆటల్లో ప్రోత్సహిస్తాను.పాపారావుగారు ఈ మూవీని అద్భుతంగా తీశారు. ఈ సినిమాకి ఇళయరాజాగారి సంగీతం హైలైట్. ∙‘ఇష్టం’ (2001) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చాను. ఇన్నేళ్ల కెరీర్‌లో ఎంతోమంది దర్శకులతో పనిచేశా.. ఎన్నో వైవిధ్యమైనపాత్రలు చేశా.. ఇది నా అదృష్టంగా భావిస్తున్నా. నేను చేసే ప్రతిపాత్ర డ్రీమ్ రోల్‌లాంటిదే. ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం షూటింగ్‌లో ఐదురోజులు మాత్రమేపాల్గొన్నాను. నాపాత్ర నిడివి తక్కువే అయినా ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి క్యారెక్టర్‌ను సవాలుగా తీసుకుని చేస్తాను. ప్రస్తుతం రెండు కొత్త సినిమాల్లో నటిస్తున్నాను.
ఆ విషయంలో నేను లక్కీ
Published Tue, May 9 2023 4:14 AM | Last Updated on Tue, May 9 2023 9:09 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment