నటి శ్రియ ఏడు భాషల్లో కబ్జా చేయడానికి రెడీ అయ్యారు. శ్రీ సిద్ధేశ్వర ఎంటర్‌ప్రైజస్, ఎంటీబీ నాగరాజ్ ప్రజెంట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న చిత్రం కబ్జా. నటుడు ఉపేంద్ర, సుదీప్ కథానాయకులుగా నటిస్తున్న ఇందులో నటి శ్రియ నాయకిగా నటిస్తున్నారు. పలు అవార్డులను అందుకున్న సక్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు ఆర్.చంద్రు దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ చిత్ర షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. ఇది తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, ఒరియా, మరాఠీ, హిందీ వంటి ఏడు భాషల్లో రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం అని దర్శకుడు చెప్పారు.
కళకు భాష లేదని చెప్పే విధంగా యూనిక్ కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. కేజీఎఫ్ చిత్రం తరువాత అంత భారీ బడ్జెట్‌లో తెరకెక్కిస్తున్న చిత్రం ఇదేనన్నారు. కేజీఎఫ్ చిత్రం ఫేమ్ రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి ఏజే శెట్టి ఛాయాగ్రహణం అందిస్తున్నారన్నారు. ఇందులో ఉపేంద్ర, నటి శ్రియ రాజా, రాణిగా నటించడం విశేషం అన్నారు. ఈ చిత్రం తమిళ ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకాన్ని దర్శకుడు వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment