siddartha
-
ఆ యువకుడి కళ్లు ఇంకా లోకాన్ని చూస్తున్నాయి!
సాక్షి. కరీంనగర్: అంతర్గాం మండలంలోని పెద్దంపేటకు చెందిన బయ్యపు సిద్ధార్థరెడ్డి చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందాడు. హైదరాబాద్‌లోని రామాయమ్మ ఇంటర్నేషనల్ ఐ బ్యాంకు, ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వైద్య బృందం మృతుడి కుటుంబసభ్యులతో మాట్లాడి, అతని నేత్రాలను సేకరించారు. ఎంతో బాధలో ఉన్నప్పటికీ మృతుడి నేత్రాలను దానం చేసేందుకు ముందుకు వచ్చిన అతని మేనమామ గుడి మాధవరెడ్డి, సోదరుడు రాకేశ్‌రెడ్డి, బంధువులు శ్రీనివాస్‌రెడ్డి, రాజిరెడ్డిలను వైద్యులు అభినందించారు. చదవండి: 'గొడవలు పెట్టుకోవద్దు.. పరువు పోతుందంటూ..' చివరికి బీటెక్ విద్యార్థి? -
LIC నూతన చైర్మన్ గా సిద్ధార్థ మొహంతి నియామకం
-
స్నేహితుడితో వివాహేతర సంబంధం.. ఆపై భర్తతో కలిసి..
సాక్షి, రాయచూరు రూరల్: భర్త, కుటుంబ సభ్యులతో కలిసి ప్రియుడిని హత్య చేసిన ప్రేయసి ఘటన యాదగిరి జిల్లాలో ఆదివారం జరగగా ఆలస్యంగా వెలుగు చూసింది. గురుమట్కల్ తాలూకా కడేచూరు–బాడియాళ పారిశ్రామికవాడలో సిద్దార్థ(30) అనే వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. ఘటన పూర్వాపరాలు...యాదగిరి తాలూకా యలసత్తికి చెందిన సిద్దార్థ బెంగళూరులో సొంతంగా రెండు కార్లను అద్దెకు తిప్పేవాడు. కడేచూరుకు చెందిన శ్రీదేవి(35) అనే మహిళకు శహపుర తాలూకాకు చెందిన బీ.నాగప్పతో పదేళ్ల క్రితం వివాహమైంది. బ్రతుకుదెరువు కోసం బెంగళూరు వెళ్లిన ఈ దంపతులు అక్కడ సిద్దార్థ నివాసం ఉంటున్న ఇంటి పక్కనే బాడుగకు ఇల్లు తీసుకుని నివాసమున్నారు. వివాహేతర సంబంధానికి దారి తీసిన స్నేహం ఈక్రమంలో సిద్దార్ధ, శ్రీదేవిల మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా స్నేహంగా, చివరకు ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారి తీసింది. శ్రీదేవితో కలిసి తమ సొంతూరికి మకాం మార్చిన సిద్దార్థ అనంతరం తన వద్ద ఉన్న కార్లను జల్సాల కోసం అమ్మేశాడు. అతని వద్ద ఉన్న సొమ్మునంతా కాజేసిన శ్రీదేవి తిరిగి భర్తను ఆశ్రయించింది. నాగప్పతో కలిసి ఉండేందుకు మళ్లీ బెంగళూరుకు చేరింది. మళ్లీ జీవనోపాధి కోసం సిద్దార్ధ కూడా బెంగళూరు చేరాడు. అయితే నాలుగేళ్ల క్రితం శ్రీదేవి, నాగప్ప కడేచూరుకు తిరిగొచ్చారు. శ్రీదేవిని చూడాలనుకుంటే సిద్దార్థ నేరుగా బెంగళూరు నుంచి వచ్చి కలిసి మాట్లాడేవాడు. ఓసారి శ్రీదేవి ఇకపై తన వద్దకు రావద్దని సిద్దార్థకు చెప్పడంతో జీవితంపై విరక్తితో ఆత్మహత్యాయత్నం చేశాడు. చదవండి: (బడిలోనే బార్.. ఆ టీచరమ్మ రూటే వేరు) వారించినా వస్తున్నాడనే... చివరికి సిద్దార్థ తల్లిదండ్రులు జరిగిందేదో జరిగింది, దాన్ని గురించి ఆలోచించకుండా యలసత్తిలో వ్యవసాయం చేసుకొమ్మన్నారు. అయినా ఇటీవల శ్రీదేవిని చూడాలనే ఆశతో యలసత్తి నుంచి సిద్దార్థ కడేచూరుకు వచ్చాడు. ఎంత వారించినా తరచూ వస్తున్నాడని కోపం పెంచుకున్న శ్రీదేవి, ఆమె భర్త నాగప్ప, నాగప్ప తల్లి మహదేవమ్మ, సోదరుడు తిరుపతి కలసి సిద్దార్ధను బాడియాళ పారిశ్రామికవాడలో కొట్టి హత్య చేశారని యాదగిరి జిల్లా ఎస్పీ వేదమూర్తి తెలిపారు. ఈ విషయంపై సమాచారం అందుకుని నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనపై సైదాపుర పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కాళప్ప బడిగేర్ కేసు నమోదు చేసుకోగా దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ బసవరాజ్ తెలిపారు. -
‘బొమ్మరిల్లు’లో హాసిని పాత్ర నా నిజ జీవితంలోనిది: డైరెక్టర్
‘బొమ్మరిల్లు’.. ఈ సినిమా పేరు వినగానే మొదట గుర్తొచ్చే పాత్ర ఏంటంటే హా.. హా.. హాసిని. అంతగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మొత్తం హీరోయిన్ చూట్లూ తిరిగే ఈ సినిమా అప్పట్లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. బొమ్మరిల్లు హిట్‌తో డైరెక్టర్ భాస్కర్ పేరు ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌గా మారింది. అంత పెద్ద విజయం సాధించిన ఈ మూవీకి సంబంధించిన మరిన్ని విశేషాలను డైరెక్టర్ భాస్కర్ ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. సినిమా సక్సెస్‌లో కీ రోల్ పోషించిన హాసిని పాత్రను ఎలా క్రియేట్ చేశారన్నది ఈ సందర్భంగా వివరించాడు. చదవండి: ఆ వీడియోలోని వ్యక్తి నేను కాదు.. జో బైడెన్ మీద ఒట్టు!: వర్మ ఆయన మాట్లాడుతూ.. తన నిజ జీవితంలో జరిగిన ఘటన ఆధారంగా హాసిని పాత్రను తీర్చిదిద్దినట్లు వెల్లడించారు. ‘ఆర్య సినిమాకు పని చేస్తున్న సమయంలో ఈ మూవీ హిట్ అయితే నాతో ఓ సినిమా చేస్తానని రాజు గారు(‘దిల్’ రాజు) మాట ఇచ్చారు. మంచి కథ సిద్దం చేసి తనని కలవమని చెప్పారు. అనుకున్నట్టుగానే ఆర్య హిట్ అయ్యింది. దీంతో ఆయనకు రెండు సార్లు స్క్రిప్ట్‌లు వివరించాను. అవి ఆయనకు నచ్చలేదు. మూడోసారి బొమ్మరిల్లు కథతో వెళ్లాను. ఈ కథ నచ్చింది కానీ, హీరోయిన్ పాత్ర అంతగా లేదు, దాని మీద మరింత వర్క్ చేసి రమ్మన్నారు. దీనికి నేను 15 రోజులు గడువు అడిగాను. హీరోయిన్ పాత్ర ఎలా తీర్చిదిద్దాలని నేను, వాసు వర్మ తెగ ఆలోచించాం. కానీ సరైన లైన్ తట్టట్లేదు. ఇలా 14 రోజులు గడిచాయి. చిరాకు వస్తుంది. 15వ రోజు వచ్చేసింది. రాత్రంతా నిద్ర లేదు’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: ‘కాంచన 3’ మూవీ హీరోయిన్ అనుమానాస్పద మృతి.. ఇక ‘ఆ రోజు రాత్రి నేను, వాసు చర్చించుకుంటూనే ఉన్నాం. మాటల మధ్యలో నా జీవితంలో జరిగిన సంఘటనను ఆయనకు చెప్పాను. ఒకమ్మాయిని అనుకోకుండా గుద్ది సారీ చెబితే.. తనొచ్చి ఒకసారి గుద్ది వెళ్లిపోతే కొమ్ములు వస్తాయని మరోసారి ఢీకొట్టి వెళ్లిందని చెప్పాను. అది బాగుందని వాసు అనడంతో ఆ సీన్ రాశాం. ఇక దాని చుట్టూ సన్నివేశాలు అల్లుకుంటూ పాత్రను తీర్చిదిద్దాం. మరుసటి రోజు సాయంత్రం వెళ్లి రాజు గారికి ఈ క్యారెక్టర్ గురించి చెబితే భలే ఉంది అన్నారు. దీంతో ఈ పాత్రకు ఏ హీరోయిన్ కావాలని అడిగారు. జెనీలియాను తీసుకుందామని చెప్పాను. అలా హాసిని పాత్రను చాలా కష్టపడి క్రియేట్ చేశాం’ అని వివరించాడు. కాగా 9 ఆగష్టు 2006 విడుదలైన ఈ చిత్రంలో హీరోగా సిద్దార్థ్ నటించాడు. ప్రకాశ్ రాజ్, జయసుధలు ప్రధాన పాత్రలు పోషించారు. చదవండి: ఫుట్‌బోర్డ్‌పై సమంత, నయన్, విజయ్.. వీడియో వైరల్ -
‘మహా సముద్రం’ మూవీలో సిద్దార్థ్‌కు అంత రెమ్యునరేషనా?!
దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత హీరో సిద్దార్థ్ ‘మహా సముద్రం’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతున్నాడు. ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సిద్దార్థ్ శర్వానంద్‌తో కలిసి నటిస్తున్నాడు. కాగా శంకర్ డైరెక్షన్లో వచ్చిన ‘బాయ్స్’ మూవీతో హీరోగా పరిచయమైన సిద్దు 2005లో విడుదలైన ‘నువ్వోస్తానంటే నెనోద్దంటానా..’ మూవీతో తెలుగులో స్టార్ హీరోగా మారాడు. ఈ మూవీ ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం. ఇక ‘బొమ్మరిల్లు’ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న సిద్దుకు ఆ తర్వాత పెద్దగా హిట్స్ లేవు. చివరగా ‘ఓ మై ఫ్రెండ్’ చిత్రంతో అభిమానులను అలరించిన అతడు తెలుగు తెరకు దూరమై 9 ఏళ్లు అవుతుంది. ఇన్నేళ్ల తర్వాత మహా సముంద్రంతో మళ్లీ ప్రేక్షలకును అలరించడానికి వస్తున్నాడు సిద్దు. ఇదిలా ఉండగా ఈ మూవీలో సిద్దార్థ్ రెమ్యూనరేషన్ హాట్‌టాపిక్‌గా మారింది. పూర్తిగా తెలుగులో పేడ్ అవుట్ అయిన హీరోగా పేరు తెచ్చకున్న సిద్దు మహాసముద్రం మూవీకి 3 కోట్ల రూపాయల పారితోషికంగా తీసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇది విన్న చాలా మంది షాక్ అవుతున్నారు. ఇప్పుడున్న తెలుగు కుర్ర హీరోలలో ఎవరికి ఇంతటి పారితోషికం లేదని, తొమ్మిదేళ్ల తర్వాత కూడా సిద్దార్థ్ ఈ స్థాయిలో పారితోషికం తీసుకోవడం ఆశ్చర్యం అంటూ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. కాగా ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్, ఆదితి రావు హైదరిలు కథానాయికలుగా నట్తిసున్నారు. త్వరలోనే మహాసముద్రం మూవీ విడుదల కానుంది. చదవండి: ‘మహాసముద్రం’ నుంచి సిద్ధార్థ్ ఫస్ట్‌లుక్ విడుదల Maha Samudram: గూని బాబ్జీగా రావు రమేశ్.. ఫస్ట్‌లుక్ వైరల్ -
ఐశ్వర్య, అమర్త్య ఎంగేజ్మెంట్
సాక్షి, బెంగళూరు దివంగత కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ కుమారుడు, బీజేపీ నాయకుడు ఎస్.ఎం.కృష్ణ మనవడు అమర్త్య హెగ్డేతో కర్ణాటక మాజీ మంత్రి, కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కుమార్తె ఐశ్వర్య (22) నిశ్చితార్థ వేడుక గురువారం పూర్తయింది. బెంగళూరులో జరిగిన ఈ కార్యక్రమంలో ఇరు కుటుంబాల సన్నిహితులు పాల్గొన్నారు. కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఈ కార్యక్రమానికి హాజరై కాబోయే జంటను ఆశీర్వదించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరలో వీరి వివాహం చేసేందుకు నిశ్చయించారు. చిన్ననాటి స్నేహితులైన సిద్ధార్థ, శివకుమార్ వియ్యమందాలని గతంలోనే భావించారు. అయితే అనూహ్యంగా సిద్దార్థ ఆత్మహత్య చేసుకోవడంతో ఇరు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. దీంతో వివాహాన్ని అనివార్యంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత కరోనా మహమ్మారి, లాక్డౌన్ ఆంక్షలు అడ్డొచ్చాయి. తాజాగా అన్ని అడ్డంకులను అధిగమించి అమర్త్య హెగ్డే - ఐశ్వర్య వివాహాన్ని ఖాయం చేసుకున్నారు. బిజినెస్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన సిద్ధార్థ కుమారుడు తల్లి మాళవికతో కలిసి తన తండ్రి వ్యాపారాలను చూసుకుంటున్నారు. అటు ఐశ్వర్య డీకే శివకుమార్ స్థాపించిన ఇంజనీరింగ్ కళాశాల గ్లోబల్ అకాడమీ ఆఫ్ టెక్నాలజీని నిర్వహిస్తున్నారు. కాగా వీజీ సిద్దార్థ గత ఏడాది జూలై 2019 లో అదృశ్యమయ్యారు. తర్వాత కొద్ది రోజులకు నేత్రావతి నదిలో ఆయన మృతదేహం లభ్యమైంది. ఆర్థిక సమస్యలతోనే సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు తేల్చిన సంగతి తెలిసిందే. .@CMofKarnataka @BSYBJP attended @INCIndia @KPCCPresident @DKShivakumar's daughter's engagement ceremony. pic.twitter.com/T0vrMfWcsa — Imran Khan (@keypadguerilla) November 19, 2020 -
అలల కంటే మొండివాడిని.. మరి మీరూ?!
‘ఆర్ఎక్స్ 100’తో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి ఇటీవల శర్వానంద్, హీరో సిద్దార్థ్‌లతో మల్లీస్టార్ చిత్రం ‘మహాసముద్రం’ తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ థీమ్ పోస్టర్‌ను హీరో శర్వానంద్ దీపావళి సందర్భంగా విడుదల చేశాడు. ఎకే ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యూయేల్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. దీపావళి పండగ సందర్భంగా ఈ సినిమా థీమ్ పోస్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ థీమ్ పోస్టర్‌ను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ... ‘సముద్రం అంతా లోతు, అలల కంటే మొండివాడిని.. అంటూ తన సహా నటులైన సిద్దార్థ్‌తో పాటు హీరోయిన్స్ అదితి రావ్, అను ఇమ్మాన్యూమేల్‌లను ట్యాగ్ చేసి మరీ మీరు ఎవరూ అని ప్రశ్నించాడు. అంతేగాక దర్శకుడు అజయ్ భూపతి, నిర్మాతలను ట్యాగ్ చేసి ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపాడు. (చదవండి: షేక్ చేస్తున్న శర్వానంద్ ‘భలేగుంది బాలా’ సాంగ్) I'm stubborn than the waves, deep as the seas! @aditiraohydari @Actor_Siddharth @ItsAnuEmmanuel Who are you? #MahaSamudram #ThemePoster 🌊 #HappyDiwali 🪔@DirAjayBhupathi @AnilSunkara1 @AKentsOfficial pic.twitter.com/MGHfjfaFb8 — Sharwanand (@ImSharwanand) November 14, 2020 కాగా అజయ్ భూపతి మొదటిసారిగా దర్శకత్వం వహించిన రొమాంటిక్ చిత్రం ‘ఆర్ఎక్స్ 100’ బ్లాక్‌బ్లస్టర్ హిట్ కావడంతో ప్రేక్షకులు ఈ సినిమాపై భారీగానే అంచనాలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎర్రటి ఆకాశం, సముద్రం బ్యాక్‌గ్రౌండ్‌లో బ్రిడ్జికి అవతలవైపు ఓ వ్యక్తి పరుగులు తీస్తూ, ఇవతల బ్రిడ్జిపై ఇద్దరూ మనుషులు గన్‌పై నిలుచున్నట్లుగా ఉండి పరుగెడుతున్న వ్యక్తి వైపు గురిపెడుతున్న ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇక పొస్టర్‌కు కింద ‘అమితమైన ప్రేమ’ అనే ట్యాగ్ లైన్ ఉండటం చూసి ‘సముద్రం’ రోమాంటిక్, థ్రీల్లర్ నేపథ్యంలో సాగనుందని, దర్శకుడు ఈ సినిమాను ఓరెంజ్‌లో చూపించబోతున్నాడంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక దాదాపు ఏడేళ్ల తర్వాత ‘బొమ్మరిల్లు’ హీరో సిద్దార్థ్ తెలుగు రీఎంట్రీ ఇవ్వడంలో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. ఈ చిత్రం ప్రస్తుతం విశాఖపట్నంలో షూటింగ్ జరుపుకుంటోంది. (చదవండి: టాలీవుడ్లో కొత్త జోడి.. సాయి కాదు అదితి) -
‘సాగు’ బాగుంటేనే ప్రగతి సాధ్యం
దేశంలో కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సన్నకారు రైతులు గరిష్టంగా చేసిన రెండు లక్షల రూపాయల రుణాన్ని మాఫీ చేస్తున్నందుకే మన ఆర్థికవేత్తలు, ఆర్థికరంగ సమర్థకులు ద్రవ్యలోటు చుక్కలంటుతుందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. కానీ మన బ్యాంకులు లక్షల కోట్ల మేరకు కార్పొరేట్ రుణాలను అలవోకగా మాఫీ చేసినప్పుడు వీరికి ద్రవ్యలోటు ప్రమాదం గుర్తుకురావడం లేదు. వ్యవసాయరంగ దుస్థితిని పట్టించుకోని మన విధాన నిర్ణేతలు ఒకటి, రెండు నెలలు కార్లు, ఆటోమైబైల్స్ అమ్మకాలు పడిపోయి, పరిశ్రమలు కొన్ని వేల ఉద్యోగాలకు కోతపెట్టగానే కొంపలంటుకుపోయినట్లు గావుకేకలు పెడుతున్నారు. వ్యవసాయరంగం నిత్య సంక్షోభంలో కూరుకుపోయినంతకాలం మన ఆర్థిక వ్యవస్థ కూడా నిత్య అనిశ్చిత పరిస్థితుల్లోనే కొనసాగుతుంది. దేశీయ డిమాండ్ పెరగాలంటే వ్యవసాయరంగంలో భారీ పెట్టుబడులు పెట్టాలి. కెఫే కాఫీ డే వ్యవస్థాపకుడు వీఎమ్ సిద్ధార్థ తన జీవితాన్ని ముగించుకుంటున్నట్లు ప్రకటించి ఆత్మహత్య చేసుకున్న కొద్ది రోజుల తర్వాత అయిదు మంది రైతులు మహారాష్ట్రలోని అకోలా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పురుగుమందు సేవించి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తమ భూమికి సత్వరం పరిహారం అందించాలన్నది వారి డిమాండు. సరిగ్గా అదేసమయంలో, హరియాణాలో నాలుగు నెలలుగా ధర్నా చేస్తున్న మరొక రైతు మరణించాడు. ఆ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తన భూమికి అధిక పరిహారం ఇవ్వాలని ఆ రైతు నిరసన తెలుపుతూ చనిపోయాడు. ఈ రైతుల మరణం, లేదా ఆత్మహత్యా ప్రయత్నం ప్రపంచం దృష్టికి రాలేదు కానీ కాఫీ కింగ్ విషాదమరణానికి దారితీసిన పరిస్థితుల గురించి పరిశ్రమవర్గాలు పెట్టిన గగ్గోలుకు మీడియా విపరీత ప్రచారం కల్పించింది. మన పారిశ్రామిక అధిపతుల్లో చాలామంది సిద్ధార్థ మృతిని పన్నుల రూపంలోని ఉగ్రవాదంతో ముడిపెట్టారు. తమకు మరిన్ని పెట్టుబడులు, పన్నురాయితీలు ఇవ్వాలని, పన్నుల బారి నుంచి స్వాతంత్య్రం కల్పించాలని పరిశ్రమవర్గాలు డిమాండు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కెఫే కాఫీ డే యజమాని దాదాపు రూ.11,000 కోట్ల భారీ రుణ ఊబిలో చిక్కుకుపోయారన్న విషయాన్ని విస్మరించి, పరిశ్రమ వర్గాల మనోభావాలను ప్రతిధ్వనింపచేయడంలో బిజినెస్ జర్నలిస్టులు మునిగిపోయారు. ఆర్థిక మందగమనంలో తాము నిలదొక్కుకోవడానికి ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీతోపాటు మరిన్ని రాయితీలను కల్పించాలని పరిశ్రమ వర్గాలు సహేతుకమైన ఆర్థిక కారణాలను చూపించవచ్చు. కానీ వ్యవసాయరంగంలో మృత్యుదేవత ప్రళయతాండవం గురించి ఎవరికీ పట్టింపు లేదు. రైతుల ఆత్మహత్యలపై మీడియా కనీసంగా ప్రస్తావించటం లేదు. ఒక వ్యాపారవేత్తగా సిద్ధార్థకు కష్టకాలంలో తగిన మద్దతు అవసరం కావచ్చు. అయితే రైతులు కూడా తమరంగంలో పారిశ్రామికులుగానే కార్యకలాపాలు సాగిస్తున్న వాస్తవాన్ని ఎవరూ గుర్తించడం లేదు. అందుకే మన దేశ రైతులు తమ కష్టాలను వ్యక్తిగతంగానే ఎదుర్కొంటూ నష్టపోతున్నారు. తమ నష్టాలకు తగిన పరిహారం లభించే హక్కును సకాలంలో పొందగలిగినట్లయితే, దేశీయరైతులు కూడా తమ వ్యవసాయ రంగ వ్యాపార సామర్థ్యాన్ని నిరూపించుకోగలరు. కానీ అలాంటి అవకాశాన్నే తోసిపుచ్చడం అంటే ఆ అవకాశాన్ని రైతులు కోల్పోవడమనే అర్థం. ప్రతి ఏటా మన పరిశ్రమ వర్గాలు రూ.1.8 లక్షల కోట్ల మేరకు ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని పొందుతూనే ఉన్నాయి. 2008–09లో ప్రపంచ ఆర్థికరంగం కుప్పగూలినప్పటినుంచి జాతీయ బ్యాంకులు పరిశ్రమకు 17 లక్షల కోట్ల రూపాయల భారీ రుణాలను అందించాయి. దీనిలో రూ.10 లక్షల కోట్లు నిరర్థక ఆస్తులుగా మిగిలిపోయాయి. మన పారిశ్రామిక రంగం గత 10 సంవత్సరాల్లో ఆర్థిక ప్యాకేజీ కింద రు. 18 లక్షల కోట్లను అందుకుంది. కానీ ఇప్పటికీ పారిశ్రామిక రంగం తీవ్రమైన సంక్షోభంలో కొనసాగుతోంది. పైగా, 2007 నుంచి 2019 వరకు గత 12 ఏళ్లలో బ్యాంకులు దాదాపు రూ. 8.36 లక్షల కోట్ల మొండిబకాయిలను రద్దు చేసినట్లు ఆర్బీఐ నివేదికను మీడియా ప్రస్తావిస్తుంది. పరిశ్రమ, వస్తూత్పత్తి రంగం, ఎగుమతుల రంగం పనితీరు దిగజారిపోవడానికి ఆర్థిక మందగమనమే కారణమా లేక బ్యాంకులు భారీస్థాయిలో దివాలా ఎత్తడమే అసలు కారణమా అని తేల్చుకోవలసిన సమయం ఆసన్నమైంది. దేశీయబ్యాంకులు 2007–2016 మధ్యకాలంలో మొత్తం రూ. 2.88 లక్షల కోట్ల మేరకు మొండిబకాయిలను రద్దు చేశాయి. అయితే 2016–17లో 1.33 లక్షల కోట్లను, 2017–18లో 1.61 లక్షల కోట్లను మాఫీ చేసిన బ్యాంకులు 2018–19 సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ. 2.54 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశాయి. బ్యాంకులు పూర్తిగా ఒట్టిపోవడానికి ప్రధాన కారణం.. ఇంత భారీ మొత్తాన్ని మూడేళ్లకాలంలోనే మాఫీ చేయడమే. కారణాలు ఏవైనా కావచ్చు.. దేశంలో ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొట్టిన 9 వేలమంది డిఫాల్టర్ల పేర్లను బహిరంగపర్చాలని ఆర్బీఐ పట్టుపడుతోంది. మొండి బకాయిలు ఇంకా అధికంగా ఉన్నాయనడానికి ఇది నికార్సైన సంకేతం. కేంద్రప్రభుత్వం ఇప్పటికే బ్యాంకుల ప్రక్షాళన ప్రక్రియను ప్రారంభించడంపై పట్టుదలతో ఉంటున్నప్పటికీ, రుణం చెల్లింపు అశక్తత, దివాలా కోడ్ (ఐబీసీ)ని 2016లో ప్రవేశపెట్టింది. మొండిబకాయిల ఉపద్రవాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ప్రదర్శిస్తున్న బలమైన వైఖరికి ఇది నిదర్శనం. ప్రతిసంవత్సరం పరిశ్రమవర్గాలు భారీ పన్ను రాయితీలను అందుకుంటున్న సమయంలో పన్నుల అధికారులు తమ తలుపు తడితే మాత్రం పరిశ్రమవర్గాలు విలపించడం సమర్థనీయం కాదు. మన వ్యవస్థ రైతుల పట్ల ఎలా వ్యవహరిస్తున్నదో ఇప్పుడు మనం పరిశ్రమల రంగంతో పోల్చి చూద్దాం. బ్యాంకులకు రుణాలను చెల్లించలేకపోయారన్న కారణంతో పలు సంవత్సరాలుగా దేశంలో వందలాది మంది రైతులను బహిరంగంగా అవమానాల పాలు చేశారు. జైళ్లలో పెట్టారు. పరిశ్రమల రంగానికి లక్షలాది కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తుండగా, ఒక్కటంటే ఒక్క నెల బకాయిని చెల్లించలేకపోయిన రైతులను జైళ్లలోకి నెడుతున్నారు. అలాంటి రైతుల స్థిరాస్తి, చరాస్తిని బ్యాంకు తక్షణం స్వాధీనం చేసుకోవడమే కాదు.. రైతులు తాము చెల్లించాల్సిన అసలు మొత్తాన్ని చెల్లించలేని సందర్భాల్లో, వారికి రుణాన్ని మంజూరు చేసే సమయంలో రైతులనుంచి తీసుకున్న సంతకం చేసిన ఖాళీ చెక్కును బ్యాంకు తానే డిపాజిట్ చేసి, అవి చెల్లనప్పుడు ఈ సివిల్ కేసును క్రిమినల్ కేసుగా మార్చి వేధిస్తున్నాయి. తర్వాత అలాంటి రైతులను జైలుకు పంపుతున్నారు. తాము తీసుకున్న రుణాన్ని అసలు, వడ్డీతో సహా తీర్చివేయాలని కోర్టులు రైతులను ఆదేశిస్తున్నాయి కూడా. వాస్తవానికి ఈ దేశంలో క్రమం తప్పకుండా నెలవారీ రుణ చెల్లింపులను చేయగలుగుతున్నది రైతులు మాత్రమే కాగా, ఇలాంటి వారిపైనా డిఫాల్టర్లుగా ఎందుకు ముద్ర వేస్తున్నారో నాకు అసలు అర్థంకాదు. దేశంలో కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సన్నకారు రైతులు గరిష్టంగా చేసిన రెండు లక్షల రూపాయల రుణాన్ని మాఫీ చేస్తున్నందుకే మన ఆర్థికవేత్తలు, ఆర్థికరంగ సమర్థకులు ఈ రుణమాఫీతో ద్రవ్యలోటు ఆకాశానికి అంటుతుందంటూ గావుకేకలు పెడుతున్నారు. కానీ ఇదే బ్యాంకులు లక్షల కోట్ల మేరకు కార్పొరేట్ రుణాలను అలవోకగా మాఫీ చేసినప్పుడు ఇదే ఆర్థికవేత్తలకు ద్రవ్యలోటు ప్రమాదం అసలు గుర్తుకురావడం లేదు. అనేక సంవత్సరాలుగా భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంతో ఉందని పలు ప్రగతి సూచికలు తెలుపుతూనే ఉన్నాయి. వ్యవసాయరంగ రాబడులు గత 15 ఏళ్లలో అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. చివరకు గ్రామీణ రంగ ఉపాధి కూడా ఘోరంగా దెబ్బతిందని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి. వీటి ప్రకారం 2011–2018 మధ్య కాలంలో గ్రామీణ ప్రాంతంలో 3.2 కోట్లమంది రోజుకూలీలు పని కోల్పోయారు. వీరిలో 3 కోట్లమంది వ్యవసాయరంగ కార్మికులున్నారు. కానీ అతిపెద్ద విషాదమేమిటంటే, ముంచుకొస్తున్న వ్యవసాయరంగ దుస్థితి గురించిన తీవ్ర హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోని మన విధాన నిర్ణేతలు ఒకటి, రెండు నెలలు కార్లు, ఆటోమొబైల్స్ అమ్మకాలు పడిపోయి పారిశ్రామికరంగంలో కొన్ని వేల ఉద్యోగాలకు కోతపెట్టగానే గావుకేకలు పెడుతున్నారు. వ్యవసాయరంగం నిరంతర సంక్షోభంలో కూరుకుపోయి ఉన్నంతవరకు మన ఆర్థిక వ్యవస్థ కూడా అనిశ్చిత పరిస్థితుల్లోనే కొనసాగుతుంది. వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ వినియోగం పెరుగుదలపైనే ఆధారపడుతుంది. వినియోగం అనేది ఎంత డిమాండును సృష్టిస్తాం అన్న అంశంపై ఆధారపడుతుంది. దేశీయ డిమాండును పెంచడంలో గ్రామీణ రంగమే అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తోందన్నది అందరూ అర్థం చేసుకోవాలి. దీనికి రాబోయే సంవత్సరాల్లో వ్యవసాయరంగంలో మరిన్ని పెట్టుబడులు అవసరం అవుతాయి. అంటే పరిశ్రమలను మరింతగా ప్రైవేటీకరించడం, మరిన్ని ఉద్దీపన ప్యాకేజీలను ఇవ్వడం నుంచి ప్రభుత్వం తన దృష్టిని వ్యవసాయరంగం వైపు మళ్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.దేశీయ శ్రామికశక్తిలో దాదాపు 50 శాతాన్ని కలిగి ఉన్న వ్యవసాయరంగానికి ప్రభుత్వ మదుపులకు సంబంధించి జీడీపీలో అర్ధ శాతం కంటే తక్కువ కేటాయించడమే మన రైతుల దుస్థితికి అసలు కారణం. కోట్లాది మందికి బతుకునివ్వగల వ్యవసాయ రంగానికి మరింతగా పెట్టుబడులను కేటాయించడం, ఈ క్రమంలో మరింత దేశీయ డిమాండును సృష్టించడమే దీనికి పరిష్కారం. దేవీందర్ శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
‘కాఫీ డే’ సిద్ధార్థ మృతి
మంగళూరు/సాక్షి, బెంగళూరు: నాటకీయ పరిణామాల మధ్య సోమవారం రాత్రి అదృశ్యమైన కెఫే కాఫీ డే వ్యవస్థాపక యజమాని, ఇండియన్ కాఫీ కింగ్ వీజీ.సిద్ధార్థ (59) బుధవారం శవమై కనిపించారు. ప్రాథమికంగా చూస్తే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లుగానే నిర్ధారణ అవుతోందనీ, అయితే కేసును పూర్తిగా విచారించిన తర్వాతనే నిజానిజాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు. సిద్ధార్థ మృతదేహాన్ని కర్ణాటకలోని మంగళూరు సమీపాన, నేత్రావతి నది ఒడ్డున జాలరులు, పెట్రోలింగ్ పోలీసులు బుధవారం కనుగొన్నారు. కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం.కృష్ణకు అల్లుడైన సిద్ధార్థకు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. జాలరులు కనుగొన్న మృతదేహం సిద్ధార్థదేనని ఆయన స్నేహితులు నిర్ధారించినట్లు దక్షిణ కన్నడ జిల్లా డెప్యూటీ కమిషనర్ శశికాంత సెంథిల్ చెప్పారు. మంగళూరులోని వెన్లాక్ వైద్యశాలలో సిద్ధార్థ మృతదేహానికి శవపరీక్ష నిర్వహించారు. సిద్ధార్థ స్వస్థలమైన చిక్కమగళూరు జిల్లా చేతనహళ్ళి గ్రామంలో అంత్యక్రియలను బుధవారం నిర్వహించారు. కర్ణాటక సీఎం యడియూరప్ప, మాజీ సీఎం కుమారస్వామి, ఇతర రాజకీయ నాయకులు, కెఫే కాఫీ డే ఉద్యోగులు, గ్రామస్థులు తదితర వందలాది మంది సిద్ధార్థ అంత్యక్రియలకు హాజరయ్యారు. ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం అధికారులు, అప్పు ఇచ్చిన వాళ్లు తనను వేధిస్తున్నారనీ, ఆ ఒత్తిడిని తాను తట్టుకోలేకపోతున్నానంటూ అదృశ్యానికి ముందు సిద్ధార్థ రాసినట్లుగా ఓ లేఖ బయటకు రావడం తెలిసిందే. మంగళూరు సమీపంలో నేత్రావతి నదిపై ఉన్న వంతెన వద్ద సిద్ధార్థ అదృశ్యమైనట్లు ఆయన డ్రైవర్ చెప్పడంతో, ఆ ప్రాంతంలో సిబ్బంది తీవ్రంగా గాలించారు. హైదరాబాద్‌కు చెందిన ఇన్కాయిస్ అనే ప్రభుత్వ సంస్థ అభివృద్ధి చేసిన సాంకేతికత ఆధారంగా సిద్ధార్థ మృతదేహం ఉన్న అంచనా ప్రదేశాన్ని గాలింపు సిబ్బంది తొలుత గుర్తించారు. అనంతరం ఆ ప్రాంతంలో తీవ్రంగా గాలించడంతో మృతదేహం లభించింది. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప మాట్లాడుతూ ‘మృతదేహం లభించింది. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపేందుకు నా దగ్గర పదాలు కూడా లేవు. వారు అంతటి బాధలో ఉన్నారు. సిద్ధార్థకు అప్పుల కన్నా ఆస్తులు ఎక్కువగానే ఉన్నాయి’ అని చెప్పారు. మృతి దురదృష్టకరం: మమతా బెనర్జీ సిద్ధార్థ మృతి దురదృష్టకర సంఘటన అని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నా రు. ప్రభుత్వ సంస్థల వేధింపుల కారణంగా ఆయన మానసికంగా కుంగిపోయారన్నారు. ప్రభుత్వ ఒత్తిడి, విధానాల కారణంగా ఇప్పటికే కొందరు వ్యాపారవేత్తలు దేశం విడిచి వెళ్లిపోయారనీ, మరికొందరు కూడా వెళ్లిపోయేందుకు ఆలోచిస్తున్నారని మమత పేర్కొన్నారు. అదృశ్య హస్తాలెవరివో తేల్చండి: కాంగ్రెస్ సిద్ధార్థ మృతి వెనుక ఉన్న అదృశ్య హస్తాలెవరివో తేల్చాలని కాంగ్రెస్ బుధవారం డిమాండ్ చేసింది. ‘ఆదాయపు పన్ను అధికారుల వేధింపులు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. వ్యాపారంలో భారత స్థాయి కూడా పడిపోతోంది. దీనంతటికీ కారణం పన్ను ఉగ్రవాదం, ఆర్థిక వ్యవస్థ కూలుతుండటమే. యూపీఏ హయాంలో ఎంతో వృద్ధి చెందిన వ్యాపారాలు, కంపెనీలు నేడు మూతపడుతున్నాయి. అనేక మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు’ అని ట్విట్టర్లో కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య మాట్లాడుతూ ‘నిష్పాక్షిక, పారదర్శక విచారణ జరగాలి. ఇలా విషాదకర రీతిలో సిద్ధార్థ చనిపోవడానికి కారణమైన అదృశ్య హస్తాలెవరివో, ఇందుకు కారణాలేంటో తేల్చాలి. ఆదాయపు పన్ను అధికారులు వేధించారని ఆయన ఆరోపించారు. పన్ను ఉగ్రవాదం, రాజకీయ దురుద్దేశాల కోసం ప్రభుత్వ సంస్థలను వాడుకుంటుండటంపై సిద్ధార్థ తన లేఖలో ప్రస్తావించారు. దీని ద్వారా యువపారిశ్రామికవేత్తలకు మనం ఏం సందేశం ఇస్తున్నాం? సంస్కరణల కోసం కనీసం ప్రయత్నం కూడా చేయడం లేదు’ అని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. -
కాఫీ డే కింగ్ అరుదైన ఫోటో
సాక్షి, బెంగళూరు : కేఫే కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్దార్థ హెగ్డే అకాలమృతి అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే. మాజీ కేంద్ర మంత్రి, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణకు స్వయానా అల్లుడు సిద్ధార్థ. మాజీ సీఎం కుమార్తె , ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన మాళవికను ఆయన వివాహమాడారు. తాజాగా సిద్ధార్థ, మాళవిక పెళ్లికి సంబంధించిన ఫోటో ఒకటి అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో సిద్ధార్థ మరణంపై తీవ్ర సంతాపం వ్యక్తమవుతోంది. ట్విటర్లో ‘ఆర్ఐపి సిద్దార్థ’ హ్యాహ్టాగ్ బాగా ట్రెండ్ అవుతోంది. ఏ బలహీనత ఆయనను ఆవరించిందింతో తెలియదు కానీ.. సిద్ధార్థలో అపారమైన శక్తిని నింపిన ‘బలమే జీవితం, బలహీనతే మరణం’ అన్న వివేకానంద సూక్తి ఆయనను కాపాడలేకపోయింది. చివరికి ఆయన ఎంతో అభిమానించి, గురువుగా భావించిన మహేష్ కంపాని (బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ మాజీ ప్రెసిడెంట్, జేఎంక్యాపిటల్ అధినేత, కారు యాక్సిడెంట్లో అనుమానాస్పదంగా మరణించారు) మాదిరిగానే సిద్ధార్థ జీవితం కూడా విషాదాంతమైంది. ‘ఎలాట్ కెన్ హ్యాపెన్ ఓవర్ ఎ కాఫీ’ అంటూ కాఫీ తాగుతూ ఒత్తిడిని దూరం చేసుకోమని ప్రపంచానికి మార్గం చూపించిన సిద్ధార్థను చివరికి ఆ ఒత్తిడే మింగేయడం అత్యంత విషాదం. వేలమందికి ఉద్యోగావకాశాలు కల్పించిన సిద్ధార్థ ప్రధానంగా వికలాంగులకు ప్రాధాన్యం ఇచ్చేవారట. కాఫీ డే కంపెనీలో ఉద్యోగమంటే ప్రభుత్వ ఉద్యోగం వచ్చినట్టే అన్నంత సంబరం ఉద్యోగుల్లో. కాగా కాఫీడే ఎంటర్ప్రైజెస్ బోర్డు తాత్కాలిక ఛైర్మన్‌గా మాజీ ఐఏఎస్ అధికారి ఎస్వీ రంగనాథ్‌ను నియమించారు. సిద్ధార్థ రాసినట్టుగా చెబుతున్న లేఖ పై కాఫీ డే ఎంటర్ ప్రైజెస్ దర్యాప్తునకు ఆదేశించనుందని తెలుస్తోంది. ఆగస్టు 8న తదుపరి బోర్డు సమావేశంలో దీనిపై చర్చిచనున్నారని సమాచారం. పలువురు రాజకీయవేత్తల, వ్యాపార వర్గాలు, కార్పొరేట్ వర్గాలు ఆయనకు తుది నివాళులు అర్పించేందుకు వేలాదిగా కర్ణాటకలోని చిక్మంగళూరుకు తరలివచ్చారు. మరికొద్ది క్షణాల్లో సిద్ధార్థ అంత్యక్రియలు ముగియనున్నాయి. -
సిద్ధార్థ చివరి మజిలీ ఆ కాఫీ తోటకే
సాక్షి, ముంబై : కాఫీ తోటల్ని ప్రేమించి, మంచి కాఫీని ప్రపంచానికి పరిచయం చేసిన కాఫీ కింగ్ వీజీ సిద్ధార్థ చివరి ప్రస్థానం కూడా ఆ కాఫీ తోటల మధ్యే ముగియనుంది. 12వేల ఎకరాల కాఫీ తోటలకు వారసుడు సిద్ధార్థ అంత్యక్రియలను కర్ణాటకలోని చిక్మంగళూరు జిల్లాలోని చట్టనహళ్లి గ్రామంలోని కాఫీ ఎస్టేట్‌లో నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు అంత్యక్రియలు పూర్తికానున్నాయని భావిస్తున్నారు. మంగళూరు నుండి 150 కిలోమీటర్లు, బెంగళూరుకు వాయువ్యంగా 250 కిలోమీటర్ల దూరంలో ఈ కాఫీ ఎస్టేట్ ఉంది. సోమవారం నుంచి కనిపించకుండా పోయిన సిద్ధార్థ మృతదేహాన్ని నేత్రావతి నది వెనుక నీటిలో తేలుతుండగా బుధవారం ఉదయం ఇద్దరు మత్స్యకారులు గుర్తించారు. బంధువులకు సమాచారం అందించిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మంగళూరులోని వెన్లాక్ ఆసుపత్రికి తరలించారు. శవపరీక్ష తర్వాత సిద్ధార్థ మృతదేహాన్ని అతని కుటుంబానికి అప్పగించారు. ఆయన మృతిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలో పోస్ట్‌మార్టం నివేదిక కీలకంగా మారింది. అయితే పోలీసులు ఈ నివేదికను ఇంకా బహిర్గతం చేయలేదు. మరోవైపు వ్యవస్థాపక చైర్మన్ అకాల మరణం నేపథ్యంలో కెఫే కాఫీ డే ఔట్లెట్లకు సెలవు ప్రకటించారు. మృతదేహాన్ని గ్రామానికి తరలించే మార్గంలో చిక్మంగళూరు పట్టణంలోని కాఫీ డే గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ కార్యాలయానికి తరలించారు. దీంతో తమ అభిమాన నేత, లెజెండ్, కాఫీ డే కింగ్ మృతికి ఉద్యోగులు కన్నీరుమున్నీరయ్యారు. అనంతరం ఆయన స్వగ్రామానికి తరలించగా ఆయన మృతదేహాన్ని సందర్శించుకునేందుకు చుట్టు పక్కల గ్రామాలు, పట్టణాల నుంచి చిన్నా, పెద్దా, మహిళలు వేలాదిగా తరలివచ్చారు. తప్పులన్నింటికి నాదే బాధ్యత అంటూ నిశ్శబ్దంగా నిష్క్రమించిన సిద్ధార్థ ..కార్పొరేట్ ప్రపంచాన్ని ఒక్క కుదుపు కుదిపారని చెప్పక తప్పదు. ప్రధానంగా ఆయన రాసినట్టుగా చెబుతున్న లేఖలో ప్రస్తావించిన ఐటీ శాఖ అధికారుల వేధింపులు వ్యాపార వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. Today we remember the legend that inspired us all. Thank you Chairman VG Siddhartha for your vision, leadership and the great legacy. pic.twitter.com/tYMiglgofe — Cafe Coffee Day (@CafeCoffeeDay) July 31, 2019 -
సిద్ధార్థ అదృశ్యం : కొత్త ట్విస్ట్
కెఫే కాఫీ డే ఫౌండర్ వీజీ సిద్ధార్థ అదృశ్యం కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. సిద్ధార్థ రాసినట్టుగా చెబుతున్న లేఖపై ఆదాయ పన్ను శాఖ అనుమానాలను వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా కెఫే కాఫీ డే వార్షిక నివేదికలో ఉన్న సిద్ధార్థ సంతకంతో, తాజా లేఖలోని సంతకం సరిపోలడం లేదని ఐటీ శాఖ అధికారులు భావిస్తున్నారని తాజా సమాచారం ద్వారా తెలుస్తోంది. మరోవైపు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్ కూడా సిద్ధార్థ అదృశ్యం, లేఖపై అనుమానం వ్యక్తం చేశారు. జూలై 28న తనకు కాల్ చేసి, ఒకసారి కలవగలరా తనను అడిగారని శివ కుమార్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ నేపథ్యంలో జూలై 27న సిద్ధార్థ రాశారని చెబుతున్న లేఖ మర్మాన్ని ఆయన ప్రశ్నిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా సిద్ధార్థ కుటుంబంతో తనకు సాన్నిహిత్యం వుందనీ, ఎంతో ధైర్యవంతుడైన సిద్దార్థ ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడంటే నమ్మలేకపోతున్నానంటూ శివకుమార్ ట్వీట్ చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. ఇది ఇలా వుంటే ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్ దాస్ పాయ్ ఈ సందర్భంగా ఐటీ అధికారుల వ్యవహార శైలిపై కొన్ని అభ్యంతరాలను లేవనెత్తారు. సిద్ధార్థ అదృశ్యంపై మీడియాతో మాట్లాడుతూ ఐటీ దాడుల సందర్భంగా ఆయా వ్యక్తులపై దాడి చేసిన ఘటనలు కూడా ఉన్నాయన్నారు. ఆదాయ పన్నుఎగవేత కేసులను, ఆరోపణలను చట్టపరంగా విచారించాలి తప్ప అవమానకరంగా వ్యవహరించడం తగదని వ్యాఖ్యానించారు. దీనిపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని కోరారు. దీనిపై తక్షణమే విచారణకు ఆదేశించాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. పన్ను చెల్లింపు దారులకు గౌరవం దక్కాలని మోహన్‌దాస్ అభిప్రాయపడ్డారు. మరోవైపు సిద్దార్థ ఆచూకీకోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు ఇంకా ఒక కొలిక్కిరాలేదు. The letter purportedly written by Shri VG Siddhartha which is circulating is dated July 27th. I received a call from him on the 28th asking if we could meet up. It’s unbelievable that a courageous man like him would resort to this. pic.twitter.com/bXcJhHz0QS — DK Shivakumar (@DKShivakumar) July 30, 2019 -
కాఫీ డే ఫౌండర్‌కు ఐటీ శాఖ ఝలక్
కర్ణాటకకు చెందిన వ్యాపారవేత్త, కెఫే కాఫీ డే ఫౌండర్ వీజీ సిద్ధార్థకు ఆదాయ పన్నుశాఖ భారీ షాక్ ఇచ్చింది. ఐటీ సంస్థ మైండ్ ట్రీలో సిద్దార్థకున్న వాటాలను ఐటీ శాఖ ఎటాచ్ చేసింది. ఈ మేరకు మైండ్ ట్రీ శనివారం అందించిన రెగ్యులేటరీ సమాచారంలో తెలిపింది. సిద్ధార్థతోపాటు, సిద్దార్థ అండ్ కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్‌కు ఉన్న రూ.665కోట్ల విలువైన వాటాలను ఎటాచ్ చేసిందని మైండ్ ట్రీ వెల్లడించింది. సిద్ధార్థకు చెందిన 52.7లక్షల షేర్లు, కాఫీడేకు సంబంధించిన 22.2 లక్షల ఈక్విటీ షేర్ల విక్రయాలు, లేదా బదలాయింపులను కూడా నిషేధించిందని పేర్కొంది. ఐటీ ఆదేశాల ప్రకారం ఈ నిషేధం జనవరి 25నుంచి ఆరునెలల పాటు అమల్లో ఉంటుందని తెలిపింది. మైండ్ ట్రీలో ఆయనకున్న 21 శాతం వాటాను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో బెంగళూరు ఐటీ విభాగం ఈ చర్య తీసుకున్నట్టు తెలుస్తోంది. డిసెంబరు 2018 త్రైమాసికానికి సిద్ధార్థ మైండ్ ట్రీ లో 3.3 శాతం వాటా (54.69 లక్షల షేర్లు)ను కలిగి ఉండగా కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్‌కు 1.74 కోట్ల షేర్లు (10.63 శాతం వాటా) ఉన్నాయి. మరో సంస్థ కాఫీ డే ట్రేడింగ్ లిమిటెడ్ 1.05 కోట్ల షేర్లను (6.45 శాతం) కలిగి ఉంది. సంస్థ మిగిలిన ప్రమోటర్లైన సుబ్రతో బాగ్చి, కృష్ణకుమార్ నటరాజన్, ఎన్.ఎస్. పార్థసారథి, రోస్తోవ్ రావణన్లకు కలిపి కంపెనీలో 13 శాతా వాటాను కలిగి ఉన్నారు. మిడ్ సైజ్ ఐటీ సంస్థ మైండ్ ట్రీలోని తన వాటాలను ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్, మరో ప్రయివేటు సంస్థ కెకెఆర్‌కు విక్రయించే క్రమంలో తుది దశ చర్చల్లో ఉన్నట్టు సమాచారం. మరో పదిరోజుల్లో ఈ డీల్‌ను సిద్ధార్థ్ పూర్తి చేసుకునేందుకు సిద్ధమవుతుండగా ఐటీ శాఖ అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. అయితే ఈ పరిణామంపై అటు మైండ్ టీ ఫౌండర్లు , ఇటు వీజీ సిద్ధార్థ ఇంకా స్పందించాల్సి ఉంది. కాగా 2017లోనే కాఫీడే సంస్థల యజమాని వీజీ సిద్ధార్థ నివాసం, కార్యాలయాలపై ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. ఈ సందర్బంగా రూ.650 కోట్ల విలువైన అప్రకటిత ఆస్తులను గుర్తించినట్టు తెలిపింది. అలాగే దీనిపై చర్యలు తీసుకుంటామని కూడా ఐటీ శాఖ ప్రకటించింది. అయితే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర మాజీ గవర్నరు, మాజీ కేంద్ర మంత్రి ఎస్ఎం కృష్ణ అల్లుడే వీజీ సిద్ధార్థ. -
మళ్లీ ఆయనతో జతకడుతోంది..
అమలాపాల్ మరోసారి సిద్ధార్థ్‌తో రొమాన్స్‌కు సిద్ధమవుతోంది. ఈ కేరళాకుట్టికి ఈ మధ్య అవకాశాలు తగ్గుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇంతకుముందు తమిళం, తెలుగు, మలయాళం అంటూ వరుసగా చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్న అమలాపాల్‌ను వివాహానంతరం క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని అందరూ అనుకున్నారు. అలాంటిది ఈ అమ్మడిని తెరపై చూసి చాలా కాలం అవుతుండడంతో అవకాశాలు తగ్గాయా అని ఆమె అభిమానులకు అనుమానం కలుగుతోంది. అయితే త్వరలో అరవిందస్వామితో జత కట్టిన భాస్కర్ ఒరు రాస్కెల్ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం రాక్షసన్ అనే చిత్రంతో నటిస్తోంది. అదేవిధంగా ఒక మలయాళ చిత్రంలోనూ నటిస్తున్న అమలాపాల్‌కు చాలా గ్యాప్ తరవాత తెలుగులో అవకాశం వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా అమలాపాల్ సిద్ధార్థ్‌తో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ జంట 2012లో కాదలిల్ సొదప్పవదు ఎప్పడి అనే చిత్రంలో నటించారు. ఆ చిత్రం మంచి విజయాన్నే అందుకుంది. మళ్లీ సుమారు ఏడేళ్ల తరువాత వీరిద్దరూ కలిసి రొమాన్స్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి ఇంతకు ముందు లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్గా అరమ్ వంటి సంచలన చిత్రాన్ని తెరకెక్కించిన గోపినయినార్ దర్శకత్వం వహించినున్నారు. ఈయన్ని నయనతార అరమ్ చిత్రానికి సీక్వెల్ చేద్దాం అని చెప్పడంతో సిద్ధార్థ్, అమలాపాల్‌తో చేసే చిత్రాన్ని త్వరగా పూర్తి చేసే, తదుపరి నయనతారతో అరమ్-2 చేయనున్నట్లు తాజా సమాచారం. -
కారులో బయటపడ్డ రూ.2.5కోట్లు నగదు
బెంగళూరు : కర్ణాటక విధాన సౌధ ఆవరణలోని అనుమానాస్పదంగా ప్రవేశిస్తున్న కారు నుంచి రూ.2.5కోట్లు బయటపడ్డాయి. శుక్రవారం మధ్యాహ్నం కెంగెల్ హనుమంతయ్య ముఖద్వారం మీదగా విధాన సౌధలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తోన్న కేఏ04 ఎంఎం9018 నంబర్ వోక్స్ వ్యాగన్ కారును పోలీసులు తనిఖీ చేశారు. వారి సోదాల్లో మూడు పెట్టెల్లో సర్ధిపెట్టిన ఈ నగదు లభించింది. వాహన యజమాని ధార్వాడకు చెందిన న్యాయవాది, మాజీ జడ్జి కుమారుడు సిద్ధార్థ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టెండర్‌కు సంబంధించి ఓ మంత్రికి ఇవ్వడానికి ఈ డబ్బు తరలిస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సందర్భంగా సెంట్రల్ డీసీపీ సందీప్ పాటిల్ మాట్లాడుతూ కారులో నుంచి రూ.1.97 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి సిద్ధార్థను విచారణ చేస్తున్నట్లు చెప్పారు. పెద్ద మొత్తంలో లభ్యమైన నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేవన్నారు. అయితే పొంతనలేని సమాధానాలతో పాటు, స్థలం రిజిస్ట్రేషన్ కోసం ఆ నగదును తన వద్ద ఉంచుకున్నట్లు, అందుకు సంబంధించి పత్రాలు సమర్పించేందుకు తనకు కొంత సమయం కావాలని సిద్ధార్ధ కోరటం కొసమెరుపు. -
'నాలో ఒక్కడు' ఆడియో ఆవిష్కరణ
-
అత్తారింటికి వెళ్లొచ్చినట్లు..
సాక్షి, గుంటూరు/విజయవాడ : అంతా అనుకున్నట్లే జరిగింది. చిన్న చిన్న నేరాలు చేసిన వారిని అరెస్టు చేసి, హడావుడి సృష్టించి, మీడియా ముందు ప్రవేశపెట్టే పోలీసులు... కారు రేసులు నిర్వహిస్తూ ఓ విద్యార్థి మృతికి కారకుడైన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరావు తనయుడు సిద్ధార్థ, అతడి స్నేహితుడు శివరాం విషయంలో మాత్రం వల్లమాలిన ప్రేమను కురిపించారు. అధికార పార్టీ నేతల మెప్పు పొందేందుకు పడరాని పాట్లు పడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎమ్మెల్యే తనయుడు సిద్ధార్థను ఎవరికి కనిపించకుండా స్టేషన్ పై గదిలో దాచి ఉంచిన విషయం తెలిసిందే. అనంతరం సకల మర్యాదలతో అతడిని విజయవాడ పంపించేశారు. పైకి మాత్రం సిద్ధార్థ పరారీలో ఉన్నట్లు బొంకారు. నిషిద్ధ కారు రేసులు నిర్వహిస్తూ ఓ యువకుడి మృతికి కారకుడైన వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ 304 (కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్) కింద కేసు నమోదు చేయాల్సి ఉంటుందని సీనియర్ పోలీసు అధికారులు చెబుతుండగా, అధికార పార్టీ ఎమ్మెల్యే తనయుడు కావడంతో బొండా సిద్ధార్థపై మాత్రం 304ఏ, 337 సెక్షన్ల కింద నామమాత్రపు బెయిలబుల్ కేసులు నమోదుచేశారు. 140 కిలో మీటర్ల వేగంతో రేసులు ఆడుతుండగా.. రెండు కార్లు ప్రమాదానికి గురయ్యూయని స్థానికులు చెబుతున్నా.. పోలీసులు మాత్రం కుక్క అడ్డురావడంతో ప్రమాదవశాత్తూ కార్లు ఢీకొన్నాయని కట్టు కథ అల్లి కేసును తప్పుదోవ పట్టించారు. రహస్యంగా కోర్టుకు రెండు రోజుల్లో నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తామని చెప్పిన పోలీసులు గురువారం ఉదయం 7 గంటల సమయంలో విజయవాడలో రైతు బజారు వద్ద నిందితులను అరెస్టు చేశామని చెబుతూ, వారిని రహస్యంగా కోర్టుకు హాజరుపరిచే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత బెయిల్ మంజూరైంది. ఉదయం 7 గంటలకు అరెస్టు అయిన ఎమ్మెల్యే తనయుడు అతడి స్నేహితులు మధ్యాహ్నం 3 గంటల వరకు ఎక్కడ ఉన్నారనే విషయం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. పోలీసుల అత్యుత్సాహం కోర్టులో హాజరుపరిచే వరకు నిందితులను పోలీసులు వారి ఆధీనంలో ఉంచుకోవాల్సి ఉంది. ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తనయుడు సిద్ధార్థ, అతడి స్నేహితుడు శివరాం మాత్రం అత్తారింటికి వచ్చినట్లుగా.. మందీమార్బలంతో వారి కార్లలో దర్జాగా కోర్టు ప్రాంగణంలో దిగారు. అక్కడే ఉన్న విలేకరులు ఫొటోలు తీసేందుకు యత్నించగా.. ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకుని సిద్ధార్థ చుట్టూ వలయంలా ఏర్పడ్డారు. ఈ సమయంలో పోలీసులెవరూ అక్కడ లేకపోవడం గమనార్హం. కోర్టులో బెయిల్ పొందిన సిద్ధార్థ, శివరాం తమ అనుచరుల చక్రబంధంలో ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుని బయటకువచ్చి వారి కార్లలో వెళ్లిపోయూరు. గమనించిన స్థానికులు వీరు నేరం చేసి వచ్చారా.. పండగకు అత్తారింటికి చుట్టపుచూపుగా వచ్చారా.. అంటూ సందేహం వెలిబుచ్చారు. ఎమ్మెల్యే తనయుడి విషయంలో పోలీసులు చూపిన ప్రేమ చట్టం అధికారపార్టీ చుట్టం అన్నట్లుగా మారిందనే విమర్శలు గుప్పుమంటున్నారుు.