Sharman Joshi
-
ఆ విషయంలో నేను లక్కీ
‘‘పిల్లలకు చదువుతోపాటు ఆటపాటలు, సంగీతం కూడా చాలా ముఖ్యం. కానీ, ప్రస్తుతం ఎంతోమంది తల్లిదండ్రులు కేవలం చదువు, ర్యాంకులు అంటూ పిల్లలపై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో వారు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. పిల్లల్ని చదువుతోపాటు సంగీతం, ఆటపాటల్లోనూప్రోత్సహించాలని చెప్పే చిత్రమే ‘మ్యూజిక్ స్కూల్’’ అన్నారు శ్రియ.పాపారావు బియ్యాల స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘మ్యూజిక్ స్కూల్’. ► శ్రియ, శర్మాన్ జోషి, షాన్ ప్రధానపాత్రల్లో నటించారు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ నెల 12న ఈ చిత్రం విడుదల కానుంది. తెలుగులో ‘దిల్’ రాజు, హిందీలో ‘పీవీఆర్’ సినిమాస్ ‘మ్యూజిక్ స్కూల్’ని రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా సోమవారం విలేకరుల సమావేశంలో శ్రియ చెప్పిన విశేషాలు. ► ఐఏఎస్‌గా ఉన్నత స్థానంలో ఉన్నపాపారావుగారు సినిమాపై ΄్యాషన్‌తో ఐదారు కథలు సిద్ధం చేసుకున్నారు. వాటిలో ‘మ్యూజిక్ స్కూల్’ ఒకటి. ఈ కథ వినగానే ఎగై్జటింగ్‌గా అనిపించడంతో నటించేందుకు ఓకే చె΄్పాను. ‘సంతోషం’ చిత్రంలో నేను సంగీతం నేర్చుకునే స్టూడెంట్‌గా చేశా. ‘మ్యూజిక్ స్కూల్’లో సంగీతం నేర్పించే టీచర్పాత్ర నాది. ► పిల్లల్లో ఉండే ప్రతిభని తల్లితండ్రులు గుర్తించి,ప్రోత్సహించాలి. ఆ విషయంలో నేను లక్కీ. మా తల్లితండ్రులు ఏ విషయంలోనూ నాకు అడ్డు చెప్పకుండాప్రోత్సహించారు. మా అమ్మాయి రాధను కూడా చదువుతోపాటు సంగీతం, డ్యాన్స్, ఆటల్లో ప్రోత్సహిస్తాను.పాపారావుగారు ఈ మూవీని అద్భుతంగా తీశారు. ఈ సినిమాకి ఇళయరాజాగారి సంగీతం హైలైట్. ∙‘ఇష్టం’ (2001) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చాను. ఇన్నేళ్ల కెరీర్లో ఎంతోమంది దర్శకులతో పనిచేశా.. ఎన్నో వైవిధ్యమైనపాత్రలు చేశా.. ఇది నా అదృష్టంగా భావిస్తున్నా. నేను చేసే ప్రతిపాత్ర డ్రీమ్ రోల్లాంటిదే. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం షూటింగ్లో ఐదురోజులు మాత్రమేపాల్గొన్నాను. నాపాత్ర నిడివి తక్కువే అయినా ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి క్యారెక్టర్‌ను సవాలుగా తీసుకుని చేస్తాను. ప్రస్తుతం రెండు కొత్త సినిమాల్లో నటిస్తున్నాను. -
పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను ప్రోత్సహించాలి
‘‘దాదాపు 16 ఏళ్లుగాపాపారావుగారితో నాకు పరిచయం ఉంది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారునిగా చేశారాయన.పాపారావుగారు ‘మ్యూజిక్ స్కూల్’ సినిమా తీస్తున్నారని న్యూస్‌పేపర్స్‌లో చూసి తెలుసుకున్నాను. మంచిగా సినిమా చేయాలని కోరుకున్నాను. మ్యూజిక్ స్కూల్ ట్రైలర్, సాంగ్స్ బాగున్నాయి. ఈ సినిమా టైటిల్ ‘మ్యూజిక్ స్కూల్’. కానీ నాకు ఇప్పుడు మ్యూజిక్ యూనివర్సిటీ (ఇళయరాజాని ఉద్దేశించి) పక్కన నిలబడే అవకాశం కలిగింది’’ అని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. శ్రియా శరన్, శర్మాన్ జోషి, షాన్ ప్రధాన ప్రాత్రల్లో నటించిన ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రం ‘మ్యూజిక్ స్కూల్’. ఇళయరాజా సంగీత సారథ్యంలోపాపారావు బియ్యాల స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న రిలీజ్ కానుంది. తెలుగురాష్ట్రాల్లో ‘దిల్’ రాజు, హిందీలో ‘పీవీఆర్’ ద్వారా ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ‘మ్యూజిక్ స్కూల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో తెలంగాణ మంత్రి కేటీఆర్, ఇళయరాజా సంయుక్తంగా ‘మ్యూజిక్ స్కూల్’ ఆడియోను విడుదల చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ – ‘‘అయితే ఇంజనీర్ కావాలి.. లేకపోతే డాక్టర్ కావాలి అంటూ పిల్లల్లో ఆర్ట్స్ పట్ల ఉండే సృజనాత్మకను చంపేస్తున్నాం. అలా చేయకూడదు’ అనే అంశంతో ‘మ్యూజిక్ స్కూల్’ సినిమా తీశామనిపాపారావుగారు చెప్ప్రారు. నా కొడుకుకి 17 ఏళ్లు. ఒక ప్రాట ప్రాడానని, రిలీజ్ చేస్తున్నానని మూడు నెలల క్రితం ‘గోల్డెన్ ఆర్’ అనే ఆల్బమ్ కవర్ చూపించాడు. మ్యూజిక్‌లో శిక్షణ తీసుకోనప్పటికీ తన స్కిల్స్, వాయిస్ చూసి చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఇలా చాలా మంది పిల్లల్లో ప్రతిభ దాగి ఉంటుంది. ఆ ప్రతిభను మనం తొక్కేయకుండా వారి (పిల్లలు) మనసుకు నచ్చింది చేసేలా ప్రోత్సహించాలంటూ ఈ ‘మ్యూజిక్ స్కూల్’ తీసినందుకుపాపారావుగారికి అభినందనలు’’ అన్నారు. ‘‘ఇరవయ్యేళ్ల క్రితం ఓ డాక్యుమెంటరీ తీశాను. అది చూసి రమేష్ ప్రసాద్‌గారు నాకు జాతీయ అవార్డు వస్తుందన్నారు. ఆయన చెప్పినట్లే ఆరు నెలల తర్వాత ఆ డాక్యుమెంటరీ ఫిల్మ్‌కి అవార్డు వచ్చింది. ఇళయరాజాగారి వద్దకు ‘మ్యూజిక్ స్కూల్’ స్క్రిప్ట్ తీసుకుని వెళ్లి, ‘ఈ సినిమాలో 11 ప్రాటలు ఉన్నాయి సార్’ అనగానే.. పది నిమిషాల్లో ఓకే అన్నారు. ఇళయరాజాగారు ఈ ప్రాజెక్ట్‌లోకి రాకపోయి ఉంటే నేను రాసిన కొన్ని స్క్రిప్ట్స్లాగే ఈ కథని కూడా పక్కన పెట్టేవాడిని’’ అన్నారుపాపారావు. ‘‘ఓ సినిమాకు, ఓ ఐఏఎస్ ఆఫీసర్‌కు సంబంధం లేదు. ఎంతో ఫ్యాషన్ ఉండబట్టిపాపారావుగారు ఈ సినిమాను నిర్మించి, దర్శకత్వం వహించారు. పిల్లలకు, తల్లిదండ్రులకు ఈ సినిమా ఓ మంచి సందేశంలాంటిది. ‘మ్యూజిక్ స్కూల్’ను స్కూల్స్‌లోనూ ప్రదర్శించాలనుకుంటున్నాం’’ అన్నారు ‘దిల్’ రాజు. -
మ్యూజిక్ స్కూల్లో అడ్మిషన్ తీసుకోనున్న శ్రియా సరన్!
‘మ్యూజిక్ స్కూల్’లో అడ్మిషన్ తీసుకోనున్నారు శ్రియ. కానీ ఈ మ్యూజిక్ స్కూల్ సంగీతం నేర్చించే అకాడమీ కాదు. సంగీతం ద్వారా పిల్లల చదువుల గురించి చెప్పే ‘మ్యూజిక్ స్కూల్’ సినిమాలో ఆమె కథానాయికగా నటించనున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా బాణీలు అందిస్తారు. ‘విల్లింగ్ టు శాక్రిఫైజ్’ డాక్యుమెంటరీతో జాతీయ స్థాయి అవార్డులు సాధించిన బియ్యాల పాపారావు దర్శకత్వంలో ఈ సినిమాను యామినీ ఫిలింస్ నిర్మించనుంది. శర్మాన్ జోషి, శ్రియ ప్రధాన పాత్రల్లో నటించనున్న ఈ బహు భాషా చిత్రంలో బ్రహ్మానందం, ప్రకాశ్‌రాజ్ తదితరులు కీలక పాత్రధారులు. డాక్టర్లను, ఇంజినీర్లను చేయడానికి పిల్లలను క్రీడలకు, కళలకు దూరం చేస్తున్న అంశం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందట. ఇందులో దాదాపు పన్నెండు పాటలు ఉంటాయని సమాచారం. ఈ సినిమాకు లండన్ బేస్డ్ సినిమాటోగ్రాఫర్ కిరణ్ దేవ్హాన్స్ (హిందీ చిత్రం ‘జోధాఅక్బర్’కు వర్క్ చేశారు) వర్క్ చేయనున్నారు. -
‘షోలే’ నటుడు కన్నుమూత
బాలీవుడ్‌తోపాటు గుజరాతీ సినిమాల్లో నటించిన పాత తరం నటుడు అరవింద్ జోషి (84) కన్నుమూశారు. ప్రస్తుత గుజరాతీ నటుడు శర్మాన్ జోషి అతడి కుమారుడు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో వారం కిందట ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన బంధువు సరితా జోషి మీడియాకు తెలిపారు. అరవింద్ జోషి హిందీలో ‘షోలే’, ‘లవ్ మ్యారేజ్’, ‘నామ్’, ‘ఇత్తేఫక్’ తదితర చిత్రాల్లో నటించారు. అయితే మాతృభాష గుజరాతీలో ‘గర్వో గరాసియో’, ‘ఘెర్ ఘెర్ మతినా చులా ’ తదితర సినిమాలు చేశాడు. ఆయన మృతికి బాలీవుడ్, గుజరాతీ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. అరవింద్ జోషికి భార్య, ఇద్దరు కుమారులు శర్మాన్ జోషి, మాన్సి జోషి. వీరిద్దరూ నటులుగా కొనసాగుతున్నారు. శర్మన్ జోషి త్రీ ఇడియట్స్ సినిమాలో అమీర్ ఖాన్‌తో కలిసి నటించిన విషయం తెలిసిందే. అరవింద్ జోషి మృతి పట్ల నటుడు పరేశ్ రావల్, మరికొందరు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. -
వివాహితగా...!
‘మీ పెళ్లెప్పుడు?’ అనడిగితే... ‘సమయం వచ్చినప్పుడు’ అని చెబుతుంటారు కాజల్ అగర్వాల్. నిజజీవితంలో గృహిణి ఎప్పుడవుతారో తెలియదు కానీ, ఓ హిందీ చిత్రంలో మాత్రం ఆ పాత్ర పోషించనున్నారు. ‘సీజ్ ఫైర్’ అనే ఇరానియన్ మూవీకి రీమేక్ ఇది. షర్మాన్ జోషి, కాజల్ అగర్వాల్ నాయకా నాయికలుగా అజయ్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. సెప్టెంబర్‌లో షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నారు. ఈ చిత్రకథ విషయానికొస్తే... చిరుకోపాలు, సరదా సరదా అలకలతో తమ సంసార జీవితాన్ని హాయిగా సాగించే భార్యాభర్తల మధ్య అనుకోకుండా మనస్పర్థలు నెలకొంటాయి. వ్యవహారం విడాకుల వరకూ వచ్చాక, అసలు తప్పెవరిదో ఆలోచించడం మొదలుపెడతారు. చివరికి తమ తప్పులు తెలుసుకుని, కలిసి జీవించాలనుకుంటారు. ఇందులో భార్యాభర్తలుగా షర్మాన్, కాజల్ నటించనున్నారు. ఇరాన్లో ‘సీజ్ఫైర్’ ఘనవిజయం సాధించింది. 2006లో విడుదలైన ఈ చిత్రం ఇరానియన్ చలనచిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. హాలీవుడ్ చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్’ ఆధారంగా ఈ చిత్రం రూపొందించారట. హిందీ వెర్షన్ కోసం కథలో చిన్న చిన్న మార్పులు చేస్తున్నారని సమాచారం.