Music School
-
ఇన్నాళ్లకు ఓటీటీలోకి శ్రియ సినిమా.. తెలుగులోనూ రిలీజ్!
హీరోయిన్ శ్రియ శరన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి, వెంకటేశ్ లాంటి స్టార్ హీరోలతో కలిసి వర్క్ చేసిన ఈమె.. కుర్ర హీరోల సరసన నటించింది. ప్రస్తుతం పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ.. అడపదడపా చిత్రాల్లో నటిస్తోంది. ఈమె నటించిన ఓ సినిమా.. తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. (ఇదీ చదవండి: 'బేబి' హీరోయిన్‌కి పెళ్లిపై ఇంట్రెస్ట్.. అలాంటోడే కావాలని!) 2001లో టాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన శ్రియ.. అప్పటినుంచి ఇప్పటివరకు హీరోయిన్ గా చేస్తూనే ఉంది. ఈ ఏడాది 'కబ్జ' అనే పాన్ ఇండియా సినిమాతో వచ్చింది. కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీని తర్వాత మే నెలలో 'మ్యూజిక్ స్కూల్' అనే సింపుల్ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించింది. ఇప్పుడు ఈ సినిమానే దాదాపు 4 నెలల తర్వాత అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, హిందీ,తమిళ భాషల్లో అందుబాటులో ఉంది. 'మ్యూజిక్ స్కూల్' కథేంటి? హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ స్కూల్. చదువు ఒక్కటే ముఖ్యమని.. మిగతా వాటికి దూరంగా ఉంచేస్తారు ఆ పిల్లల తల్లిదండ్రులు. అలాంటి సమయంలో గోవాకు చెందిన మేరీ డిక్రూజ్(శ్రియ శరన్).. ఈ స్కూల్‌కి మ్యూజిక్ టీచర్‌గా వస్తుంది. అక్కడే డ్రామా టీచర్‌గా పనిచేస్తున్న మనోజ్ (శర్మన్ జోషి)తో ఫ్రెండ్షిప్ చేస్తుంది. వీళ్లిద్దరూ కలిసి పిల్లల పేరెంట్స్ ఆలోచనల్లో మార్పు తీసుకొచ్చారా? చివరకు ఏమైందనేదే సినిమా కథ. (ఇదీ చదవండి: ఆ సినిమాలో ఏకంగా 24 పాటలు.. అది కూడా!) -
ఆ విషయంలో నేను లక్కీ
‘‘పిల్లలకు చదువుతోపాటు ఆటపాటలు, సంగీతం కూడా చాలా ముఖ్యం. కానీ, ప్రస్తుతం ఎంతోమంది తల్లిదండ్రులు కేవలం చదువు, ర్యాంకులు అంటూ పిల్లలపై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో వారు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. పిల్లల్ని చదువుతోపాటు సంగీతం, ఆటపాటల్లోనూప్రోత్సహించాలని చెప్పే చిత్రమే ‘మ్యూజిక్ స్కూల్’’ అన్నారు శ్రియ.పాపారావు బియ్యాల స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘మ్యూజిక్ స్కూల్’. ► శ్రియ, శర్మాన్ జోషి, షాన్ ప్రధానపాత్రల్లో నటించారు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ నెల 12న ఈ చిత్రం విడుదల కానుంది. తెలుగులో ‘దిల్’ రాజు, హిందీలో ‘పీవీఆర్’ సినిమాస్ ‘మ్యూజిక్ స్కూల్’ని రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా సోమవారం విలేకరుల సమావేశంలో శ్రియ చెప్పిన విశేషాలు. ► ఐఏఎస్‌గా ఉన్నత స్థానంలో ఉన్నపాపారావుగారు సినిమాపై ΄్యాషన్‌తో ఐదారు కథలు సిద్ధం చేసుకున్నారు. వాటిలో ‘మ్యూజిక్ స్కూల్’ ఒకటి. ఈ కథ వినగానే ఎగై్జటింగ్‌గా అనిపించడంతో నటించేందుకు ఓకే చె΄్పాను. ‘సంతోషం’ చిత్రంలో నేను సంగీతం నేర్చుకునే స్టూడెంట్‌గా చేశా. ‘మ్యూజిక్ స్కూల్’లో సంగీతం నేర్పించే టీచర్పాత్ర నాది. ► పిల్లల్లో ఉండే ప్రతిభని తల్లితండ్రులు గుర్తించి,ప్రోత్సహించాలి. ఆ విషయంలో నేను లక్కీ. మా తల్లితండ్రులు ఏ విషయంలోనూ నాకు అడ్డు చెప్పకుండాప్రోత్సహించారు. మా అమ్మాయి రాధను కూడా చదువుతోపాటు సంగీతం, డ్యాన్స్, ఆటల్లో ప్రోత్సహిస్తాను.పాపారావుగారు ఈ మూవీని అద్భుతంగా తీశారు. ఈ సినిమాకి ఇళయరాజాగారి సంగీతం హైలైట్. ∙‘ఇష్టం’ (2001) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చాను. ఇన్నేళ్ల కెరీర్లో ఎంతోమంది దర్శకులతో పనిచేశా.. ఎన్నో వైవిధ్యమైనపాత్రలు చేశా.. ఇది నా అదృష్టంగా భావిస్తున్నా. నేను చేసే ప్రతిపాత్ర డ్రీమ్ రోల్లాంటిదే. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం షూటింగ్లో ఐదురోజులు మాత్రమేపాల్గొన్నాను. నాపాత్ర నిడివి తక్కువే అయినా ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి క్యారెక్టర్‌ను సవాలుగా తీసుకుని చేస్తాను. ప్రస్తుతం రెండు కొత్త సినిమాల్లో నటిస్తున్నాను. -
‘మ్యూజిక్ స్కూల్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ (ఫొటోలు)
-
పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను ప్రోత్సహించాలి
‘‘దాదాపు 16 ఏళ్లుగాపాపారావుగారితో నాకు పరిచయం ఉంది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారునిగా చేశారాయన.పాపారావుగారు ‘మ్యూజిక్ స్కూల్’ సినిమా తీస్తున్నారని న్యూస్‌పేపర్స్‌లో చూసి తెలుసుకున్నాను. మంచిగా సినిమా చేయాలని కోరుకున్నాను. మ్యూజిక్ స్కూల్ ట్రైలర్, సాంగ్స్ బాగున్నాయి. ఈ సినిమా టైటిల్ ‘మ్యూజిక్ స్కూల్’. కానీ నాకు ఇప్పుడు మ్యూజిక్ యూనివర్సిటీ (ఇళయరాజాని ఉద్దేశించి) పక్కన నిలబడే అవకాశం కలిగింది’’ అని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. శ్రియా శరన్, శర్మాన్ జోషి, షాన్ ప్రధాన ప్రాత్రల్లో నటించిన ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రం ‘మ్యూజిక్ స్కూల్’. ఇళయరాజా సంగీత సారథ్యంలోపాపారావు బియ్యాల స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న రిలీజ్ కానుంది. తెలుగురాష్ట్రాల్లో ‘దిల్’ రాజు, హిందీలో ‘పీవీఆర్’ ద్వారా ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ‘మ్యూజిక్ స్కూల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో తెలంగాణ మంత్రి కేటీఆర్, ఇళయరాజా సంయుక్తంగా ‘మ్యూజిక్ స్కూల్’ ఆడియోను విడుదల చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ – ‘‘అయితే ఇంజనీర్ కావాలి.. లేకపోతే డాక్టర్ కావాలి అంటూ పిల్లల్లో ఆర్ట్స్ పట్ల ఉండే సృజనాత్మకను చంపేస్తున్నాం. అలా చేయకూడదు’ అనే అంశంతో ‘మ్యూజిక్ స్కూల్’ సినిమా తీశామనిపాపారావుగారు చెప్ప్రారు. నా కొడుకుకి 17 ఏళ్లు. ఒక ప్రాట ప్రాడానని, రిలీజ్ చేస్తున్నానని మూడు నెలల క్రితం ‘గోల్డెన్ ఆర్’ అనే ఆల్బమ్ కవర్ చూపించాడు. మ్యూజిక్‌లో శిక్షణ తీసుకోనప్పటికీ తన స్కిల్స్, వాయిస్ చూసి చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఇలా చాలా మంది పిల్లల్లో ప్రతిభ దాగి ఉంటుంది. ఆ ప్రతిభను మనం తొక్కేయకుండా వారి (పిల్లలు) మనసుకు నచ్చింది చేసేలా ప్రోత్సహించాలంటూ ఈ ‘మ్యూజిక్ స్కూల్’ తీసినందుకుపాపారావుగారికి అభినందనలు’’ అన్నారు. ‘‘ఇరవయ్యేళ్ల క్రితం ఓ డాక్యుమెంటరీ తీశాను. అది చూసి రమేష్ ప్రసాద్‌గారు నాకు జాతీయ అవార్డు వస్తుందన్నారు. ఆయన చెప్పినట్లే ఆరు నెలల తర్వాత ఆ డాక్యుమెంటరీ ఫిల్మ్‌కి అవార్డు వచ్చింది. ఇళయరాజాగారి వద్దకు ‘మ్యూజిక్ స్కూల్’ స్క్రిప్ట్ తీసుకుని వెళ్లి, ‘ఈ సినిమాలో 11 ప్రాటలు ఉన్నాయి సార్’ అనగానే.. పది నిమిషాల్లో ఓకే అన్నారు. ఇళయరాజాగారు ఈ ప్రాజెక్ట్‌లోకి రాకపోయి ఉంటే నేను రాసిన కొన్ని స్క్రిప్ట్స్లాగే ఈ కథని కూడా పక్కన పెట్టేవాడిని’’ అన్నారుపాపారావు. ‘‘ఓ సినిమాకు, ఓ ఐఏఎస్ ఆఫీసర్‌కు సంబంధం లేదు. ఎంతో ఫ్యాషన్ ఉండబట్టిపాపారావుగారు ఈ సినిమాను నిర్మించి, దర్శకత్వం వహించారు. పిల్లలకు, తల్లిదండ్రులకు ఈ సినిమా ఓ మంచి సందేశంలాంటిది. ‘మ్యూజిక్ స్కూల్’ను స్కూల్స్‌లోనూ ప్రదర్శించాలనుకుంటున్నాం’’ అన్నారు ‘దిల్’ రాజు. -
నా కొడుక్కి 17 ఏళ్లు, ఓ రోజు సడన్‌గా నా దగ్గరకు వచ్చి: కేటీఆర్
'మ్యూజిక్ స్కూల్ సినిమా డైరెక్టర్, నిర్మాత పాపారావు బియ్యాల నాకు మంచి మిత్రుడు, తెలంగాణ ఉద్యమం అప్పుడు ఇక్కడే పని చేశారు. పాపారావు సినిమా తీశారనగానే చాలా ఆశ్చర్యపోయా. పేరెంట్స్ తమ పిల్లలు ఇంజనీర్, లేదంటే డాక్టర్ కావాలనుకుంటున్న ధోరణిని సినిమాలో చూపించారు. మనకు కావాల్సింది ఇంజనీర్లు మాత్రమే కాదు ఆర్టిస్టులు కూడా' అన్నారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. శ్రియ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మ్యూజిక్ స్కూల్. శర్మన్ జోషి, ప్రకాశ్ రాజ్, నటి లీలా సామ్సన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ నెల 12న విడుదల కానుంది. శనివారంనాడు హైదరాబాద్‌లో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 'నా కొడుక్కి 17 సంవత్సరాలు. మూడు నెలల కిందట సడన్‌గా ఒక రోజు నా దగ్గరకు వచ్చి ఓ సాంగ్ పాడాను, రిలీజ్ చేస్తున్నా అని చెప్పడంతో ఆశ్చర్యపోయా. చాలామందిలో హిడెన్ టాలెంట్ ఉంటుంది. మనం వాటిని తొక్కేయకుండా ఎంకరేజ్ చేయాలి. ఇళయరాజా గారు తెలంగాణలో మ్యూజిక్ ఇండస్ట్రీ పెట్టాలి' అన్నారు. ఇళయరాజా మాట్లాడుతూ.. 'మ్యూజిక్ ఉంటే వైలెన్స్ ఉండదు, చీటింగ్ ఉండదు. మ్యూజిక్ ఉంటే లక్ష్మి ఉంటుంది, సరస్వతి ఉంటుంది. కేటీఆర్ చెప్పినట్టు మ్యూజిక్ యూనివర్సిటీ వస్తే ఇక్కడ 200 మంది ఇళయరాజాలు తయారు అవుతారు. దేశం మొత్తం కూడా ఇక్కడ పర్ఫామెన్స్ ఇస్తారు' అని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రియ, దిల్ రాజు, జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటి గడప దాటడానికి కూడా పోరాటం చేయాల్సి వస్తోంది: శ్రియ
హీరోయిన్ శ్రియ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మ్యూజిక్ స్కూల్. యామిని ఫిలిమ్స్ పతాకంపై పాపారావు బియ్యాల స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. శర్మన్ జోషి, నటి లీలా సామ్సన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రం తమిళంలో కూడా అనువాద చిత్రంగా ఈనెల 12న తెరపైకి రానుంది. దీన్ని పీవీఆర్ పిక్చర్స్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది. ఈ సందర్భంగా చిత్రం యూనిట్ గురువారం చైన్నెలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. దర్శక, నిర్మాత పాపారావు మాట్లాడుతూ ఇది ఈ తరం విద్యార్థులు చూడాల్సిన ముఖ్యమైన చిత్రమని పేర్కొన్నారు. చదువు, పరీక్షలు అంటూ విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని దీంతో కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారన్నారు. అందుకు కారణం మానసిక ప్రశాంతత లేకపోవడమే అన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు మానసిక ఉల్లాసం కలిగించే ఆటలు, పాటలు, సంగీతం వంటివి వారి జీవితంలో ఒక భాగం కావాలని చెప్పే చిత్రమే మ్యూజిక్ స్కూల్ అని చెప్పారు. ఈ చిత్రం కోసం లండన్ వెళ్లి సంగీతం గురించి పరిశోధన చేసినట్లు తెలిపారు. అదేవిధంగా ఇళయరాజా సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా ఉంటుందన్నారు. శ్రియ మాట్లాడుతూ ఈ చిత్ర షూటింగ్‌కు వెళ్తున్నప్పుడు ఇంటికి వెళుతున్న భావన కలిగేదన్నారు. తాను మంచి తల్లిదండ్రులను కలిగిఉన్నానని, అందుకే అనుకున్నది చేయగలుగుతున్నానని చెప్పారు. తన బంధువుల్లో కొందరు ఇంటి నుంచి బయటికి రావడానికే చాలా పోరాటం చేయాల్సి వస్తోందన్నారు. ఈ చిత్ర కథ వినగానే అలాంటి విషయాలను అర్థం చేసుకోగలిగానన్నారు. ఇది ఈ తరానికి కావాల్సిన సినిమా అని పేర్కొన్నారు. దర్శకుడు పాపారావు చిత్రాన్ని చాలా అద్భుతంగా ఆవిష్కరించారని చెప్పారు. చదవండి: మళ్లీ రెచ్చిపోయిన అనసూయ, విజయ్ను టార్గెట్ చేసిందా? -
మ్యూజిక్ స్కూల్లో అడ్మిషన్ తీసుకోనున్న శ్రియా సరన్!
‘మ్యూజిక్ స్కూల్’లో అడ్మిషన్ తీసుకోనున్నారు శ్రియ. కానీ ఈ మ్యూజిక్ స్కూల్ సంగీతం నేర్చించే అకాడమీ కాదు. సంగీతం ద్వారా పిల్లల చదువుల గురించి చెప్పే ‘మ్యూజిక్ స్కూల్’ సినిమాలో ఆమె కథానాయికగా నటించనున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా బాణీలు అందిస్తారు. ‘విల్లింగ్ టు శాక్రిఫైజ్’ డాక్యుమెంటరీతో జాతీయ స్థాయి అవార్డులు సాధించిన బియ్యాల పాపారావు దర్శకత్వంలో ఈ సినిమాను యామినీ ఫిలింస్ నిర్మించనుంది. శర్మాన్ జోషి, శ్రియ ప్రధాన పాత్రల్లో నటించనున్న ఈ బహు భాషా చిత్రంలో బ్రహ్మానందం, ప్రకాశ్‌రాజ్ తదితరులు కీలక పాత్రధారులు. డాక్టర్లను, ఇంజినీర్లను చేయడానికి పిల్లలను క్రీడలకు, కళలకు దూరం చేస్తున్న అంశం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందట. ఇందులో దాదాపు పన్నెండు పాటలు ఉంటాయని సమాచారం. ఈ సినిమాకు లండన్ బేస్డ్ సినిమాటోగ్రాఫర్ కిరణ్ దేవ్హాన్స్ (హిందీ చిత్రం ‘జోధాఅక్బర్’కు వర్క్ చేశారు) వర్క్ చేయనున్నారు. -
కీబోర్డుతో గిన్నిస్ రికార్డు
బెంగళూరు(బనశంకరి) : వీణావాణి సంగీత పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా 400 మందికి పైగా కీబోర్డ్ వాయించడం ద్వారా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కారు. ఆదివారం బనశంకరి రెండో స్టేజ్‌లో ఉన్న శ్రీ వీణావాణి సంగీత పాఠశాల 41 వ వార్షికోత్సవం సందర్భంగా 400 మందికి పైగా విద్యార్ధులు ఒకేసారి కీబోర్డు వాయించడం ద్వారా గిన్నిస్ రికార్డుల్లో చేరారు. ఇది లోకాయుక్త న్యాయమూర్తి సంతోష్ హెగ్డే సమక్షంలో సాగింది. 1974 లో విద్వాన్ సంపత్‌కుమార్‌శర్మ నేతృత్వంలో వీణావాణి సంగీత పాఠశాల ఏర్పాటైంది. గత 15 ఏళ్లుగా గిరీశ్‌కుమార్ సారథ్యంలో వివిధ వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో ఆదివారం 400 మందికి పైగా విద్యార్థులతో కీబోర్డు వాయించే కార్యక్రమం ఒకటిగా ఉంది. ఈ సంస్థ నుంచి ఇప్పటివరకు 12 వేలకు పైగా విద్యార్థులు సంగీత విద్యను అభ్యసించారు. 2011లో 126మంది సంగీత కళాకారులతో ఒకేసారి వాయిద్యగోష్టి నిర్వహించడం ప్రథమంగా గిన్నిస్ రికార్డుల్లోకి చేరారు. అంతేగాక ఈ కార్యక్రమాన్ని అమెరికాలోని కాలిఫోర్నియాలో నిర్వహించిన కార్యక్రమంలో 175 మంది వాయిద్య కళాకారులతో వాయిద్యగోష్టి నిర్వహించడం విశేషం. 2014లో 229 మంది విద్యార్థులతో చెన్నైలో ఈ వాయిద్యగోష్టి నిర్వహించారు. వీణావాణి సంగీత పాఠశాల విద్యార్థులు ఈ మూడు రికార్డులను నెలకొల్పి గిన్నిస్ రికార్డుల్లో గుర్తింపు పొందారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణగురూజీ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవీంద్ర ప్రసాద్, ఉదయగరుడాచార్ తదితరులు పాల్గొన్నారు. -
పేదల కోసం...
ఏ.ఆర్. రెహమాన్... సినీ సంగీతానికి రారాజు. స్వదేశంలో కన్నా ఎక్కువగా విదేశాల్లోనే గడుపుతూ, ప్రపంచమంతా మెచ్చుకొనే సంగీతాన్ని అందిస్తున్న మ్యూజిక్ మెజీషియన్. ఇటీవలే ఆయన మీద ‘మొజార్ట్ ఫ్రమ్ మద్రాస్’ డాక్యుమెంటరీ వచ్చింది. కానీ, ఇంద్రుడు... చంద్రుడు అని పొగుడుతూ తన మీద వచ్చిన ఆ డాక్యుమెంటరీ చూడడానికి రెహమాన్ సిగ్గుల మొగ్గయిపోయారు. ‘‘నా గురించి నన్ను మాట్లాడమంటే, చాలా ఇబ్బందిగా అనిపించింది. కానీ, దర్శకులు డేనీ బోయల్, మణిరత్నం లాంటి వాళ్ళు నాతో పనిచేయడం ఎలా ఉంటుందో చెబుతుంటే, అలా చూస్తుండిపోయా. వాళ్ళ మాటల వల్ల నన్ను అందరూ ఇష్టపడుతున్నారు’’ అని రెహమాన్ వ్యాఖ్యానించారు. వయసు పెరుగుతున్న కొద్దీ, అనుభవం వస్తున్నకొద్దీ వర్ధమాన కళాకారులతో పంచుకోవడానికి ఎంతో ఉందని అర్థమవుతోందంటున్న రెహమాన్ తన చిరకాలవాంఛ ‘మ్యూజిక్ స్కూల్’ను కొన్నేళ్ళ క్రితమే నెరవేర్చుకున్నారు. రోజువారీ వ్యవహారాలను తన సోదరి చూస్తుంటే, వాళ్ళతో క్రమం తప్పకుండా సంప్రతింపుల్లో ఉంటున్నారు రెహమాన్. ఆర్థికంగా వెనుకబడినవారి కోసం ఆ మధ్య సొంతంగా ‘ది సన్‌షైన్ ఆర్కెస్ట్రా’ అంటూ ఒక మ్యూజికల్ బ్యాండ్‌ను ప్రారంభించిన ఆయన ఆ బ్యాండ్‌తో ప్రపంచమంతటా ప్రదర్శనలివ్వాలనుకుంటున్నారు. అలా తన మ్యూజిక్ స్కూల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకూ, బయట ఉండే ఇతర యువ సంగీతకళాకారులకూ ఆసక్తికరమైన పని కల్పించాలనుకుంటున్నారు. సినిమాల సంగతికొస్తే, ప్రసిద్ధ ఫుట్‌బాల్ ఆటగాడు పీలే జీవితంపై వస్తున్న ‘పీలే’ అనే అంతర్జాతీయ చిత్రానికీ, ప్రసిద్ధ ఇరానియన్ దర్శకుడు మజిద్ మజీదీ తీస్తున్న ‘ముహమ్మద్’కీ సంగీతం సమకూరుస్తున్నారు. నలభై ఎనిమిదేళ్ళ వయసుకే ఇంత సాధించిన రెహమాన్ ‘‘ప్రతిభ ఉన్నప్పటికీ, జీవితంలో పైకి రాని వ్యక్తులను చూసినప్పుడు దేవుడికి ఎంత కృతజ్ఞులమై ఉండాలో తెలుస్తుంది’’ అంటారు. ఎదిగినకొద్దీ ఒదగడమంటే ఇదే!