వివాహితగా...! | Sharman Joshi and Kajal Aggarwal to star in Iranian remake | Sakshi
Sakshi News home page

వివాహితగా...!

Published Sun, Apr 27 2014 11:14 PM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

వివాహితగా...! - Sakshi

వివాహితగా...!

 ‘మీ పెళ్లెప్పుడు?’ అనడిగితే... ‘సమయం వచ్చినప్పుడు’ అని చెబుతుంటారు కాజల్ అగర్వాల్. నిజజీవితంలో గృహిణి ఎప్పుడవుతారో తెలియదు కానీ, ఓ హిందీ చిత్రంలో మాత్రం ఆ పాత్ర పోషించనున్నారు. ‘సీజ్ ఫైర్’ అనే ఇరానియన్ మూవీకి రీమేక్ ఇది. షర్మాన్ జోషి, కాజల్ అగర్వాల్ నాయకా నాయికలుగా అజయ్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. సెప్టెంబర్‌లో షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నారు. ఈ చిత్రకథ విషయానికొస్తే... చిరుకోపాలు, సరదా సరదా అలకలతో తమ సంసార జీవితాన్ని హాయిగా సాగించే భార్యాభర్తల మధ్య అనుకోకుండా మనస్పర్థలు నెలకొంటాయి.

వ్యవహారం విడాకుల వరకూ వచ్చాక, అసలు తప్పెవరిదో ఆలోచించడం మొదలుపెడతారు. చివరికి తమ తప్పులు తెలుసుకుని, కలిసి జీవించాలనుకుంటారు. ఇందులో భార్యాభర్తలుగా షర్మాన్, కాజల్ నటించనున్నారు. ఇరాన్‌లో ‘సీజ్‌ఫైర్’ ఘనవిజయం సాధించింది. 2006లో విడుదలైన ఈ చిత్రం ఇరానియన్ చలనచిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. హాలీవుడ్ చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్’ ఆధారంగా ఈ చిత్రం రూపొందించారట. హిందీ వెర్షన్ కోసం కథలో చిన్న చిన్న మార్పులు చేస్తున్నారని సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement