Lucky Chance
-
గొల్లపల్లి యువకుడు భార్గవ్‌కు లక్కీ ఛాన్స్.. ఏడాదికి రూ.1.70 కోట్ల జీతం
సాక్షి, సత్యసాయి జిల్లా(పెనుకొండ): మండలంలోని గొల్లపల్లికి చెందిన భార్గవ్‌కుమార్‌రెడ్డి లక్కీఛాన్స్ కొట్టాడు. ఏడాదికి రూ.1.70 కోట్ల జీతంతో క్వాల్‌కాం మల్టీ ఇంటర్నేషనల్ కంపెనీలో కొలువు దక్కించుకున్నాడు. అమెరికాలోని అరిజోనా యూనివర్సిటీలో ఎంఎస్ (ఎంటెక్) చదువుతున్న భార్గవ్‌కుమార్‌రెడ్డి ఇంకా పట్టా తీసుకోకముందే రూ.కోట్ల కొలువు దక్కించుకున్నాడు. ఆయన చదువు డిసెంబర్లో పూర్తి కానుండగా, అతని నైపుణ్యం గుర్తించిన క్వాల్‌కాం కంపెనీ అంతకుముందే ఏడాదికి రూ. 1.70 కోట్లు ప్యాకేజీ ఇచ్చేలా ఒప్పందం చేసుకుంది. చదువు పూర్తికాగానే క్వాల్‌కాంలో చేరనున్న భార్గవ్‌కుమార్‌రెడ్డి అధునాతన చిప్‌ల తయారీపై పనిచేయాల్సి ఉంటుంది. భార్గవ్ ప్రతిభను గుర్తించిన అరిజోనా యూనివర్సిటీ ఇప్పటికే అతనికి రూ. 20 లక్షలు స్కాలర్ షిప్ ఇవ్వడం విశేషం. ఈ సందర్భంగా భార్గవ్ తల్లిదండ్రులు శ్రీనివాసరెడ్డి, అలివేలమ్మ మాట్లాడుతూ.. తమ కుమారుడు ఏడాదికి రూ.కోటి సంపాదించే ఉద్యోగంలో చేరతాడని తాము ఊహించలేదన్నారు. చిన్నప్పటి నుంచీ కష్టపడి చదివే తమ కుమారుడి ప్రతిభ గుర్తించి ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు విద్యాసంస్థలు ఫీజుల్లో పెద్ద ఎత్తున రాయితీ ఇచ్చాయన్నారు. చదవండి: (పరిటాల సునీత మహానటి.. సహనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దు) -
ఇలయదళపతితో ఓవియ
తమిళసినిమా: నటి ఓవియకు లక్కీచాన్స్ తలుపుతట్టనుందా? అలానే ఉందంటున్నారు కోలీవుడ్ వర్గాలు. ఇలయదళపతితో నటించే అవకాశం ఓవియను వరించనుందనే టాక్ తాజాగా స్ప్రెడ్ అవుతోంది. బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోతో ఓవియ దశ, దిశ మారనుందా? ఆ షోకు ముందు, ఆ తరువాత ఆమె సినీ జీవితం ఉండబోతోందా? ఇప్పుడిలాంటి చర్చే కోడంబాక్కంలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటి వరకూ నటి ఓవియ చిన్న చిత్రాల నాయకి. పలు చిత్రాల్లో నటించినా వాటిలో ఒక్క భారీ చిత్రం లేదు. అయితే కమలహాసన్ హీరోగా నటించిన మన్మధన్అన్బు చిత్రంలో నటించినా, అందులో ఒక జూనియర్ ఆర్టిస్ట్ పాత్ర కన్నా చిన్న పాత్రలో ఒకే ఒక్క సీన్లో వచ్చి పోయేలా కనిపించిన ఓవియకు బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో చాలా క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఏకంగా విజయ్‌తో నటించే అవకాశం తలుపుతట్టినట్లు, ఆయన తాజా చిత్రంలో నటించే విషయమై నటి ఓవియతో చర్చలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. కాగా విజయ్ తాజాగా మెర్శల్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తరువాత ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఇందులో ఓవియ ప్రధాన కథానాయకిగా నటించనుందా? ఇద్దరు ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా నటించనుందా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఏఆర్.మురుగదాస్ ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్‌బాబు హీరోగా స్పైడర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విజయదశమి పండగ సందర్భంగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. తదుపరి ఏఆర్.మురుగదాస్, విజయ్ కాంబినేషన్లో సుమారు రూ.150 కోట్ల బడ్జెట్లో తెరకెక్కడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. -
తమన్నకో లక్కీచాన్స్!
తారల విషయానికి వస్తే విశ్వనాయకుడు కమలహాసన్, సూపర్‌స్టార్ రజనీకాంత్ వంటి వారితో నటించాలని ప్రముఖ నటీమణులు సైతం కలలు కంటుంటారు. ఆ విధంగా నటి త్రిషకు కమలహాసన్‌తో రెండుసార్లు కలిసి నటించే అవకాశాం కలిగినా రజనీకాంత్‌తో నటించే అవకాశం కోసం ఇంకా నిరీక్షిస్తూనే ఉన్నారు. అదే విధంగా నయనతార, అనుష్క వంటి స్టార్ హీరోయిన్లు రజనీకాంత్‌తో నటించే అవకాశాల్ని అందిపుచ్చుకున్నా కమలహసన్‌తో నటించే అదృష్టం ఇప్పటి వరకూ కలగలేదు. ఇక తమిళం, తెలుగు భాషల్లో ప్రముఖ హీరోయిన్గా వెలుగొందుతున్న మరో నటి తమన్న. ఈ బ్యూటీకి ఇప్పటి వరకూ అలాంటి అవకాశాలు దక్కక పోయినా తాజాగా ఒక కల నెరవేరబోతోందని సమాచారం. అదే విశ్వనాయకుడు కమలహాసన్‌తో నటించే లక్కీఛాన్స్. కమలహాసన్ తన చిత్రాల వేగాన్ని పెంచారన్న విషయం తెలిసిందే. ఆ విధంగా ఆయన తూంగావనం చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేశారు. త్రిష హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి కమల్ శిష్యుడు రాజేష్ ఎం.సెల్వ దర్శకత్వం వహించారు. తూంగావనం తమిళం,తెలుగు భాషల్లో దీపావళికి విడుదలకు ముస్తాబవుతోంది. కమలహాసన్ తదుపరి చిత్రానికి రెడీ అయ్యిపోయారు. మలయాళ దర్శకుడి దర్శకత్వంలో నటించనున్నారనే ప్రచారం ఇంతకు ముందు జరిగినా తాజాగా తూంగావనం చిత్ర దర్శకుడు రాజేష్ ఎం.సెల్వ దర్శకత్వంలోనే మళ్లీ నటించడానికి సిద్ధం అవుతున్నారని తెలిసింది. ఈ చిత్రానికి సీనియర్ దర్శుకుడు మౌళి కథను తయారు చేసినట్లు దర్శకుడు లింగసామి తిరుపతి బ్రదర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. ఇందులో కమలహాసన్ సరసన నటించే హీరోయిన్ల కోసం పలువురు నటీమణుల పేర్లు పరిశీలించినా చివరకు నటి తమన్నను లక్కీఛాన్స్ వరించినట్లు కోలీవుడ్ టాక్. ఈ మిల్కీబ్యూటీ ఇంతకు ముందు తిరుపతి బ్రదర్స్ సంస్థలో పైయ్యా చిత్రంలో నటించారు. దీంతో తాజాగా కమల్ సరసన తమన్నను నటింపజేయడానికి ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఇక్కడ చెప్పుకోవలసిన అంశం ఏమిటంటే మన హీరోయిన్లకు మూడు పదుల వయసు దాటిన తరువాత అదృష్టం మరోసారి పలకరిస్తుండడం విశేషం. నయనతార, అనుష్క, తాజాగా త్రిష వీళ్లంతా మూడు పదుల వయసుకు చేరుకున్న వాళ్లే. ప్రస్తుతం హవా కొనసాగిస్తున్న వాళ్ళే. తమన్న బాహుబలి చిత్రంతో మళ్లీ నటిగా పుంజుకున్నారు.ప్రస్తుతం తెలుగులో బెంగాల్ టైగర్ చిత్రాన్ని పూర్తి చేశారు. నాగార్జున, కార్తీలతో ద్విభాషా చిత్రం దోస్త్(తెలుగులో ఊపిరి)చిత్రంతో పాటు బాహుబలి-2లో నటిస్తున్నారు. -
శ్రీవారి భక్తులకు లక్కీ చాన్స్
సాక్షి, తిరుమల: సామాన్య భక్తులు అరుదైన సేవల్లో స్వామివారిని దర్శించే భాగ్యాన్ని టీటీడీ కల్పించింది. నాలుగేళ్ల ముందు ప్రారంభించిన ఈ లక్కీడిప్ మార్చి కోటాను గురువారం విడుదల చేశారు. ఇందులో తోమాల సేవ 41 టికెట్లు (ఒక్కొక్కరికి రూ.220), అర్చన 129 (రూ.220), మేల్‌ఛాట్‌వస్త్రం 9 (దంపతులు రూ.12,250), పూర్ణాభిషేకం 46 (రూ.750) టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ముందు రోజు తిరుమలలోని విజయా బ్యాంకులో లక్కీడిప్ ద్వారా భక్తులకు టికెట్లు కేటాయిస్తారు. -
విజయ్‌తో అమిజాక్సన్
ఇంగ్లీష్ బ్యూటీ అమిజాక్సన్కు అదృష్టం తేనెతుట్టిలాగా పట్టుకుంది. ఐ చిత్రం తరువాత తన రేంజ్ మారిపోతుందనే ఆమె నమ్మకం అక్షరాలా నిజమైంది. వరుసగా అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. సూర్యతో మాస్ చిత్రంలో నటించే అవకాశాన్ని జార విడుచుకున్నా ఆ తరువాత ధనుష్‌తో ఒక చిత్రం, ఉదయనిధి స్టాలిన్‌తో మరో చిత్రం చేసే అవకాశాలను అందుకుంది. ఈ రెండు చిత్రాలు ప్రారంభం కాకముందే అమిజాక్సన్ మరో భారీ అవకాశం వరించనుందన్నది తాజా సమాచారం. ఇళయదళపతి విజయ్‌తో రొమాన్స్ చేసే లక్కీ చాన్స్‌ను అమి కొట్టేసినట్లు కోలీవుడ్ టాక్. విజయ్ ప్రస్తుతం తన 58వ చిత్రం పులిని పూర్తి చేసే పనిలో ఉన్నారు. శింబుదేవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సోషియో, పోకలర్ కథాచిత్రంలో శ్రుతిహాసన్, హన్సికలు నాయకలుగా నటిస్తున్నారు. విజయ్ తన 59వ చిత్రానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని ఇంతకుముందు తుపాకీ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన కలైపులి ఎస్థాను భారీ ఎత్తున రూపొందించనున్నారు. ఈ చిత్రంలో ఇంతకుముందు కత్తి చిత్రంలో విజయ్‌తో రొమాన్స్ చేసిన సమంత మరోసారి డ్యూయెట్, పాడటానికి సిద్ధం అవుతుండగా మరో నాయకిగా అమిజాక్సన్ నటించనున్నారని సమాచారం. ఈ చిత్రంలోనూ ఇళయదళపతి ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తోంది. -
ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థులకు లక్కీచాన్స్
కోల్‌కతా: ఉద్యోగావకాశాల్లో ఐఐటీ-ఖరగ్‌పూర్ ఇతర ఐఐటీల కంటే ముందుంది. మొదటి దశ ప్లేస్మెంట్ శనివారంతో ముగియగా ఈ విద్యాసంస్థ నుంచి 1,050 మంది విద్యార్థులకు ఉద్యోగాలు లభించాయి. ఇది గతేడాది కంటే 10 శాతం ఎక్కువ. ఐటీసీ హిందూస్తాన్ లీవర్, ఫేస్బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా 200 కంపెనీలు ప్లేస్మెంట్లలో పాల్గొన్నాయి. జనవరిలో ప్రారంభం కానున్న రెండో దశ ప్లేస్మెంట్ కు ఇప్పటికే 50 కంపెనీలు రిజిస్టర్ చేసుకున్నాయి. -
పవర్‌స్టార్‌తో ప్రియమణి స్టెప్పులు?
ప్రియమణి లక్కీ ఛాన్స్ కొట్టేశారని ఫిలింనగర్ సమాచారం. పవర్‌స్టార్‌తో ఈ ముద్దుగుమ్మ కాలు కదపనున్నారట. వివరాల్లోకెళ్తే... వెంకటేశ్, పవన్‌కల్యాణ్ కలిసి ‘గోపాల గోపాల’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో వెంకటేశ్ సామాన్యుని పాత్ర పోషిస్తుండగా, పవన్‌కల్యాణ్ దేవుడిగా వైరైటీ పాత్రను పోషించనున్నారు. ఇందులో కథానుగుణంగా సాగే ఓ గీతంలో వపన్‌తో కలిసి ప్రియమణి స్టెప్పులేయనున్నారని ఫిలింనగర్ టాక్. ‘చెన్నయ్ ఎక్స్‌ప్రెస్’ చిత్రంలో షారుక్‌ఖాన్‌తో కలిసి ప్రియమణి చేసిన ఐటమ్ సాంగ్ పవర్‌స్టార్‌కి విపరీతంగా నచ్చేసిందట. అందుకే... ఈ పాటలో తనతో పాటు నర్తించడానికి ప్రియమణి పేరును దర్శక, నిర్మాతలకు పవన్ సూచించారట. ఆ విధంగా ఈ లక్కీ ఆఫర్ ప్రియమణి తలుపుతట్టిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంతో జరుగుతోంది. వెంకటేశ్‌పై కీలక సన్నివేశాలను దర్శకుడు డాలీ తెరకెక్కిస్తున్నారు. శనివారం (నేడు) నుంచి పవన్‌కల్యాణ్ షూటింగ్‌లోకి ఎంటరవుతారని వినికిడి. సాయిమాధవ్ బుర్రా సంభాషణలు ఈ చిత్రాన్ని ఓ రేంజ్‌కి తీసుకెళ్లనున్నాయని యూనిట్ వర్గాలు అంటున్నాయ్.