పవర్‌స్టార్‌తో ప్రియమణి స్టెప్పులు? | Pawan Kalyan interested on Priyamani | Sakshi
Sakshi News home page

పవర్‌స్టార్‌తో ప్రియమణి స్టెప్పులు?

Published Sat, Jul 5 2014 1:06 AM | Last Updated on Sat, Jul 6 2019 4:08 PM

పవర్‌స్టార్‌తో ప్రియమణి స్టెప్పులు? - Sakshi

పవర్‌స్టార్‌తో ప్రియమణి స్టెప్పులు?

ప్రియమణి లక్కీ ఛాన్స్ కొట్టేశారని ఫిలింనగర్ సమాచారం. పవర్‌స్టార్‌తో ఈ ముద్దుగుమ్మ కాలు కదపనున్నారట. వివరాల్లోకెళ్తే... వెంకటేశ్, పవన్‌కల్యాణ్ కలిసి ‘గోపాల గోపాల’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో వెంకటేశ్ సామాన్యుని పాత్ర పోషిస్తుండగా, పవన్‌కల్యాణ్ దేవుడిగా వైరైటీ పాత్రను పోషించనున్నారు. ఇందులో కథానుగుణంగా సాగే ఓ గీతంలో వపన్‌తో కలిసి ప్రియమణి స్టెప్పులేయనున్నారని ఫిలింనగర్ టాక్.

‘చెన్నయ్ ఎక్స్‌ప్రెస్’ చిత్రంలో షారుక్‌ఖాన్‌తో కలిసి ప్రియమణి చేసిన ఐటమ్ సాంగ్ పవర్‌స్టార్‌కి విపరీతంగా నచ్చేసిందట. అందుకే... ఈ పాటలో తనతో పాటు నర్తించడానికి ప్రియమణి పేరును దర్శక, నిర్మాతలకు పవన్ సూచించారట. ఆ విధంగా ఈ లక్కీ ఆఫర్ ప్రియమణి తలుపుతట్టిందని తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంతో జరుగుతోంది. వెంకటేశ్‌పై కీలక సన్నివేశాలను దర్శకుడు డాలీ తెరకెక్కిస్తున్నారు. శనివారం (నేడు) నుంచి పవన్‌కల్యాణ్ షూటింగ్‌లోకి ఎంటరవుతారని వినికిడి. సాయిమాధవ్ బుర్రా సంభాషణలు ఈ చిత్రాన్ని ఓ రేంజ్‌కి తీసుకెళ్లనున్నాయని యూనిట్ వర్గాలు అంటున్నాయ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement