విజయ్‌తో అమిజాక్సన్ | iluvcinema Amy Jackson opposite Vijay | Sakshi
Sakshi News home page

విజయ్‌తో అమిజాక్సన్

Published Wed, Feb 11 2015 3:10 AM | Last Updated on Sat, Sep 2 2017 9:06 PM

విజయ్‌తో అమిజాక్సన్

విజయ్‌తో అమిజాక్సన్

ఇంగ్లీష్ బ్యూటీ అమిజాక్సన్‌కు అదృష్టం తేనెతుట్టిలాగా పట్టుకుంది. ఐ చిత్రం తరువాత తన రేంజ్ మారిపోతుందనే ఆమె నమ్మకం అక్షరాలా నిజమైంది. వరుసగా అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. సూర్యతో మాస్ చిత్రంలో నటించే అవకాశాన్ని జార విడుచుకున్నా ఆ తరువాత ధనుష్‌తో ఒక చిత్రం, ఉదయనిధి స్టాలిన్‌తో మరో చిత్రం చేసే అవకాశాలను అందుకుంది. ఈ రెండు చిత్రాలు ప్రారంభం కాకముందే అమిజాక్సన్ మరో భారీ అవకాశం వరించనుందన్నది తాజా సమాచారం. ఇళయదళపతి విజయ్‌తో రొమాన్స్ చేసే లక్కీ చాన్స్‌ను అమి కొట్టేసినట్లు కోలీవుడ్ టాక్.

విజయ్ ప్రస్తుతం తన 58వ చిత్రం పులిని పూర్తి చేసే పనిలో ఉన్నారు. శింబుదేవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సోషియో, పోకలర్ కథాచిత్రంలో శ్రుతిహాసన్, హన్సికలు నాయకలుగా నటిస్తున్నారు. విజయ్ తన 59వ చిత్రానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని ఇంతకుముందు తుపాకీ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన కలైపులి ఎస్‌థాను భారీ ఎత్తున  రూపొందించనున్నారు. ఈ చిత్రంలో ఇంతకుముందు కత్తి చిత్రంలో విజయ్‌తో రొమాన్స్ చేసిన సమంత మరోసారి డ్యూయెట్, పాడటానికి సిద్ధం అవుతుండగా మరో నాయకిగా అమిజాక్సన్ నటించనున్నారని సమాచారం. ఈ చిత్రంలోనూ ఇళయదళపతి ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement