హీరోయిన్ శ్రియ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మ్యూజిక్ స్కూల్. యామిని ఫిలిమ్స్ పతాకంపై పాపారావు బియ్యాల స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. శర్మన్ జోషి, నటి లీలా సామ్సన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రం తమిళంలో కూడా అనువాద చిత్రంగా ఈనెల 12న తెరపైకి రానుంది. దీన్ని పీవీఆర్ పిక్చర్స్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది.
ఈ సందర్భంగా చిత్రం యూనిట్ గురువారం చైన్నెలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. దర్శక, నిర్మాత పాపారావు మాట్లాడుతూ ఇది ఈ తరం విద్యార్థులు చూడాల్సిన ముఖ్యమైన చిత్రమని పేర్కొన్నారు. చదువు, పరీక్షలు అంటూ విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని దీంతో కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారన్నారు. అందుకు కారణం మానసిక ప్రశాంతత లేకపోవడమే అన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు మానసిక ఉల్లాసం కలిగించే ఆటలు, పాటలు, సంగీతం వంటివి వారి జీవితంలో ఒక భాగం కావాలని చెప్పే చిత్రమే మ్యూజిక్ స్కూల్ అని చెప్పారు.
ఈ చిత్రం కోసం లండన్ వెళ్లి సంగీతం గురించి పరిశోధన చేసినట్లు తెలిపారు. అదేవిధంగా ఇళయరాజా సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా ఉంటుందన్నారు. శ్రియ మాట్లాడుతూ ఈ చిత్ర షూటింగ్‌కు వెళ్తున్నప్పుడు ఇంటికి వెళుతున్న భావన కలిగేదన్నారు. తాను మంచి తల్లిదండ్రులను కలిగిఉన్నానని, అందుకే అనుకున్నది చేయగలుగుతున్నానని చెప్పారు. తన బంధువుల్లో కొందరు ఇంటి నుంచి బయటికి రావడానికే చాలా పోరాటం చేయాల్సి వస్తోందన్నారు. ఈ చిత్ర కథ వినగానే అలాంటి విషయాలను అర్థం చేసుకోగలిగానన్నారు. ఇది ఈ తరానికి కావాల్సిన సినిమా అని పేర్కొన్నారు. దర్శకుడు పాపారావు చిత్రాన్ని చాలా అద్భుతంగా ఆవిష్కరించారని చెప్పారు.
చదవండి: మళ్లీ రెచ్చిపోయిన అనసూయ, విజయ్‌ను టార్గెట్ చేసిందా?
Comments
Please login to add a commentAdd a comment