బాక్సాఫీసు వద్ద సత్తా చాటుతున్న సీనియర్‌ హీరోయిన్లు | Senior Heroine Tabu, Trisha, Shriya Upcoming Movies | Sakshi
Sakshi News home page

బాక్సాఫీసు వద్ద సత్తా చాటుతున్న సీనియర్‌ హీరోయిన్లు

Published Sun, Dec 11 2022 3:15 PM | Last Updated on Sun, Dec 11 2022 3:15 PM

Senior Heroine Tabu, Trisha, Shriya Upcoming Movies - Sakshi

సినిమాల సక్సెస్ రేటు పడిపోయింది. విజయాలు రావటం అంటే అశా మాషి విషయం కాదు అనేలా మారింది. అయితే..కొందరు సీనియర్ భామలు మాత్రం..వెతుక్కుంటూ మరి హిట్ సినిమాలలో నటిస్తున్నారు. వీళ్ల గురించి..ఎవరు పట్టించుకోని టైమ్ లో..ఫోకస్ మొత్తం ఈ బ్యూటీల సైడ్ మారిపోయేలా చేశారు.ముందు ముందు కూడా మంచి సినిమాలతో దూసుకపోయేలా ప్లాన్ కూడా చేస్తున్నారు.

టాబు అప్పట్లో కథానాయికగా ఓ ఊపు ఊపింది.ఇప్పుడు కూడా ప్రధాన పాత్రలలో నటిస్తూ..ఆకట్టుకుంటుంది. ఈమె నటించిన దేదే ప్యార్ దే మూవీ హిట్ కొట్టింది.అలాగే అల..వైకుంఠపురంలో మూవీలో కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటించిన మ్యాటర్ తెలిసిందే. ఈమె ప్రధాన పాత్రలో నటించిన భూల్ భులయ్య 2 కూడా బిగ్ హిట్ కొట్టింది.అలాగే రీసెంట్ గా దృశ్యం 2 లో  కూడా నటించింది.ఈ మూవీ రెండు వందల కోట్ల వసూళ్లు రాబట్టింది

శ్రీయా శరన్ కూడా టాలీవుడ్ తో పాటు..బాలీవుడ్ లో నటించింది. ఈ భామ అదృష్టం కూడా బాగానే ఉంది. ట్రిపుల్ ఆర్  లాంటి పాన్ ఇండియా మూవీలో ఓ పాత్రలో మెరిసింది..దృశ్యం 2 లో అజయ్ దేవగన్ పక్కన జోడి కట్టింది.

2018 లో వచ్చిన 96  సినిమా తప్పితే,త్రిషకు అనుకున్న విజయాలు మాత్రం దక్కటం లేదు. ఈ ఏడాది పొన్నియిన్ సెల్వన్ మూవీలో కుందవాయ్ దేవిగా ఆకట్టుకుంది .ఈ మూవీ బిగ్ హిట్ కొట్టింది. అలాగే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తలపతి 67 మూవీ రూపొందబోతుంది.ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా ఫిక్స్ అయిందట. మొత్తానికి సినిమా సక్సెస్‌ రేట్‌ పడిపోయినా..కొందరు సీనియర్ హీరోయిన్స్ బాక్సాఫీసు దగ్గర సత్తా చూపిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement