కొన్ని అలవాట్లు అంతే... మారవ్!
మనకు తెలియకుండానే కొన్ని అలవాట్లు మనల్ని అంటిపెట్టుకుని ఉంటాయ్. వాటిని మార్చుకోవాలనుకున్నా సాధ్యం కాదు. అమితాబ్ బచ్చన్‌కి అలా మార్చుకోలేని అలవాట్లు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఆయన కుర్చీలో కూర్చునే విధానం గురించి చెప్పాలి. ఇదిగో ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్నట్లుగా కూర్చోవడం అమితాబ్ అలవాటు. బ్లాక్ అండ్ వైట్ ఫొటో 1975కి సంబంధించినది. ‘షోలే’ చిత్రం షూటింగ్‌లో అమితాబ్ అలా కూర్చున్నారు. ఇటీవల ఓ యాడ్‌లో నటించారాయన. చిత్రీకరణ సమయంలో దొరికిన విరామంలో ఎప్పటిలానే కూర్చున్నారు. పాత ఫొటోకి తాజా ఫొటో మ్యాచ్ చేసి, ‘‘కొన్ని అలవాట్లు మారవ్... 35 ఏళ్లయినా కూడా’’ అని అమితాబ్ పేర్కొన్నారు.