breaking news
sholay movie
-
షోలే... అప్పుడది... తుపాన్ ఇండియా
సినిమా మొత్తం రెండు జతలకు మించి వాడని హీరోలు.. హీరోయిన్ ఏమో టాంగేవాలీ.. ఇంకో హీరోయిన్ వితంతువు.. ముఖ్య క్యారెక్టర్ ఆర్టిస్టుకు రెండు చేతులూ ఉండవు.. విలన్‌కు గట్టిగా చూస్తే 20 మందికి మించి గ్యాంగ్ లేదు.. లొకేషన్ ఉత్త రాళ్లదిబ్బలు.. ఇవాళ్టి పాన్ ఇండియా సినిమాలతో పోల్చి చూస్తే ఈ లక్షణాలతో ఏదైనా సినిమా సూపర్ హిట్ అవుతుందా? అవుతుంది.. అయ్యింది.. అవుతూనే ఉంది.. ‘షోలే’ – ఒక ప్రెజెంట్ కంటిన్యుయెస్ టెన్స్ 50 ఏళ్లుగా ‘షోలే’ లిఖించిన రికార్డులు ఎన్నో. చెప్పిన కొటేషన్లు మరెన్నో. ‘జో డర్ గయా.. సమ్ఝో మర్గయా’.. మరణమే లేని షోలేతో ప్రేక్షకుల వీడని దోస్తీ గురించి ప్రత్యేక కథనం..‘పుష్ప’ సినిమా రెండు పార్ట్‌లుగా వచ్చి కోట్లు సంపాదించింది. ఒక గంధపు చెక్కల స్మగ్లర్ హీరోనా అని ఒకరిద్దరు క్వశ్చన్ చేశారు. కాని సగటు జనం జానేదో అని సూపర్‌హిట్ చేశారు. ఈ సగటు జనం ఇక్కడి వరకూ చేయడానికి చాలా మెట్లు పడ్డాయి. వాటిలో ‘షోలే’ (Sholay Movie) ఒకటి.సలీమ్–జావేద్ హిందీలో యాంగ్రీ యంగ్మేన్ను తెచ్చారు. అంటే స్వాతంత్య్రం వచ్చాక జన్మించి, యుక్త వయసు వచ్చేనాటికి అంటే 1970ల నాటికి దేశ స్థితి చూస్తే ఆకలి, దరిద్రం, నిరుద్యోగం, బ్లాక్ మార్కెట్. రోజులు ఇలా ఉంటే అమ్మాయి వెంట పరిగెత్తి విరహగీతాలు పాడే హీరో చెల్లుబాటు కాడు అని వాళ్లు కోపంగా ఉండే హీరోని తెచ్చారు. ‘జంజీర్’లో అమితాబ్ అలాంటి హీరో. ఇతను ఇన్స్పెక్టర్గా ఉంటూ కూడా తన తల్లితండ్రులను చంపినవాణ్ణి చట్టప్రకారం శిక్షించలేకపోతాడు. యూనిఫామ్‌ను వదిలాకే పగ సాధిస్తాడు. చట్టానికి ఆవల కొన్ని పనులు చేసే హీరోలు అలా పుట్టుకొచ్చారు. ఆ తర్వాత ‘దీవార్’ వచ్చింది. కష్టపడి పని చేసే హీరోకు బదులు అడ్డదారిలో స్మగ్లర్‌గా మారే హీరోగా కనిపిస్తాడు అమితాబ్. సినిమాలో నిజాయతీపరుడైన శశికపూర్ (Shashi Kapoor) ఉన్నా అందలానికి ఎదిగిన అమితాబ్‌ను ఆరాధిస్తాడు ప్రేక్షకుడు. ఈ వరుసలోనే వచ్చింది ‘షోలే’. ఇక్కడ అత్యంత దుర్మార్గుడైన గబ్బర్ సింగ్‌ను సంహరించడానికి ఇద్దరు చిల్లర దొంగలను కాంట్రాక్ట్ మీద పట్టుకొస్తాడు ఊరి పెద్ద ఠాకూర్. చిల్లర దొంగల్లో వీరత్వం ఉండటం, కొంచెం మానవత్వం ఉండటంతో మేలు చేయని పోలీసుల కంటే కొద్దిగా కీడు చేసే చిల్లర దొంగలే నయం అనుకుంటారు రామ్‌గఢ్ వాసులు, తద్వారా ప్రేక్షకులు. ఆ విధంగా సకల సద్గుణ శోభితుడైన హీరోకు నూకలు చెల్లుతూ వచ్చి ‘పుష్ప’ వరకూ అతడు రూపాంతరం చెందాడు.‘షోలే’ కథ అంతా రెండు లైన్లలో చె ప్పొచ్చు. గొప్ప కథలు ఏవంటే కట్టె కొట్టె తెచ్చె అన్నట్టుగా చెప్పగలిగేవే. పోలీస్ ఆఫీసర్ ఠాకూర్ కుటుంబాన్ని గబ్బర్ సింగ్ చంపేశాడు. ఆ ప్రాంతానికి పీడగా మారాడు. వాణ్ణి చంపడానికి ఠాకూర్ ఇద్దరు దొంగలను కిరాయికి తెచ్చాడు. అంతే కథ. ఈ కథను మూడున్నర గంటల పాటు 70 ఎం.ఎం స్క్రీన్ మీద దర్శకుడు, నటీనటులు, రచయితలు, కెమెరామేన్, సంగీత దర్శకుడు ఎలా చూపారనేదే అసలు సంగతి. వాళ్లు ఎలా చూపారంటే అలా మరెవరూ, మరెప్పుడూ చూపలేకపోయారు. అందుకే షోలే అంటే షోలే. ఇలాంటి సినిమాలు సర్పాల తలలపై మణుల వంటివి. రీమేక్‌లని ప్రయత్నిస్తే మణులు రాళ్లయిపోతాయి. లేదా పాము కాటు తప్పదు. అందుకే ‘షోలే’ను మళ్లీ మళ్లీ ముస్తాబు చేసి వదిలారు తప్ప రీమేక్ అంటే జనం తుపాకులు తీశారు.‘షోలే’ యాక్షన్ సినిమా అనుకుంటారు. ఫక్తు కుటుంబ కథా చిత్రం. కుటుంబమే దీనికి ఆధారం. ఠాకూర్ కుటుంబాన్ని గబ్బర్ గాడు కాల్చి చంపాడు. కుటుంబం కోల్పోతే మనిషికి ఉండే బాధతో ప్రేక్షకుడు ఐడెంటిఫై అవుతాడు. ఆ రోజుల్లో మగవారి ఎర్లీ డెత్స్ వల్ల ప్రతి ఇంటా ఒక వితంతువు ఉండేది. జయభాదురి (Jaya Bhaduri) వేసిన రాధ పాత్రను ప్రేక్షకులు పోల్చుకున్నారు. భర్త పోయిన ఎన్నో ఏళ్లకు ఆమె ‘జయ్’ అనే అమితాబ్‌ను చూసి మళ్లీ అతనితో కుటుంబాన్ని నిర్మించుకోవచ్చేమో అని ఆశ పడుతుంది. ఆ ఆశ ప్రేక్షకులకు తెలుసు. ఆమెకో కుటుంబం ఏర్పడాలని వారూ అనుకుంటారు. జరగదు. జయ్ చనిపోతాడు. ప్రేక్షకులు అక్కడా కనెక్ట్ అవుతారు. ఏ తాడూ బొంగరం లేని వీరూ అను ధర్మేంద్ర టాంగేవాలీతో సరసం చేసి సాధించుకుంది మౌసీతో పాటు ఒక కుటుంబాన్నే కదా! ఇక కథలో ఇమామ్ గారి కుటుంబానికి వచ్చిన బాధ ఎవరు మరుస్తారు. చేతికి ఎదిగొచ్చిన కొడుకు పట్నం పోయి సంపాదిస్తాడనుకుంటే తండ్రిని ఏకాకిని చేసి గబ్బర్ చేతుల్లో ప్రాణాలు కోల్పోతాడు. కుటుంబం ఉనికే భారతదేశ సమాజపు ఉనికి. ఇన్ని కుటుంబాల ఉద్వేగాల అల్లిక కాబట్టే ‘షోలే’ ఆడింది. ఆడుకుంది.‘షోలే’ ప్రివ్యూ కోసం థియేటర్లో కూచున్న రాజ్‌కపూర్ (Raj Kapoor) సినిమా మొదలైన పది నిమిషాల్లోనే మొదలయ్యే ట్రైన్ రాబరీ సీక్వెన్స్ చూసి చకితుడయ్యాడు. ‘ఇదేంటి... క్లయిమాక్స్‌ను ముందే పెట్టేశారు’ అన్నాడట పక్కనున్న వారితో. అవును ‘షోలే’ క్లయిమాక్స్ ముందే వచ్చేస్తుంది... అంత భారీగా. ఆ తర్వాత ‘షోలే’ను కేవలం సన్నివేశాల బలం మీద నడుపుతారుగాని యాక్షన్ మీద కాదు. ‘షోలే’ క్లయిమాక్స్ కేవలం ఠాకూర్, గబ్బర్ సింగ్‌ల మీదే! చేతుల్లేని ఠాకూర్ చేతులు తెగ్గొట్టే గబ్బర్‌తో తలపడతాడు. ఇలా స్క్రీన్‌ప్లే రాసిన ‘షోలే’ ఆడిందంటే ఏమిటి మర్మం! అదేమిటో ఎవరూ చెప్పలేరు. చెప్పినా కొంతే. రొంతే. అంతంతే. షోలేకు వ్యాఖ్యానం లేదు.1973లో మొదలెట్టి రెండేళ్ల పాటు తీశారు ‘షోలే’. కార్పెట్లు అమ్మి, ఆ తర్వాత రియల్ ఎస్టేట్ చేసి సంపాదించిన డబ్బును కొడుక్కు ఇచ్చి సినిమా చేయమన్నాడు నిర్మాత జి.పి.సిప్పీ. కోటి రూపాయల సినిమా! వస్తే చాలా డబ్బులు రావాలి పోతే కోటి అన్నాడు. అందుకు తగ్గ కథ రమేష్ సిప్పీ రాయించుకున్నాడు సలీమ్ జావేద్‌లతో! అతని వేడి చూసి – వాళ్లు కూడా రంగంలో దిగారు. ‘లోహా గరమ్ హై... మార్ దో హథోడా’ (ఇనుము వేడి మీద ఉన్నప్పుడే సమ్మెట పోటు పడాలి) అనుకున్నారు. ఠాకూర్, గబ్బర్ సింగ్‌ల మధ్య ఇద్దరు దొంగలను ప్రవేశపెట్టి కథ అల్లారు. దీనికి ప్రేరణ అకిరా కురసావా ‘సెవన్ సమురాయ్’, మనం తీసిన ‘మేరా గావ్ మేరా దేశ్’... ఇంకొన్ని సినిమాలు ఉన్నాయి. అన్నీ తీసుకుని మనది ఇవ్వడం కూడా విద్యే. ఆ విద్యతో తయారైన ఈ కథకు ద్వారకా దివేచా కెమెరా, రామ్ యెదేకర్ ఆర్ట్ డైరెక్షన్, ఎం.ఎస్.షిండే ఎడిటింగ్, ఆర్.డి.బర్మన్ సంగీతం... గంధపు చేతులకు మల్లెలు చుట్టాయి. మరి రమేష్ సిప్పీ ఇంత మంచి టేకింగ్‌ను ఎలా సాధించాడో అతనికే తెలియాలి. ధర్మేంద్ర, అమితాబ్, అంజాద్ ఖాన్, సంజీవ్ కుమార్, హేమ మాలిని, జయభాదురి... ఎవరికి ఎవరు తక్కువ. సత్తువ చూపడం వారికి మక్కువ.‘షోలే’లో ప్రతి సన్నివేశానికి, ప్రతి ఫ్రేమ్‌కు అభిమానులున్నారు. అందులోని ప్రతి చిన్న పాత్రకూ అభిమానులున్నారు. జైల్లో గూఢచారిగా పని చేసే బార్బర్ హరిరామ్, పిరిమిగా కట్టెలు అమ్మే సూర్మా భూపాలి, నమక్ తినే కాలియా, గబ్బర్‌కు బదులు పలికే సాంబా, హిట్లర్ జైలర్, ఠాకూర్ నమ్మినబంటు రామ్‌లాల్, పిల్లనిచ్చేందుకు ధర్మేంద్ర గుణగణాలు ఆరాతీసే మౌసీ, ‘మెహబూబా’ పాటలో మెరిసిన జలాల్ ఆగా... ప్రతి ఒక్కరూ... సినిమాను ధన్యం చేశారు... ధన్యులయ్యారు. ప్రేమ నాటకం కోసం వాటర్ ట్యాంకర్ ఎక్కిన ధర్మేంద్ర ‘చక్కీ పీసింగ్’ (తిరగలి తిప్పింగ్) అంటాడు. ప్రేక్షకులు నవ్వుతారు. ‘సూసైడ్’ అంటే ఆత్మహత్య అని ధర్మేంద్ర వల్లే జనానికి ఇంగ్లిష్‌లో తెలిసింది.‘షోలే’ తన శబ్దాలతో కూడా మనకు కనెక్ట్ అవుతుంది. రైలు కూతా, గుర్రపు డెక్కల చప్పుడు, జట్కా మువ్వలు, అజాన్, దూది ఏకే కవాను, కమ్మరి మోత... ఇక ఈ సినిమాకు ముందు రివాల్వరు, రైఫిలు పేలితే అలాంటి సౌండ్ వస్తుందని ప్రేక్షకులకు తెలియదు. బ్రిటిష్ స్టంట్‌మెన్ ఈ సినిమాకు స్టంట్ కొరియోగ్రాఫర్లుగా పని చేశారు. ట్రైన్ రాబరీలో ఒక బుల్లెట్ తగిలి గూడ్సు పెట్టెకు అంటించిన సర్కారు కాగితం చిట్లుతుంది. అలాంటి ఒక్క షాటు తర్వాతి కాలంలో తీయలేకపోయారు.‘షోలే’ గొప్పతనం తెల్లార్లు చెప్పుకోవాలి. గబ్బర్ సింగ్ (Gabbar Singh) పేరు వాడుకుని ఒక హిట్ సినిమా తీసుకున్న మనం ‘షోలే’ యాభై ఏళ్ల సందర్భంగా ఉత్సవం తప్పక చేసుకోవాలి. ఈ సినిమాను తిరగేసి గుహనాథన్ కథ చెప్తే బాగుందని రామానాయుడు గారు ‘కక్ష’ తీశారు. ఇందులోని కొన్ని సీన్లు దర్శకేంద్రుడి ‘అడవి రాముడు’కు పనికి వచ్చాయి. ‘షోలే’ ఎందరినో డైరెక్టర్లు అయ్యేలా చేసింది. రైలుతో మొదలయ్యి రైలుతో ముగిసే ఈ సినిమా భారతీయ ప్రేక్షకులతో యాభై ఏళ్ల ప్రయాణం చేసింది. ఇంకో యాభై ఏళ్లు ఇకపై చేస్తుంది.ఏ దోస్తీ హమ్ నహీ తోడెంగే తోడెంగే దమ్ మగర్ తేరా సాథ్ న ఛోడెంగె...న ఛోడెంగె...పంచ్ డైలాగ్స్ ఫలానా దర్శకుడు వచ్చాక, ఫలానా రచయిత వచ్చాక ట్రెండ్‌లోకి వచ్చాయి అని ఎవరైనా అంటే నోటితోనే నవ్వబుద్ధవుతుంది. సకల పంచ్ డైలాగ్‌లకు బాప్ ‘షోలే’. అందులో ప్రతి మాటా ఒక పంచ్ డైలాగే. పైగా అవి నిత్య జీవితంలోకి వచ్చేసిన డైలాగులు. కొటేషన్లు. సూక్తులు.→ ఇజ్జత్ కీ మౌత్ జిల్లత్ కీ జిందగీ సే కయీ అచ్ఛీ హై (పరాభవాలతో బతికే కన్నా పరువుతో చావడం మేలు)→ ముఝేతో సబ్ పోలీస్ వాలోంకీ సూరతే ఏక్ జైసీ లగ్ తీ హై(నాకు అందరు పోలీసోళ్ల ముఖం ఒకలాగే కనిపిస్తుంది)→ తేరా క్యా హోగా కాలియా (నీ గతేంది కాలియా)→ తుమ్హారా నామ్ క్యా హై బసంతి? (నీ పేరేంటి బసంతి)→ దామ్ జో తుమ్ చాహో... ఔర్ కామ్ జో మై చాహూ (సొమ్ము మీరు కోరినంత... పని నేను చెప్పినంత) – కె. -
నా సినిమా టిక్కెట్ రూ.20: అమితాబ్ పోస్ట్ పై చర్చ...
ప్రతి ఆదివారం జుహులో తన ఇంటి ముంగిటకు వచ్చే అభిమానులను పలకరించే దశాబ్దాల సంప్రదాయానికి పేరుగాంచిన అమితాబ్ బచ్చన్ ఇంకా ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ బాలీవుడ్ మెగాస్టార్ అభిమానులను పలకరించిన తరువాత తన బ్లాగులో ఈ సమావేశానికి సంబంధించిన కొన్ని ఫోటోలను, కొన్ని సందేశాలను కూడా పంచుకుంటారు. ఇది సర్వసాధారణంగా జరిగేదే అదే విధంగా ఆయన తాజాగా కూడా ఓ పోస్ట్ పెట్టారు. అందులో భావోద్వేగ భరిత సందేశాలు కూడా ఉన్నాయి. అయితే వీటన్నింటి కన్నా అందరినీ ఆకట్టుకుంది 1975 నాటి భారతీయ సంచలనం... క్లాసిక్ సినిమా ’షోలే’ సినిమా టిక్కెట్. దాదాపు 50 ఏళ్ల వయసు కలిగిన ఈ టిక్కెట్‌ను అత్యంత జాగ్రత్తగా భధ్రపరచిన అమితాబ్ సోషల్ మీడియా ద్వారా దానిని అభిమానులతో పంచుకున్నారు. అంతేకాదు ఈ టిక్కెట్ ధర కేవలం రూ. 20 మాత్రమేననే విషయాన్ని ఆయన గుర్తు చేశారు .ఆయన తన పోస్ట్‌లో ‘‘‘’షోలే’ టికెట్‌ను జాగ్రత్తగా భద్రపరిచా... ఈ టిక్కెట్ అప్పుడు రూ. 20 !! ధర.. ఈ రోజుల్లో థియేటర్ హాళ్లలో ఎరేటెడ్ డ్రింక్ (సాఫ్ట్ డ్రింక్) ధర అదే నని నాకు చెప్పారు. అది నిజమా?? చెప్పడానికి చాలా ఉంది, కానీ చెప్పడానికి కాదు.. ఆప్యాయత ప్రేమ,‘ అంటూ ఆయన ఆ పోస్ట్‌లో నర్మగర్భంగా రాశారు.అయితే అమితాబ్ తన దగ్గరున్న ఈ టికెట్ ను పోస్ట్ చేయడం ఎంత ఆసక్తి కలిగించిందో నెటిజన్ల పాజిటివ్ రెస్పాన్స్ అందుకుందో.. అలాగే ఆయన రూ.20కి థియేటర్లో సాఫ్ట్ డ్రింక్ కొనవచ్చునని అనడం కూడా అంత చర్చకు దారి తీసింది. ఎందుకంటే ప్రస్తుతం ధియేటర్లలో రూ.20కి సాఫ్ట్ డ్రింక్ కొనే పరిస్థితి లేదు. రూ.100 ఆ పై ధరల్లో మాత్రమే అవి అందుబాటులో ఉన్నాయి. ఈ నేపధ్యంలో అమితాబ్ రూ.20కే లభిస్తాయనడంతో... సెలబ్రిటీలకు ధరలపై ఉన్న అవగాహన చాటుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాకుండా మల్టీ ఫ్లెక్స్ థియేటర్లలో టిక్కెట్ల ధరలు అదే విధంగా తినుబండారాల ధరలకు సంబంధించిన సోషల్ చర్చకు కూడా బిగ్ బి పోస్ట్ దారి తీసింది.మరోవైపు 1975లో విడుదలైన ‘షోలే‘, వచ్చే ఆగస్టు 15తో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది, ఇందులో అమితాబ్‌తో పాటు ధర్మేంద్ర కూడా నటించారు ఈ సినిమా ఆ సంవత్సరం భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. రమేష్ సిప్పీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, జై వీరు (అమితాబ్ మరియు ధర్మేంద్ర పోషించారు) అనే ఇద్దరు మాజీ ఖైదీల చుట్టూ తిరుగుతుంది, నటులు అమ్జాద్ ఖాన్, సంజీవ్ కుమార్ మరియు హేమ మాలిని మరియు జయ బచ్చన్ ఈ చిత్రంలోని తారాగణాన్ని ముగించారు. -
థియేటర్లలో ఫ్లాప్.. కానీ 25 కోట్ల టికెట్స్ సేల్.. ఆ సినిమా ఏదంటే? (ఫొటోలు)
-
ఎక్కువ మంది చూసిన ఇండియన్ సినిమా ఇదే! బాహుబలి, దంగల్ కాదు!
సినిమా అంటే వినోదం. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి కలర్‌ఫుల్ స్క్రీన్స్ వరకు, మూకీ సినిమాల నుంచి టాకీ చిత్రాల దాకా ఎక్కడా ఎంటర్టైన్మెంట్కు ఇసుమంత లోటు కూడా కనిపించదు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు సిద్ధంగా ఉంటుంది చిత్రపరిశ్రమ. అటు ప్రేక్షకులు కూడా సినిమాలను ఆస్వాదిస్తారు, అందులో నటించే హీరోహీరోయిన్లను ఆరాధిస్తారు. ఒకప్పుడు సినిమాలు థియేటర్లలో పాతిక, యాభై, వంద, రెండు వందల రోజులు కూడా ఆడేవి. కానీ ఇప్పుడు.. ఎంత పెద్ద సినిమా అయినా మూడు వారాలకు తట్టాబుట్టా సర్దాల్సిందే! ఇప్పటివరకు తీసిన సినిమాల్లో ఏ చిత్రాన్ని ఎక్కువమంది చూశారో తెలుసా? బాహుబలి, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, దంగల్ సినిమాలనుకుంటే పొరపాటే! అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన షోలే. అంజాద్ ఖాన్‌కు ఇది తొలి చిత్రం. ఇందులో ధర్మేంద్ర, హేమమాలిని, జయా బచ్చన్.. ఇలా అగ్రతారలు నటించారు. అప్పట్లో ఈ సినిమాకు టికెట్ల ఊచకోత జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల టికెట్లు అమ్ముడుపోయాయి. దర్శకుడు రమేశ్ సిప్పీ తెరకెక్కించిన ఈ ఐకానిక్ చిత్రం 1975లో రిలీజైంది. తొలి షోకే హిట్ టాక్.. ఫలితంగా ఆల్‌టైం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు, అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ రికార్డును దశాబ్ద కాలంపాటు ఎవరూ టచ్ కూడా చేయలేకపోయారు. షోలే తొలిసారి రిలీజైనప్పుడు, అలాగే రీరిలీజ్ అయినప్పుడు మొత్తంగా భారత్‌లో 15-18 కోట్ల టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇతర దేశాల్లో కూడా షోలేకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇది ఏ రేంజ్లో ఉందంటే ఒక్క రష్యాలోనే 6 కోట్ల టికెట్లు కొనేశారు అక్కడి జనాలు. ఇతర దేశాల్లో తక్కువలో తక్కువ 2 కోట్ల దాకా టికెట్లు అమ్ముడుపోయాయట! అంటే ప్రపంచవ్యాప్తంగా 22 -26 కోట్ల దాకా టికెట్లు అమ్ముడుపోవడంతో భారతీయ సినీచరిత్రలో షోలే రికార్డు సృష్టించింది. అప్పుడు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.35 కోట్ల దాకా రాబట్టింది. ఇప్పటి ద్రవ్యోల్బణంతో పోలిస్తే దాని విలువ సుమారు రూ.2800 కోట్ల దాకా ఉంటుంది. టాప్ 10 చిత్రాలు కేవలం భారత్‌లో అత్యధికంగా టికెట్లు అమ్ముడుపోయిన సినిమాల జాబితా విషయానికి వస్తే.. షోలే 15 కోట్లతో తొలి స్థానంలో ఉంది. బాహుబలి 2: ది కన్‌క్లూజన్ 12 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. మొఘల్ ఇ ఆజమ్, మదర్ ఇండియా.. చెరో 10 కోట్లు, హమ్ ఆప్కే హై కోన్..7.4 కోట్లు, ముఖద్దార్ కా సికిందర్.. 6.7 కోట్లు, అమర్ అక్బర్ ఆంటోని.. 6.2 కోట్లు, క్రాంతి.. 6 కోట్లు, బాబీ.. 5.3 కోట్లు, గంగా జమున.. 5.2 కోట్లు, గదర్, కేజీఎఫ్ చాప్టర్ 2, సంఘం.. చెరో 5 కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. చదవండి: క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న రష్మిక? -
'త్వరలో షోలే-2 రాబోతుంది.. సిద్ధంగా ఉండండి'
ఇటీవలే న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా టి20 సిరీస్‌పై కన్నేసింది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని టీమిండియా తొలి టి10 ఆడేందుకు రాంచీలో అడుగుపెట్టింది. సీనియర్లు అయిన రోహిత్, కోహ్లి లేకుండానే పాండ్యా కెప్టెన్సీలో మరో టి20 సిరీస్ ఆడనుంది. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 ప్రపంచకప్‌లో సెమీస్ వైఫల్యం అనంతరం బీసీసీఐ కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్ నుంచి పాండ్యాకు అప్పజెప్పింది. వచ్చే టి20 వరల్డ్‌కప్ వరకు సరికొత్త జట్టును తయారు చేయాలనే లక్ష్యంతో పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వగా.. దానిని అతను సమర్థంగా నిర్వహిస్తూ వస్తున్నాడు. ఇప్పటికే ఐర్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంకలపై టి20 సిరీస్‌లు గెలిచిన పాండ్యా.. తాజాగా మరోసారి రోహిత్ గైర్హాజరీలో కివీస్‌తో టి20 సిరీస్‌కు టీమిండియాను నడిపించనున్నాడు. ఇక శుక్రవారం(జనవరి 27న) రాంచీ వేదికగా కివీస్, భారత్‌ల మధ్య తొలి టి20 మ్యాచ్ జరగనుంది. ఇక రాంచీ టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనికి స్వస్థలమన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాగా బుధవారం రాత్రి టీమిండియా రాంచీలో అడుగుపెట్టింది. మరుసటి రోజే హార్దిక్ పాండ్యా తన అభిమాన ఆటగాడు ధోనితో గడిపేందుకు అతని ఇంటికి వెళ్లాడు. ధోని ఇంట్లో ఉన్న బైక్ గ్యారేజీ సెంటర్లో సరదాగా గడిపాడు. ఈ సందర్భంగా పాండ్యా.. ధోనిని మోటార్‌సైకిల్‌లో సైడ్కార్లో ఎక్కించుకున్న ఫోటోను షేర్ చేశాడు. ''త్వరలో షోలే-2 మీ ముందుకు రాబోతుంది.. సిద్ధంగా ఉండండి'' అంటూ కామెంట్ చేశాడు. షోలే(1975) సినిమా భారతీయ సినీ చరిత్రలో ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికి ఈ సినిమా ఏదో ఒక చోట ఆడుతూనే ఉంది. భారతీయ సినిమా గర్వించదగ్గ షోలే సినిమాలో అమితాబ్, ధర్మేంద్రలు ''యే దోస్తీ హమ్ నహీ చోడేంగే..'' పాట సందర్భంగా ఇదే తరహాలో బైక్‌పై వెళ్లడం గుర్తుండే ఉంటుంది. డ్రైవర్ సీటులో ధర్మేంద్ర ఉంటే.. పక్కన సైడ్కార్లో అమితాబ్ కూర్చొని పాట పాడుకుంటూ వెళ్తారు. అచ్చం అదే ఫోటోని రిపీట్ చేసిన పాండ్యా.. మోటార్‌సైకిల్‌ను తాను డ్రైవ్ చేయగా.. పక్కన సైడ్కార్లో ధోని దర్జాగా కూర్చొన్నాడు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Sholay 2 coming soon 😉 pic.twitter.com/WixkPuBHg0 — hardik pandya (@hardikpandya7) January 26, 2023 చదవండి: టాప్‌లెస్‌గా దర్శనం.. 'అలా చూడకు ఏదో అవుతుంది' విన్యాసం బాగానే ఉంది.. ఆ ఎక్స్‌ప్రెషన్‌కు అర్థమేంటి! -
ధావన్: 'జట్టుకు దూరమయ్యావు! ఎంటర్టైన్మెంట్తో బతికేస్తున్నావా'
టీమిండియా సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్ ఫామ్‌ను కోల్పోయి జట్టులో చోటు కోల్పోయాడు. ప్రస్తుత పరిస్థితులు దృష్యా ధావన్ జట్టులోకి రావడం కష్టమేనని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కానీ ఇవేవి పట్టించుకోకుండా టీమిండియాలోకి రావాలని గబ్బర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగానే విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగాడు. అయితే ఐదు మ్యాచ్‌లు కలిపి (12,8,14,12,0).. 56 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దీంతో ధావన్ రీఎంట్రీపై నీలీనీడలు కమ్ముకున్నాయి. చదవండి: 10 ఫోర్లు, 4సిక్స్‌లు.. సెంచరీతో చెలరేగిన శ్రీలంక బ్యాటర్! ఆటకు దూరంగా ఉన్నప్పటికి ధావన్ తన అభిమానులను అలరించాలనుకున్నాడు. అందుకు తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక ఫన్నీ వీడియోనూ షేర్ చేశాడు. బాలీవుడ్ బ్లాక్బాస్టర్ షోలే సినిమాలో విలన్ గబ్బర్‌సింగ్ పాపులర్ డైలాగ్ ''కిత్నే ఆద్మీ తే''ను తన స్టైల్లో అనుకరించాడు. ప్రస్తుతం ధావన్ చెప్పిన డైలాగ్ వైరల్‌గా మారింది. అయితే ధావన్ వీడియో చేయడంపై టీమిండియా ఫ్యాన్స్ ట్రోల్ చేశారు.'' టీమిండియాకు ఎలాగో దూరమయ్యావు.. ఎంటర్టైన్మెంట్ మీద పడ్డావు. ఇలాంటివి మానేసి ఆటపై దృష్టి పెడితే బాగుంటుంది..'' అంటూ కామెంట్స్ చేశారు. ఇక ధావన్ టీమిండియా తరపున టి20 ప్రపంచకప్‌కు ముందు శ్రీలంకతో జరిగిన వన్డే, టి20 సిరీస్‌లో ఆఖరిసారిగా పాల్గొన్నాడు. లంక పర్యటనకు వెళ్లిన రెండో టీమిండియా జట్టుకు ధావన్ కెప్టెన్సీ చేశాడు. టి20 సిరీస్‌ను లంక గెలుచుకోగా.. వన్డే సిరీస్‌ను మాత్రం టీమిండియా 2-1 తేడాతో దక్కించుకుంది. ఇక అప్పటినుంచి ధావన్ మళ్లీ టీమిండియాకు ఆడలేదు. చదవండి: IND Vs SA: అతడు ప్రపంచ స్ధాయి బౌలర్.. సౌతాఫ్రికాకు ఇక చుక్కలే! View this post on Instagram A post shared by Shikhar Dhawan (@shikhardofficial) -
గబ్బర్ సింగ్ జయంతి.. 10 పవర్ఫుల్ డైలాగ్‌లు
Amjad Khan Birth Anniversary: సినిమాల్లో హీరోల తర్వాత పవర్‌ఫుల్‌గా ఉండే క్యారెక్టర్లు విలన్లవే. వారు ఎంత విలనిజం చూపిస్తే హీరోకు అంత మంచిపేరు వస్తుంది. అలాంటి చాలా మంది విలన్లను బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ చూసింది. కానీ అందులో గబ్బర్ సింగ్ మాత్రం ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటాడు. అత్యంత చెడ్డవాడిగా, గొప్ప విలన్‌గా ఎవరైనా ఉన్నారంటే అది నిస్సందేహంగా గబ్బర్ అవుతాడు. ఆ పాత్రలో నటించిన అంజాద్ ఖాన్ తప్ప మరెవరూ ఆ ఐకానికి క్యారెక్టర్‌కు న్యాయం చేయలేకపోయేవారేమో. షోలేలో అతని నటన అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, హేమమాలిని, జయా బచ్చన్, ఇతరులను కనపడకుండా చేసిందంటే అతిశయోక్తి కాదు. అంతటి గొప్ప నటనను కనబర్చిన అంజాద్ ఖాన్ 81వ జయంతి రేపు (నవంబర్ 12). ఆయన జయంతి సందర్భంగా షోలే చిత్రంలో అంజాద్ ఖాన్ కొట్టిన డైలాగ్‌లను ఓసారి గుర్తు చేసుకుందామా. 1. కిత్నే ఆద్మీ తే.. 2. జబ్ తక్ తేరే పైర్ చలేంగే ఉస్కీ సాన్స్ చలెగీ.. తేరే పైర్ రూకే తో యే బందూక్ చలేగీ 3. తేరా క్యా హోగా కాలియా ? 4. జో డర్ గయా.. సమ్జో మర్ గయ 5. యహా సే పచాస్ పచాస్ కోస్ దూర్ గావో మే.. జబ్ బచ్చా రాత్ కో రోతా హై, తో మా కెహెతీ హై బేటే సో జావో.. సోజా నహీ తో గబ్బర్ సింగ్ ఆ జాయేగా 6. హోలీ కబ్ హై.. కబ్ హై హోలీ, కబ్? 7. యే రామ్‌ఘర్ వాలే ఆప్నీ బేటియోంకా కౌన్ చక్కీ కా పిసా ఆతా కిలాతే హై రే? 8. క్యా సమజాకర్ ఆయే తే.. కీ సర్దార్ బహుత్ ఖుష్ హోగా, శెభాషీ దేగా? 9. చే గోలీ ఔర్ ఆద్మీ తీన్.. బహుత్ నయిన్సాఫీ హై యే 10. యే హాత్ హమ్ కో దే ఠాకూర్.. -
‘షోలే’ నటుడు కన్నుమూత
బాలీవుడ్‌తోపాటు గుజరాతీ సినిమాల్లో నటించిన పాత తరం నటుడు అరవింద్ జోషి (84) కన్నుమూశారు. ప్రస్తుత గుజరాతీ నటుడు శర్మాన్ జోషి అతడి కుమారుడు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో వారం కిందట ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన బంధువు సరితా జోషి మీడియాకు తెలిపారు. అరవింద్ జోషి హిందీలో ‘షోలే’, ‘లవ్ మ్యారేజ్’, ‘నామ్’, ‘ఇత్తేఫక్’ తదితర చిత్రాల్లో నటించారు. అయితే మాతృభాష గుజరాతీలో ‘గర్వో గరాసియో’, ‘ఘెర్ ఘెర్ మతినా చులా ’ తదితర సినిమాలు చేశాడు. ఆయన మృతికి బాలీవుడ్, గుజరాతీ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. అరవింద్ జోషికి భార్య, ఇద్దరు కుమారులు శర్మాన్ జోషి, మాన్సి జోషి. వీరిద్దరూ నటులుగా కొనసాగుతున్నారు. శర్మన్ జోషి త్రీ ఇడియట్స్ సినిమాలో అమీర్ ఖాన్‌తో కలిసి నటించిన విషయం తెలిసిందే. అరవింద్ జోషి మృతి పట్ల నటుడు పరేశ్ రావల్, మరికొందరు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. -
'అంకుల్.. 80 ఏళ్ల వయసులోనూ ఇరగదీశారు'
-
'అంకుల్.. 80 ఏళ్ల వయసులోనూ ఇరగదీశారు'
ముంబై : బాలీవుడ్ సీనియర్ నటుడు రంజీత్ 80 ఏళ్ల వయసులోనూ తన కూతురితో కలిసి డ్యాన్స్ ఇరగదీశారు. రంజీత్ తన కూతురితో కలిసి బాలీవుడ్ క్లాసిక్ షోలే సినిమాలోని మెహబూబా.. మెహబూబా పాటకు చిందులేశారు. ఈ డ్యాన్స్ వీడియోనూ రంజీత్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ' దాదాపు 80 ఏళ్ల వయసులోనూ ఇలా డ్యాన్స్ చేస్తున్నానంటే అదంతా నా కూతురు చలవే.. తన చేతితో నా చేతి పట్టుకొని డ్యాన్స్ చేయించింది' అంటూ క్యాప్షన్ జత చేశాడు. కాగా షోలే సినిమాలో మెహబూబా పాటకు హెలెన్ నర్తించగా,ఆర్.డి బర్మన్ సంగీతమందించారు. (పదేళ్ల తర్వాత సుస్మితా వెబ్ సిరీస్‌లో..) ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రముఖ నటుడు జాకీషాఫ్ర్ కుమారుడు టైగర్ ష్రాఫ్ స్పందిస్తూ.. ' అమేజింగ్ అంకుల్.. నిజంగా మైండ్ బ్లోయింగ్.. 80 ఏళ్ల వయసులోనూ డ్యాన్స్ ఇరగదీస్తున్నారు' అంటూ పేర్కొన్నాడు. ' మైండ్ బ్లోయింగ్ పాపా రంజీత్'..' సో క్యూట్.. తండ్రీ కూతురు డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు..' అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెట్టారు.1970,80వ దశకంలో రంజీత్ పలు బాలీవుడ్ సినిమాల్లో ఒక వెలుగు వెలిగారు. చాలా సినిమాల్లో విలన్‌గా నటించి అత్యంత పాపులర్ విలన్‌గా పేరు సంపాదించారు. అమర్ అక్బర్ ఆంథోని, ముకద్దర్ కా సికందర్, సుహగ్, ది బర్నింగ్ ట్రైన్, లావారిస్, రాఖీ, కిషన్ కన్హయ్య, హల్చల్, ధరమ్ వీర్ సినిమాలో తనదైన విలనిజాన్ని పండించారు. (అన్‌లాక్ 1 : ఇక వారు ఇండియాకు రావొచ్చు) -
బద్ధశత్రువులంతా కలిసిన వేళ...
వాళ్లంతా బద్ధ శత్రువులు. మొత్తం నలుగురు. వాళ్లలో ఒకరిని చంపడానికి మరొకరు మిగిలిన ఇద్దరిని కిరాయికి పిలిపించుకుంటారు. కానీ నలుగురూ కలిసి భుజాల మీద చేతులు వేసుకుని నవ్వుతూ కనిపిస్తే ఎలా ఉంటుంది? పైన చెప్పింది షోలే సినిమా స్టోరీ. ఆ తర్వాత చెప్పింది ఆ సినిమా షూటింగ్లో సన్నివేశం. సినిమాలో వీరూ, జై, ఠాకూర్, గబ్బర్ సింగ్ పాత్రలలో నటించిన అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, సంజీవ్ కుమార్, అమ్జాద్ ఖాన్.. ఈ నలుగురూ షూటింగ్ సమయంలో సరదాగా నవ్వుకుంటూ ఒకళ్ల భుజాల మీద ఒకళ్లు చేతులు వేసుకుని తీయించుకున్న అరుదైన ఫొటోను దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. సాధారణంగా తన ట్వీట్లలో ఎవరో ఒకరిని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించే రాము.. తనకు ఏమాత్రం సంబంధం లేకపోయినా, బాగా ఇష్టమైన షోలే సినిమాకు సంబంధించిన ఈ ఫొటోను ప్రేక్షకుల కోసం అందించాడు రామూ. Jai,Veeru,Thakur and Gabbar on the sets of Sholay..Height of deceit is that they were sworn enemies on screen pic.twitter.com/PvoQBtQD3D — Ram Gopal Varma (@RGVzoomin) 11 August 2016 -
కొన్ని అలవాట్లు అంతే... మారవ్!
మనకు తెలియకుండానే కొన్ని అలవాట్లు మనల్ని అంటిపెట్టుకుని ఉంటాయ్. వాటిని మార్చుకోవాలనుకున్నా సాధ్యం కాదు. అమితాబ్ బచ్చన్‌కి అలా మార్చుకోలేని అలవాట్లు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఆయన కుర్చీలో కూర్చునే విధానం గురించి చెప్పాలి. ఇదిగో ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్నట్లుగా కూర్చోవడం అమితాబ్ అలవాటు. బ్లాక్ అండ్ వైట్ ఫొటో 1975కి సంబంధించినది. ‘షోలే’ చిత్రం షూటింగ్లో అమితాబ్ అలా కూర్చున్నారు. ఇటీవల ఓ యాడ్‌లో నటించారాయన. చిత్రీకరణ సమయంలో దొరికిన విరామంలో ఎప్పటిలానే కూర్చున్నారు. పాత ఫొటోకి తాజా ఫొటో మ్యాచ్ చేసి, ‘‘కొన్ని అలవాట్లు మారవ్... 35 ఏళ్లయినా కూడా’’ అని అమితాబ్ పేర్కొన్నారు. -
షోలేను రీమేక్ చేయడం తప్పేమో: అమితాబ్
షోలే లాంటి అద్భుతమైన సినిమాను అసలు రీమేక్ చేయాలనుకోవడం పెద్ద తప్పేనేమోనని అసలు, రీమేక్.. రెండు సినిమాల్లోనూ నటించిన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యానించారు. 1975లో రమేష్ సిప్పీ దర్శకత్వంలో అమితాబ్, ధర్మేంద్ర హీరోలుగా నటించిన షోలే సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమ రికార్డులనే షోలే అప్పట్లో తుడిచిపెట్టేసింది. ఆ సినిమాకు రేపటితో 40 ఏళ్లు. ఇదే సినిమాను రాంగోపాల్ వర్మ 'ఆగ్' అనే పేరుతో తర్వాత రీమేక్ చేశాడు. అందులో అమితాబ్ బచ్చన్, మోహన్ లాల్, అజయ్ దేవ్‌గణ్, ప్రశాంత్ రాజ్ సచ్దేవ్, సుస్మితా సేన్ తదితరులు నటించారు. ఈ సినిమాపై విమర్శకులు దుమ్మెత్తి పోయగా.. బాక్సాఫీసు వద్ద కూడా అడ్డంగా బోల్తాపడింది. ఈ ప్రయోగం గురించి ఏమంటారని బిగ్ బీని అడిగితే.. ఆ ప్రశ్న రాంగోపాల్ వర్మను అడగాలన్నారు. ఏ సినిమా తీసినా తాను అందులో నటిస్తానని, అయితే అది భారీ విజయం సాధించినా, అట్టర్ ఫ్లాప్ అయినా దానికి దర్శకుడే బాధ్యుడని ఆయన చెప్పారు. తాను తప్పు చేశానని చెప్పబోనని, చాలా నిజాయితీగా ఆ సినిమాలో పనిచేశానని, కానీ అసలు రీమేక్ చేయాలనుకోవడమే తప్పేమోనని అమితాబ్ వ్యాఖ్యానించారు. -
అప్పుడే 40 ఏళ్లా!
(సాక్షి వెబ్ ప్రత్యేకం) అప్పటి వరకు చందమామ, బొమ్మరిల్లు, బాలమిత్ర లాంటి పుస్తకాల్లోని జానపద కథలు మాత్రమే తెలుసు... భేతాళుడి కథల్లో విక్రమార్కుడు చివర్లో చిక్కుముడి ఎలా విప్పుతాడో అనే ఆసక్తి మాత్రమే అందమైన అనుభూతి. అప్పుడప్పుడు ఆ పుస్తకాల్లోని నీతి కథలు మాత్రమే పరిచయం... ఒకటి రెండు సినిమాలు చూసినా అంతగా ప్రభావితం చెయలేదు. తొమ్మిదేళ్ల వయసులో ఏం గుర్తుంటాయి.. సినిమాలు తెలియవు.. ఫైట్లు అంతకన్నా తెలియవు. పాటలు తెలియవు... పాడటం అసలు రాదు..అలాంటి రోజుల్లో ఒక రోజు స్కూల్లో పక్కబెంచి క్లాస్ మేట్ నోట '' అరె ఓ సాంబా''.. ఏంటది వింతగా ఉంది.. తిట్టా, పొగడ్తా, కొత్త పలకరింతా.. 40 ఏళ్ల క్రితం మొదటిసారి విన్న కొత్త పదం... నాలుగు దశాబ్దాలుగా టీవీలో ఎప్పుడు వినిపించినా, కనిపించినా అతుక్కుపోయేంత దగ్గరితనం. అప్పుడు, ఇప్పుడు కూడా సినిమాలంటే పెద్ద ఆసక్తి లేదు. మూడు గంటలు అలా కళ్లప్పగించి చీకటి గదిలో బందీ కావడం ఎందుకో నచ్చదు. కానీ సాంబాకు మాత్రం ఆ మినహాయింపు..ఎందుకు? ఇద్దరు హీరోలు, ఒక ఊరి పెద్ద, ఒక విలన్.. కొన్ని ఫైట్లు, కొంత మెలోడ్రామా... కొంత హాస్యం.. కొంత సరదా.. మంచి స్నేహం.. విషాదం.. ఆహ్లాదం.. మూడు గంటలపాటు 'రామ్ గఢ్' కొండల్లో క్షణక్షణానికి ఎగిసే జ్వాల (షోలే అర్థం అదే కదా!) సినిమాలు అంటే ఒక సాఫ్ట్ హీరో, కన్నీళ్లు పెట్టే హీరోయిన్, నాలుగు పాటలు.. చివరికి శుభం కార్డ్... ఈ మూస ధోరణి నుంచి భారతదేశ సినిమాను ఒక కొత్త ప్లాట్ ఫాం మీద నిలబెట్టింది షోలే. హీరోలంటే సాఫ్ట్ గానే ఉండాలనే మూస ధోరణికి గుడ్ బై చెప్పి కథా నాయకుడికి కొత్త గెటప్ ఇచ్చింది. స్కూల్లో ఏ ఫంక్షన్ జరిగినా గబ్బర్ సింగ్ ప్రత్యక్షమవ్వాల్సిందే.. 'అబ్ గోలీ ఖావో' డైలాగ్ వినపడాల్సిందే. స్నేహానికి నిర్వచనం ... ఇంటికి వెళుతూ దోస్త్ భూజాల మీద చేతులు వేసి ' ఏ దోస్తీ హమ్ నహీ ఛోడేంగే' అంటూ నడిచిన కిలోమీటర్లు ఎన్నో.. మొన్నీ మధ్య చిన్నప్పటి దోస్తు ల డిన్నర్ పార్టీలో మళ్లీ పాడుకున్నాం... అప్పుడే 40 సంవత్సాలు అయిందన్న విషయం తెలియకుండానే..! 'ఏ హాథ్ నహీ.. ఫాంసీ కా ఫందా' అని ఠాకూర్ సాబ్ గర్జించిన ఫేషియల్ ఎక్స్ ప్రెషన్ మొదటిసారి చూసినపుడు రోమాలు నిక్కపొడుచుకున్నాయి... ఇప్పటికీ అదే ఫీలింగ్.. క్లైమాక్స్ లో గబ్బర్ సింగ్ మొహంపై నాడాలు ఉన్న షూతో ఠాకూర్ సాబ్ తొక్కుతున్న సీన్ లో థియేటర్లో మోగిన చప్పట్లు వినపడుతూనే ఉన్నాయి. పట్టుదల, ప్రతీకారం నేర్పింది కూడా షోలేనేమో. గలగల పారే సెలయేరు ఒకటి మౌనముద్ర వహిస్తే 'ఛోటీ బహూ' మాటల కన్నా ఎక్స్ ప్రెషన్స్ తో ప్రేక్షల్ని ఎలా కట్టిపడే యొచ్చో కూడా మొదటిసారి తెలిసింది ఆ మూడు గంటల్లోనే.. ఎన్ని ఇబ్బందులున్నా జీవితాన్ని సరదాగా ఎలా లాగేయొచ్చో నవ్వులు పంచుతూ ఆవిష్కరించిన వీరూ.. యాంగ్రీ యంగ్ మ్యాన్ గా అపుడపుడు సెటైర్లతో 'తుమ్ హారా నామ్ క్యాహై బసంతీ' అని అమాయకంగా ప్రశ్నించే జయ్... స్నేహితున్ని కాపాడేందుకు ' బొమ్మా, బొరుసా'లో బొమ్మ మాత్రమే చూపించి ప్రాణాలర్పించిన అదే జయ్... ' హమ్ గావ్ వాలే' అంటూ అమాయకత్వాన్ని ప్రదర్శించిన బసంతీ.. 'చల్ ధన్నూ' అంటూ టాంగాతో పాటు మనల్ని దోచుకున్న దృశ్యం ... 'మహబూబా' పాటతో ఐటమ్ సాంగ్ కి కొత్త నిర్వచనం ఇచ్చిన హెలన్ 'ఆప్ కా నమక్ ఖాయా సర్దార్' అంటూ అమాయకంగా 'గోలీ' తిన్న కాలియా.. హమ్ అంగ్రేజ్ కే జమానే కా జైలర్ హై అంటూ డాంబికాలు పోయే జైలర్.. ఎన్నెన్ని పాత్రలు..ఎన్ని రంగుల కలబోత, ఎన్ని భావాల అల్లిక... గబ్బర్ సింగ్.. విలనీని కొత్త పుంతలు తొక్కించిన ఆ కరకు బూట్ల చప్పుడు.. ఎంతో నిదానంగా పొగాకు అరచేతిలో నలిపి నోట్లో వేసుకుని, అంతే నిదానంగా తుపాకి గురిపెట్టి ప్రాణాల్ని నలిపేసిన కర్కశత్వం.. థియేటర్ గోడలు ప్రతిధ్వనించే నవ్వు.. ఇంటికి వెళ్లాక కూడా అలా వెంటాడి వేటాడే చూపు... దేశంలో ఏ జైలుకు కూడా తనని 20 సంవత్సరాలు బంధించే సత్తా లేదనే అతిశయం.... పగ, ప్రతీకారం... చట్టాన్ని కాపాడిన వ్యక్తి... అదే చట్టాన్ని కాదని వజ్రాన్ని వజ్రంతోనే కోయాలని.. డాకూని దొంగలతోనే పట్టుకోవాలనే ప్రయత్నం.. నడకలో, ఎక్స్ ప్రెషన్స్ లో ఠీవీ.. ఠాకూర్ అంటే ఇలాగే ఉంటారేమో అన్నంత పరిచయం... సలీం జావెద్ లు చిన్నగా అల్లుకున్న కథ భారతదేశ చలనచిత్ర చరిత్రలో వట వృక్షం అంత ఎదిగింది. ఆ తర్వాత రెండు దశాబ్దాల పాటు 'షోలే' ఛాయలు కనిపించని సినిమాలు చాలా అరుదు. ఎక్కడో ఒక చోట ఒక పోలిక..ఎక్కడో కాపీ కొట్టిన ఛాయలు.. ఇప్పటితరం ప్రేక్షకుల్ని కూడా కట్టి పడేయగలిగిన సమకాలీనత. నటీనటుల పేర్లు అప్రస్తుతం.. 1975 ఆగస్టు 15న విడుదలైన తర్వాత నటీనటులు వారి పేర్లు వారే మరచిపోయేంతటి ప్రభావం వేసిన దృశ్యకావ్యం.. బహుశా ఇలాంటి అభిప్రాయమే నా తరంలో మెజారిటీ ప్రేక్షకులకి కలిగి ఉంటుంది. ఈ తరం ప్రేక్షకులకి కూడా.. ఇప్పటి వరకు దాదాపు 100 కోట్ల మంది షోలేను చూసి ఉంటారని ఒక అంచనా. రైల్వే స్టేషన్ లో మొదలైన సినిమా అదే రైల్వేస్టేషన్ లో ముగుస్తుంది... ఈ మధ్యలో మరచిపోలేని అనుభూతుల్ని మిగిల్చి... భారతదేశ సినిమా షోలేకు ముందు.. షోలే తర్వాత... నాకుమాత్రం సినిమా అంటే షోలే మాత్రమే... -ఎస్. గోపినాథ్ రెడ్డి -
గాజు పెంకుల మీద డాన్సు చేయబోయిన దర్శకుడు!
అవి షోలే సినిమా విడుదలైన రోజులు.. అందులో హీరోయిన్ బసంతి (హేమమాలిని) 'ఓ.. జబ్ తక్ హై జాన్.. మై నాచూంగీ' అంటూ గాజు పెంకుల మీద డాన్సు చేస్తోంది. ఆమె కాళ్లకు గాజుపెంకులు గుచ్చుకుంటున్నాయి. రక్తం ధారలుగా కారుతోంది.. సినిమా చూసి వచ్చిన చిన్న కుర్రాడు ఆ డాన్సును మర్చిపోలేకపోయాడు. ఇంట్లో ఉన్న ఓ ఖాళీ సీసా తీసుకుని, దాన్ని పగలగొట్టాడు. జబ్ తక్ హై జాన్ అని పాడుతూ ఆ గాజు పెంకుల మీద డాన్సు చేయడానికి దాదాపు సిద్ధమైపోయాడు. అంతే.. ఆ కుర్రాడి తల్లి వచ్చి లాగి ఒక్కటి లెంప మీద ఇచ్చుకుంది. ఆ కుర్రాడు ఎవరో కాదు.. ప్రస్తుత హిట్ సినిమాల దర్శకుడు కరణ్ జోహార్! ఆ సినిమా విడుదలై తామంతా చూస్తుండే సరికి షాహిద్ కపూర్, ఆలియా భట్ లాంటివాళ్లు అసలు ఇంకా పుట్టనే లేదని కరణ్ జోహార్ అన్నాడు. తనకు ఆరేళ్ల వయసున్నప్పుడు ఆ సినిమా చూశానని, వెంటవెంటనే రెండు షోలకు వెళ్లానని తెలిపాడు. మ్యాట్నీకి వెళ్లి బయటకు రాగానే మళ్లీ చూస్తానని ఏడవడంతో ఫస్ట్ షోకు కూడా తీసుకెళ్లారని అన్నాడు. షోలే సినిమాను ఇప్పటికి కనీసం 100 సార్లు చూసి ఉంటానని గుర్తుచేసుకున్నాడు. ఆ సినిమా బాలీవుడ్‌కు ఓ పాఠ్యపుస్తకం లాంటిదన్నాడు. -
షోలే 3dలో...