తమిళ స్టార్ దళపతి విజయ్ ప్రస్తుతం 'గోట్' చిత్రంలో నటిస్తున్నారు. సురేశ్ ప్రభు డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. త్వరలో నటుడు విజయ్ త్వరలో సినిమాలకు స్వస్తి చెప్పి రాజకీయాలపై పూర్తిగా దృష్టి సారించనున్నారు. త్వరలో పాదయాత్ర కూడా చేయనున్నారని వార్తలు వచ్చాయి. అయితే, విజయ్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
2012లో ఎంతో ఇష్టపడి రోల్స్‌రాయ్స్ ఖరీదైన కారును ఆయన కొనుగోలు చేశారు. అయితే దాన్ని విదేశాల నుంచి తెప్పించుకోవడం వల్ల లోకల్ టాక్స్ కట్టలేదనే ఆరోపణలను విజయ్ ఎదుర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఆయన కోర్టును కూడా ఆశ్రయించి భంగపడ్డారు. చైన్నె న్యాయస్థానం విజయ్‌కు రూ.లక్ష జరిమానా కూడా విధించింది.
అలాంటిది విజయ్ తను ముచ్చటపడి కొనుక్కున ఖరీదైన కారు విక్రయానికి వచ్చిందనే వార్త తమిళనాట సంచలనంగా మారింది. ఎంపైర్ ఆటోస్ కార్ డీలర్‌షిప్ విజయ్ ఉపయోగించిన కారు అమ్మకానికి వచ్చింది అని రోల్స్‌రాయ్స్ కారు ఫొటోను కూడా పోస్ట్ చేస్తూ ఒక వీడియోను విడుదల చేసింది. దీని ధర రూ.26 కోట్లు అని, అయితే ఇది నిర్ణయిత ధర కాదని పేర్కొన్నారు. అయితే అది విజయ్ కారా, కాదా అనే చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment