మళ్లీ ఆయనతో జతకడుతోంది.. | amala paul act with siddhartha next movie | Sakshi
Sakshi News home page

మళ్లీ ఆయనతో జతకడుతోంది..

Published Fri, Jan 26 2018 7:43 PM | Last Updated on Thu, Aug 9 2018 7:30 PM

amala paul act with siddhartha next movie - Sakshi

అమలాపాల్ మరోసారి సిద్ధార్థ్‌తో రొమాన్స్‌కు సిద్ధమవుతోంది‌. ఈ కేరళాకుట్టికి ఈ మధ్య అవకాశాలు తగ్గుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇంతకుముందు తమిళం, తెలుగు, మలయాళం అంటూ వరుసగా చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్న అమలాపాల్‌ను వివాహానంతరం క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదని అందరూ అనుకున్నారు. అలాంటిది ఈ అమ్మడిని తెరపై చూసి చాలా కాలం అవుతుండడంతో అవకాశాలు తగ్గాయా అని ఆమె అభిమానులకు అనుమానం కలుగుతోంది. అయితే త్వరలో అరవిందస్వామితో జత కట్టిన భాస్కర్‌ ఒరు రాస్కెల్‌ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం రాక్షసన్‌ అనే చిత్రంతో నటిస్తోంది. అదేవిధంగా ఒక మలయాళ చిత్రంలోనూ నటిస్తున్న అమలాపాల్‌కు చాలా గ్యాప్‌ తరవాత తెలుగులో అవకాశం వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. 

తాజాగా అమలాపాల్‌ సిద్ధార్థ్‌తో రొమాన్స్‌ చేయడానికి రెడీ అవుతున్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. ఈ జంట 2012లో కాదలిల్‌ సొదప్పవదు ఎప్పడి అనే చిత్రంలో నటించారు. ఆ చిత్రం మంచి విజయాన్నే అందుకుంది. మళ్లీ సుమారు ఏడేళ్ల తరువాత వీరిద్దరూ కలిసి రొమాన్స్‌ చేయడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి ఇంతకు ముందు లేడీ సూపర్‌స్టార్‌ నయనతార హీరోయిన్‌గా అరమ్‌ వంటి సంచలన చిత్రాన్ని తెరకెక్కించిన గోపినయినార్‌ దర్శకత్వం వహించినున్నారు. ఈయన్ని నయనతార అరమ్‌ చిత్రానికి సీక్వెల్‌ చేద్దాం అని చెప్పడంతో సిద్ధార్థ్‌, అమలాపాల్‌తో చేసే చిత్రాన్ని త్వరగా పూర్తి చేసే, తదుపరి నయనతారతో అరమ్‌-2 చేయనున్నట్లు తాజా సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement