నటి శ్రియ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈమె భారతీయ సినిమాలో అగ్ర కథానాయకిగా రాణించిన నటి ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో ప్రముఖ హీరోలందరి సరసన నటించి మెప్పించారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో పాటు కోలీవుడ్‌లో చాలా తక్కువ సమయంలోనే సూపర్ స్టార్ రజనీకాంత్‌తో నటించే అవకాశం దక్కించుకున్నారు. అలాంటిది నటిగా కొనసాగుతున్న సమయంలోనే శ్రియ ఆండ్రీ కొస్చీవ్ అనే రష్యాకు చెందిన తన బాయ్ ఫ్రెండ్‌ను 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు.
వీరికి ఒక కూతురు కూడా పుట్టింది. ఆ పాపకు రాధ అని పేరు పెట్టారు. అయినప్పటికీ శ్రియ సినిమాల్లో నటించడం మానుకోలేదు. అయితే ప్రస్తుతం అవకాశాలు తగ్గాయి. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం ఒక సినిమా కూడా చేతిలో లేదు. ఈ ఏడాది ఈమె నటించిన కన్నడ చిత్రం కబ్జా, పాన్ ఇండియా చిత్రం మ్యూజిక్ స్కూల్ చిత్రాలు విడుదలయ్యాయి. కాగా తన గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ తద్వారా అభిమానులను, సినీవర్గాలను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటారు.
అలా తాజాగా శ్రీయ ప్రత్యేకంగా ఫొటో సెషన్ ఏర్పాటు చేసుకున్నారు. అందుకు ఆమె మూడేళ్ల కూతురు సహాయం చేయడం ఆసక్తికరమైన విషయం. తల్లి కోసం మూడేళ్ల ఈ పాప అద్దం చూపిస్తున్న దృశ్యాన్ని శ్రియ చూసి ఆనంద పరవశం పొందుతున్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో విడుదలై వైరల్ అవుతోంది. చిన్న వయసులోనే ఇలా తల్లికి సాయంగా ఉన్న ఆ చిన్నారిని చూసిన నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment