'దుల్కర్‌సల్మాన్‌తో హన్సిక రొమాన్స్? | Dulquer Salmaan to join hands with Hansika | Sakshi
Sakshi News home page

దుల్కర్‌సల్మాన్‌తో హన్సిక రొమాన్స్?

Published Sat, Dec 19 2015 2:37 AM | Last Updated on Wed, Apr 3 2019 9:05 PM

'దుల్కర్‌సల్మాన్‌తో హన్సిక రొమాన్స్? - Sakshi

'దుల్కర్‌సల్మాన్‌తో హన్సిక రొమాన్స్?

దుల్కర్ సల్మాన్ మలయాళ సూపర్‌స్టార్ మమ్ముటి వారసుడన్న విషయం తెలిసిందే. వాయైమూడి పేసువుమ్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయిన ఈ మాలీవుడ్ యువ నటుడు మలి చిత్రంతోనే ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో (ఓ కాదల్ కణ్మణి)నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఆ రెండు చిత్రాలు విజయం సాధించడంతో దుల్కర్‌సల్మాన్ తమిళ ప్రేక్షకులకు దగ్గరయ్యారు.  మరోసారి మణిరత్నం దర్శకత్వంలో నటించే అవకాశాన్ని వదులుకున్న దుల్కర్ తాజాగా ఒక తమిళ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

విశేషమేమిటంటే ఇందులో దుల్కర్‌సల్మాన్‌తో క్రేజీ నటి హన్సిక జత కట్టనున్నారని తెలిసింది. ఈ రేర్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి దర్శక ద్వయం హరిశంకర్, హరీష్‌నారాయణన్ దర్శకత్వం వహించనున్నట్లు కోలీవుడ్ టాక్. ఈ క్రేజీ చిత్రాన్ని ఇంతకు ముందు అరణ్మణి వంటి సూపర్ హార్రర్ చిత్రాన్ని నిర్మించిన విజన్ ఐ మీడియా సంస్థ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రానికి సంబంధించిన అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement