'అంకుల్‌.. 80 ఏళ్ల వయసులోనూ ఇరగదీశారు' | Ranjeet Danced To Sholay Song With Daughter Became Viral | Sakshi
Sakshi News home page

'అంకుల్‌.. 80 ఏళ్ల వయసులోనూ ఇరగదీశారు'

Published Wed, Jun 3 2020 7:46 PM | Last Updated on Wed, Jun 3 2020 8:36 PM

Ranjeet Danced To Sholay Song With Daughter Became Viral - Sakshi

ముంబై : బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు రంజీత్‌ 80 ఏళ్ల వయసులోనూ తన కూతురితో కలిసి డ్యాన్స్‌ ఇరగదీశారు.  రంజీత్‌ తన కూతురితో కలిసి బాలీవుడ్‌ క్లాసిక్‌ షోలే సినిమాలోని మెహబూబా.. మెహబూబా పాటకు చిందులేశారు. ఈ డ్యాన్స్‌ వీడియోనూ రంజీత్‌ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ' దాదాపు 80 ఏళ్ల వయసులోనూ ఇలా డ్యాన్స్‌ చేస్తున్నానంటే అదంతా నా కూతురు చలవే.. తన చేతితో నా చేతి పట్టుకొని డ్యాన్స్‌ చేయించింది' అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. కాగా షోలే సినిమాలో మెహబూబా పాట‍కు హెలెన్‌ నర్తించగా,ఆర్.‌డి బర్మన్‌ సంగీతమందించారు. (పదేళ్ల తర్వాత సుస్మితా వెబ్‌ సిరీస్‌లో..)

ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రముఖ నటుడు జాకీషాఫ్ర్‌ కుమారుడు టైగర్‌ ష్రాఫ్‌ స్పందిస్తూ.. ' అమేజింగ్‌ అంకుల్‌.. నిజంగా మైండ్‌ బ్లోయింగ్‌.. 80 ఏళ్ల వయసులోనూ డ్యాన్స్‌ ఇరగదీస్తున్నారు' అంటూ పేర్కొన్నాడు. ' మైండ్‌ బ్లోయింగ్‌ పాపా రంజీత్‌'..' సో క్యూట్‌.. తండ్రీ కూతురు డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు..' అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెట్టారు.1970,80వ దశకంలో రంజీత్‌ పలు బాలీవుడ్‌ సినిమాల్లో ఒక వెలుగు వెలిగారు. చాలా సినిమాల్లో విలన్‌గా నటించి అత్యంత పాపులర్‌ విలన్‌గా పేరు సంపాదించారు. అమర్‌ అక్బర్‌ ఆంథోని, ముకద్దర్‌ కా సికందర్‌, సుహగ్‌, ది బర్నింగ్‌ ట్రైన్‌, లావారిస్‌, రాఖీ, కిషన్‌ కన్హయ్య, హల్‌చల్‌, ధరమ్‌ వీర్ సినిమాలో తనదైన విలనిజాన్ని పండించారు. (అన్‌లాక్‌ 1 : ఇక వారు ఇండియాకు రావొచ్చు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement