
టీమిండియా సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్ ఫామ్‌ను కోల్పోయి జట్టులో చోటు కోల్పోయాడు. ప్రస్తుత పరిస్థితులు దృష్యా ధావన్ జట్టులోకి రావడం కష్టమేనని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కానీ ఇవేవి పట్టించుకోకుండా టీమిండియాలోకి రావాలని గబ్బర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగానే విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగాడు. అయితే ఐదు మ్యాచ్‌లు కలిపి (12,8,14,12,0).. 56 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దీంతో ధావన్ రీఎంట్రీపై నీలీనీడలు కమ్ముకున్నాయి.
చదవండి: 10 ఫోర్లు, 4సిక్స్‌లు.. సెంచరీతో చెలరేగిన శ్రీలంక బ్యాటర్!
ఆటకు దూరంగా ఉన్నప్పటికి ధావన్ తన అభిమానులను అలరించాలనుకున్నాడు. అందుకు తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక ఫన్నీ వీడియోనూ షేర్ చేశాడు. బాలీవుడ్ బ్లాక్‌బాస్టర్ షోలే సినిమాలో విలన్ గబ్బర్‌సింగ్ పాపులర్ డైలాగ్ ''కిత్నే ఆద్మీ తే''ను తన స్టైల్లో అనుకరించాడు. ప్రస్తుతం ధావన్ చెప్పిన డైలాగ్ వైరల్‌గా మారింది. అయితే ధావన్ వీడియో చేయడంపై టీమిండియా ఫ్యాన్స్ ట్రోల్ చేశారు.'' టీమిండియాకు ఎలాగో దూరమయ్యావు.. ఎంటర్‌టైన్‌మెంట్ మీద పడ్డావు. ఇలాంటివి మానేసి ఆటపై దృష్టి పెడితే బాగుంటుంది..'' అంటూ కామెంట్స్ చేశారు.
ఇక ధావన్ టీమిండియా తరపున టి20 ప్రపంచకప్‌కు ముందు శ్రీలంకతో జరిగిన వన్డే, టి20 సిరీస్‌లో ఆఖరిసారిగా పాల్గొన్నాడు. లంక పర్యటనకు వెళ్లిన రెండో టీమిండియా జట్టుకు ధావన్ కెప్టెన్సీ చేశాడు. టి20 సిరీస్‌ను లంక గెలుచుకోగా.. వన్డే సిరీస్‌ను మాత్రం టీమిండియా 2-1 తేడాతో దక్కించుకుంది. ఇక అప్పటినుంచి ధావన్ మళ్లీ టీమిండియాకు ఆడలేదు.
చదవండి: IND Vs SA: అతడు ప్రపంచ స్ధాయి బౌలర్.. సౌతాఫ్రికాకు ఇక చుక్కలే!
Comments
Please login to add a commentAdd a comment