Arvind Joshi
-
‘షోలే’ నటుడు కన్నుమూత
బాలీవుడ్‌తోపాటు గుజరాతీ సినిమాల్లో నటించిన పాత తరం నటుడు అరవింద్ జోషి (84) కన్నుమూశారు. ప్రస్తుత గుజరాతీ నటుడు శర్మాన్ జోషి అతడి కుమారుడు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో వారం కిందట ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన బంధువు సరితా జోషి మీడియాకు తెలిపారు. అరవింద్ జోషి హిందీలో ‘షోలే’, ‘లవ్ మ్యారేజ్’, ‘నామ్’, ‘ఇత్తేఫక్’ తదితర చిత్రాల్లో నటించారు. అయితే మాతృభాష గుజరాతీలో ‘గర్వో గరాసియో’, ‘ఘెర్ ఘెర్ మతినా చులా ’ తదితర సినిమాలు చేశాడు. ఆయన మృతికి బాలీవుడ్, గుజరాతీ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. అరవింద్ జోషికి భార్య, ఇద్దరు కుమారులు శర్మాన్ జోషి, మాన్సి జోషి. వీరిద్దరూ నటులుగా కొనసాగుతున్నారు. శర్మన్ జోషి త్రీ ఇడియట్స్ సినిమాలో అమీర్ ఖాన్‌తో కలిసి నటించిన విషయం తెలిసిందే. అరవింద్ జోషి మృతి పట్ల నటుడు పరేశ్ రావల్, మరికొందరు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. -
ఐఏఎస్ జంటను విధుల నుంచి తొలగించిన ప్రభుత్వం
భోపాల్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చెందిన ఐఏఎస్ అధికారుల జంట అరవింద్ జోషి, టిను జోషిలను ప్రభుత్వ సర్వీస్ నుంచి తొలిగించినట్లు ఉన్నతాధికారులు మంగళవారం ఇక్కడ వెల్లడించారు. అందుకు సంబంధించి ఆదేశాలు సోమవారం వారికి అందాయని తెలిపారు. మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన ఆ అధికారులు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో 2010 ఫిబ్రవరిలో ఆ దంపతుల నివాసంపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. ఈ నేపథ్యంలో రూ.350 కోట్లతో పాటు రూ. 3 కోట్ల నగదును ఆదాయపు పన్ను శాఖ అధికారులు కనుగొన్నారు. దాంతో అరవింద్ జోషి, టిను జోషిలను ప్రభుత్వ విధుల నుంచి సస్పెండ్ చేశారు. అనంతరం సదరు దంపతుల వద్ద ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని... ఈ నేపథ్యంలో వారిని విధుల నుంచి తొలగించేందుకు అనుమతి ఇవ్వాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అరవింద్, టీనులను విధుల నుంచి తొలగించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం... రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఐఏఎస్ జంటను విధుల నుంచి తొలగిస్తున్నట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తమను సర్వీస్ నుంచి తొలిగించడం అక్రమం అంటూ ఆ జంట రాష్ట్రపతి లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని సమాచారం.