ఇలయదళపతితో ఓవియ | Talking about the possibility of acting with Illiyadalapathy is the latest spread. | Sakshi
Sakshi News home page

ఇలయదళపతితో ఓవియ

Published Fri, Aug 11 2017 1:52 AM | Last Updated on Wed, Apr 3 2019 9:13 PM

ఇలయదళపతితో ఓవియ - Sakshi

ఇలయదళపతితో ఓవియ

తమిళసినిమా: నటి ఓవియకు లక్కీచాన్స్‌ తలుపుతట్టనుందా? అలానే ఉందంటున్నారు కోలీవుడ్‌ వర్గాలు. ఇలయదళపతితో నటించే అవకాశం ఓవియను వరించనుందనే టాక్‌ తాజాగా స్ప్రెడ్‌ అవుతోంది. బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షోతో ఓవియ దశ, దిశ మారనుందా? ఆ షోకు ముందు, ఆ తరువాత ఆమె సినీ జీవితం ఉండబోతోందా? ఇప్పుడిలాంటి చర్చే కోడంబాక్కంలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటి వరకూ నటి ఓవియ చిన్న చిత్రాల నాయకి.

పలు చిత్రాల్లో నటించినా వాటిలో ఒక్క భారీ చిత్రం లేదు. అయితే కమలహాసన్‌ హీరోగా నటించిన మన్మధన్‌అన్బు చిత్రంలో నటించినా, అందులో ఒక జూనియర్‌ ఆర్టిస్ట్‌ పాత్ర కన్నా చిన్న పాత్రలో ఒకే ఒక్క సీన్‌లో వచ్చి పోయేలా కనిపించిన ఓవియకు బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షో చాలా క్రేజ్‌ తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఏకంగా విజయ్‌తో నటించే అవకాశం తలుపుతట్టినట్లు, ఆయన తాజా చిత్రంలో నటించే విషయమై నటి ఓవియతో చర్చలు జరుగుతున్నట్లు తాజా సమాచారం.

కాగా విజయ్‌ తాజాగా మెర్శల్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తరువాత ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఇందులో ఓవియ ప్రధాన కథానాయకిగా నటించనుందా? ఇద్దరు ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా నటించనుందా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఏఆర్‌.మురుగదాస్‌ ప్రస్తుతం టాలీవుడ్‌ స్టార్‌ హీరో మహేశ్‌బాబు హీరోగా స్పైడర్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విజయదశమి పండగ సందర్భంగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. తదుపరి ఏఆర్‌.మురుగదాస్, విజయ్‌ కాంబినేషన్‌లో సుమారు రూ.150 కోట్ల బడ్జెట్‌లో తెరకెక్కడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement