కివీస్ పర్యటనలో ఉన్న టీమిండియా ఇప్పటికే టి20 సిరీస్‌ను పూర్తి చేసుకుంది. హార్దిక్ పాండ్యా సారధ్యంలోని టీమిండియా 1-0 తేడాతో సిరీస్‌ను గెలిచింది. ఇక నవంబర్ 25 నుంచి శిఖర్ ధావన్ నేతృత్వంలో టీమిండియా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సిరీస్‌కు దూరంగా ఉండడంతో ధావన్ నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. ధావన్ కెప్టెన్సీలో టీమిండియా ఇప్పటికే పలు సిరీస్‌లు ఆడిన సంగతి తెలిసిందే.
ఈ సంగతి పక్కనబెడితే.. టీమిండియా స్టాండింగ్ కెప్టెన్ ధావన్ తన చర్యతో మరోసారి వైరల్‌గా మారాడు. సాధారణంగా మంచి హ్యూమర్ కనబరిచే ధావన్ మరోసారి తన మ్యాజిక్‌తో మెరిశాడు. వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు ఇరుజట్ల కెప్టెన్లు ట్రోఫీతో ఫోజులు ఇవ్వడం ఆనవాయితీ. అయితే ఇక్కడ ధావన్ స్వయంగా కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ రూంకి వెళ్లి అతన్ని ట్రోఫీ పెట్టిన ప్లేస్‌కు తీసుకురావడం విశేషం. ఈ గ్యాప్‌లోనే ఒకరినొకరు హగ్ చేసుకొని మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ట్రోఫీని ఆవిష్కరించడానికి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోనూ బీసీసీఐ తన ట్విటర్‌లో పంచుకుంది.
ఇక టి20 సిరీస్ విషయానికి వస్తే తొలి మ్యాచ్ రద్దు కాగా.. రెండో మ్యాచ్‌లో భారత్ 65 పరుగుల తేడాతో నెగ్గింది. ఇక మూడో టి20లో వర్షం అంతరాయంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో మ్యాచ్‌ను టైగా నిర్ణయించడంతో సిరీస్‌ను టీమిండియా చేజెక్కించుకుంది.
Smiles, friendly banter & the trophy 🏆 unveil! #TeamIndia | #NZvIND pic.twitter.com/3R2zh0znZ3
— BCCI (@BCCI) November 24, 2022
చదవండి: కెప్టెన్‌గా కఠిన నిర్ణయాలు తీసుకుంటా! లోకాన్ని వీడేటపుడు ఏం పట్టుకుపోతాం
Comments
Please login to add a commentAdd a comment