
హీరోయిన్ శ్రియ శరన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి, వెంకటేశ్ లాంటి స్టార్ హీరోలతో కలిసి వర్క్ చేసిన ఈమె.. కుర్ర హీరోల సరసన నటించింది. ప్రస్తుతం పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ.. అడపదడపా చిత్రాల్లో నటిస్తోంది. ఈమె నటించిన ఓ సినిమా.. తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది.
(ఇదీ చదవండి: 'బేబి' హీరోయిన్‌కి పెళ్లిపై ఇంట్రెస్ట్.. అలాంటోడే కావాలని!)
2001లో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రియ.. అప్పటినుంచి ఇప్పటివరకు హీరోయిన్ గా చేస్తూనే ఉంది. ఈ ఏడాది 'కబ్జ' అనే పాన్ ఇండియా సినిమాతో వచ్చింది. కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీని తర్వాత మే నెలలో 'మ్యూజిక్ స్కూల్' అనే సింపుల్ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించింది. ఇప్పుడు ఈ సినిమానే దాదాపు 4 నెలల తర్వాత అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, హిందీ,తమిళ భాషల్లో అందుబాటులో ఉంది.
'మ్యూజిక్ స్కూల్' కథేంటి?
హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ స్కూల్. చదువు ఒక్కటే ముఖ్యమని.. మిగతా వాటికి దూరంగా ఉంచేస్తారు ఆ పిల్లల తల్లిదండ్రులు. అలాంటి సమయంలో గోవాకు చెందిన మేరీ డిక్రూజ్(శ్రియ శరన్).. ఈ స్కూల్‌కి మ్యూజిక్ టీచర్‌గా వస్తుంది. అక్కడే డ్రామా టీచర్‌గా పనిచేస్తున్న మనోజ్ (శర్మన్ జోషి)తో ఫ్రెండ్‌షిప్ చేస్తుంది. వీళ్లిద్దరూ కలిసి పిల్లల పేరెంట్స్ ఆలోచనల్లో మార్పు తీసుకొచ్చారా? చివరకు ఏమైందనేదే సినిమా కథ.
(ఇదీ చదవండి: ఆ సినిమాలో ఏకంగా 24 పాటలు.. అది కూడా!)
Comments
Please login to add a commentAdd a comment