Ind Vs NZ 3rd ODI: Frustrated Rohit Sharma Scolds Shardul Thakur, Viral Video - Sakshi
Sakshi News home page

Rohit Sharma: అప్పటికే 2 వికెట్లు.. అయినా శార్దూల్‌పై రోహిత్‌ ఫైర్‌! మరీ ఇంత ఓవరాక్షనా? వైరల్‌

Published Wed, Jan 25 2023 1:34 PM | Last Updated on Wed, Jan 25 2023 1:56 PM

Ind Vs NZ 3rd ODI: Frustrated Rohit Sharma Scolds Shardul Thakur - Sakshi

శార్దూల్‌పై రోహిత్‌ అసహనం (PC: Twitter/Video Grab)

India vs New Zealand, 3rd ODI: మైదానంలో ఉన్నపుడు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చాలా వరకు కూల్‌గానే ఉంటాడు. కానీ.. కీలక సమయంలో ఆటగాళ్లు.. ప్రత్యర్థి పని సులువు చేస్తూ.. మరీ చిన్న చిన్న విషయాల్లో కూడా పొరపాట్లు చేస్తే మాత్రం విశ్వరూపం ప్రదర్శిస్తాడు. సహనం కోల్పోయి నోటికి పని చెప్తాడు.

న్యూజిలాండ్‌తో మూడో వన్డే సందర్భంగా పేసర్‌ శార్దూల్‌ ఠాకూర్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇండోర్‌ వేదికగా మంగళవారం జరిగిన నామమాత్రపు ఆఖరి మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. పర్యాటక కివీస్‌పై ఏకంగా 90 పరుగుల తేడాతో గెలుపొంది సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది.

అయితే, న్యూజిలాండ్‌ ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే మాత్రం కాస్త భయపెట్టాడు. 100 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్స్‌ల సాయంతో 138 పరుగులు చేసి ప్రమాదకరంగా పరిణమించిన ఈ బ్యాటర్‌ను ఉమ్రాన్‌ మాలిక్‌ 31.4వ ఓవర్‌లో పెవిలియన్‌కు పంపాడు. 

శార్దూల్‌పై రోహిత్‌ ఫైర్‌
కాన్వే ఇన్నింగ్స్‌కు బ్రేక్‌ వేశాడు. మిడ్‌ వికెట్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి కాన్వే మైదానాన్ని వీడాడు. అంతకు ముందు అంటే.. 26వ ఓవర్లో శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో కాన్వే వరుసగా రెండు బౌండరీలు బాదడంతో రోహిత్‌ సహనం కోల్పోయాడు. శార్దూల్‌ దగ్గరికి వెళ్లి.. ‘‘చూసుకుని బౌలింగ్‌ చేయొచ్చు కదా.. అసలేం ఏం చేస్తున్నావు’’ అన్నట్లు కోపం ప్రదర్శించాడు. 

ఇంత ఓవరాక్షనా?
అయితే, ఆ ఓవర్లో అప్పటికే మిచెల్‌ సాంట్నర్‌(24), టామ్‌ లాథమ్‌(0) వికెట్లు తీసిన శార్దూల్‌ .. రోహిత్‌ మాటలు పట్టించుకోనట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీంతో నెటిజన్లు రోహిత్‌పై ఫైర్‌ అవుతున్నారు. ‘‘పిచ్చి పట్టినట్లు ప్రవర్తించావు.. రెండు ఫోర్లకే అంత ఓవరాక్షనా? తను అంతకు ముందే కదా రెండు వికెట్లు తీశాడు. పాపం శార్దూల్‌’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌
కాగా మూడో వన్డేలో శార్దూల్‌ ఠాకూర్‌ 6 ఓవర్ల బౌలింగ్‌లో 45 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. అదే విధంగా 17 బంతుల్లో 25 పరుగులు సాధించాడు ఈ పేస్‌ ఆల్‌రౌండర్‌.

చదవండి: SEC Vs PR: చెలరేగిన బట్లర్‌, మిల్లర్‌.. సన్‌రైజర్స్‌కు తప్పని ఓటమి.. అయినా..
మైదానంలో ‘కింగ్‌’లైనా.. ‘రాణుల’ ప్రేమకు తలవంచిన వాళ్లే!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement