Bollywood Senior Actor Arvind Joshi Dies- Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌లో విషాదం: ‘షోలే’ నటుడు కన్నుమూత

Published Fri, Jan 29 2021 2:20 PM | Last Updated on Fri, Jan 29 2021 2:52 PM

Senior Actor Arvind Josh passes away - Sakshi

బాలీవుడ్‌తోపాటు గుజరాతీ సినిమాల్లో నటించిన పాత తరం నటుడు అరవింద్‌ జోషి (84) కన్నుమూశారు. ప్రస్తుత గుజ‌రాతీ న‌టుడు శ‌ర్మాన్ జోషి అతడి కుమారుడు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ఆరోగ్యం విషమించ‌డంతో వారం కిందట ముంబైలోని నానావ‌తి ఆస్ప‌త్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉద‌యం క‌న్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన బంధువు స‌రితా జోషి మీడియాకు తెలిపారు.

అరవింద్‌ జోషి హిందీలో ‘షోలే’, ‘ల‌వ్ మ్యారేజ్’‌, ‘నామ్’, ‘ఇత్తేఫక్‌‌’ తదిత‌ర‌ చిత్రాల్లో నటించారు. అయితే మాతృభాష గుజ‌రాతీలో ‘గ‌ర్వో గ‌రాసియో’, ‘ఘెర్ ఘెర్  మ‌తినా చులా ’ త‌దిత‌ర సినిమాలు చేశాడు. ఆయ‌న మృతికి బాలీవుడ్‌, గుజ‌రాతీ సినీ ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేశారు. అర‌వింద్ జోషికి భార్య‌, ఇద్ద‌రు కుమారులు శ‌ర్మాన్ జోషి, మాన్సి జోషి. వీరిద్దరూ నటులుగా కొనసాగుతున్నారు. శర్మన్‌ జోషి త్రీ ఇడియట్స్‌ సినిమాలో అమీర్‌ ఖాన్‌తో కలిసి నటించిన విషయం తెలిసిందే. అరవింద్‌ జోషి మృతి పట్ల నటుడు పరేశ్‌ రావల్‌, మరికొందరు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement