
టీమిండియా, న్యూజిలాండ్ మధ్య రాయ్‌పూర్ వేదికగా మరికొద్ది గంటల్లో రెండో వన్డే ప్రారంభం కానుంది. ఉత్కంఠగా సాగిన తొలి వన్డేలో టీమిండియా 12 పరుగుల తేడాతో విజయం సాధించి 1-0తో ఆధిక్యంలో నిలిచింది. టీమిండియా బ్యాటింగ్ బలంగా కనిపిస్తున్నప్పటికి బౌలింగ్ విభాగం మాత్రం కాస్త ఆందోళన కలిగిస్తుంది.
ముఖ్యంగా డెత్ ఓవర్లలో టీమిండియా బౌలర్లు వికెట్లు తీయడంలో ఇబ్బంది పడుతున్నారు. సిరాజ్ ఒక్కడే మెరుగ్గా బౌలింగ్ చేస్తున్నాడు. అతని చలువతోనే టీమిండియా తొలి వన్డే గెలవగలిగింది. తొలి వన్డేలో ఏమాత్రం ప్రభావం చూపని శార్దూల్ ఠాకూర్‌ను తప్పించి ఉమ్రాన్ మాలిక్‌ను రెండో వన్డేలో ఆడిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
ఈ విషయం పక్కనబెడితే.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పిన్నర్ యజ్వేంద్ర చహల్‌ను టీజ్ చేయడం వైరల్‌గా మారింది. రాయ్‌పూర్‌లో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌పై చహల్ ఒక వీడియో చేశాడు. ఆ వీడియోలో డ్రెస్సింగ్ రూమ్‌లో తమకు కల్పించిన సౌకర్యాల గురించి వివరించాడు. అటుపై ఆటగాళ్లతో మాట్లాడాడు. ఈ సందర్భంగా మసాజ్ సెంటర్ వద్దకు రాగానే చహల్.. ఎక్కడైనా హాయిగా ఉంటుందంటే అది ఇదే అంటూ మసాజ్ స్ట్రెచర్‌ను చూపించాడు.. దీనిని నేను బాగా ఎంజాయ్ చేస్తాను అని పేర్కొన్నాడు. చహల్ వ్యాఖ్యలను గమనించిన రోహిత్ శర్మ.. ''నీకు మంచి భవిష్యత్తు ఉంది'' చహల్ అంటూ టీజ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోనూ బీసీసీఐ ట్విటర్‌లో షేర్ చేసింది. వీలైతే మీరు ఒక లుక్కేయండి.
Inside #TeamIndia's dressing room in Raipur! 👌 👌
— BCCI (@BCCI) January 20, 2023
𝘼 𝘾𝙝𝙖𝙝𝙖𝙡 𝙏𝙑 📺 𝙎𝙥𝙚𝙘𝙞𝙖𝙡 👍 👍 #INDvNZ | @yuzi_chahal pic.twitter.com/S1wGBGtikF