Rohit Sharma Forget Team Decision after Winning Toss vs NZ 2nd ODI - Sakshi
Sakshi News home page

IND Vs NZ: రోహిత్‌ శర్మ.. ఇంత మతిమరుపా! 

Published Sat, Jan 21 2023 1:56 PM | Last Updated on Sat, Jan 21 2023 2:27 PM

Rohit Sharma Forget Team Decision After Winning Toss Vs NZ 2nd ODI - Sakshi

టీమిండియా, న్యూజిలాండ్‌ మధ్య రెండో వన్డే రాయ్‌పూర్‌ వేదికగా మొదలైంది. అయితే టాస్‌ సమయంలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు వింత అనుభవం ఎదురైంది. టాస్‌ గెలిచాకా రోహిత్‌ జట్టు నిర్ణయం ఏంటనేది మరిచిపోవడం ఆసక్తి కలిగించింది. అయితే కావాలని చేశాడా లేక నిజంగానే మరిచిపోయాడా అన్న సందేహం కూడా కలుగుతుంది.

విషయంలోకి వెళితే.. రవిశాస్త్రి మ్యాచ్‌కు అంతా సిద్ధం.. టాస్‌ ఎవరు నెగ్గుతారు అని వ్యాఖ్యానించాడు. ఇక మ్యాచ్‌ రిఫరీ జగవల్‌ శ్రీనాథ్‌ టాస్‌ కాయిన్‌ ఎగురవేయగానే టామ్‌ లాథమ్‌ హెడ్స్‌ అని కాల్‌ ఇచ్చాడు. కానీ టెయిల్స్ పడడంతో శ్రీనాథ్‌ రోహిత్‌ టాస్‌ గెలిచినట్లు ప్రకటించాడు. అయితే రోహిత్‌ టాస్‌ గెలిచిన తర్వాత జట్టు నిర్ణయం మరిచిపోయాడు. దీంతో కొంతసేపు ఆలోచించిన రోహిత్‌ బౌలింగ్‌ చేయాలనుకుంటున్నట్లు తన నిర్ణయం ప్రకటించాడు. రోహిత్‌ చర్యతో టామ్‌ లాథమ్‌తో పాటు శ్రీనాథ్‌, రవిశాస్త్రిలు నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: టాస్‌ గెలిచిన టీమిండియా.. ఉమ్రాన్‌ మాలిక్‌కు మొండిచేయి

Cristiano Ronaldo: 'మంచి వంటవాడు కావాలి.. జీతం రూ. 4.5 లక్షలు'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement