విలన్గా మారుతున్న మరో హీరో | senior hero srikanth Turns villain | Sakshi
Sakshi News home page

విలన్గా మారుతున్న మరో హీరో

Published Sat, Jun 18 2016 8:07 AM | Last Updated on Mon, Sep 4 2017 2:44 AM

విలన్గా మారుతున్న మరో హీరో

విలన్గా మారుతున్న మరో హీరో

ఒకప్పుడు ఫ్యామిలీ సినిమాలతో అలరించిన సీనియర్ హీరోలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగే పరిస్థితి కనిపించటం లేదు. ముఖ్యంగా యంగ్ జనరేషన్ నుంచి భారీ పోటీ ఉండటంతో పాటు, మాస్ ఆడియన్స్లో ఫాలోయింగ్ లేని హీరోలకు కలెక్షన్లు సాధించటం కష్టంగా మారుతోంది. దీంతో ఫ్యామిలీ హీరో ఇమేజ్ ఉన్న సీనియర్ హీరోలు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్లుగా విలన్లుగా మారుతున్నారు.

ఇప్పటికే ఈ దిశగా అడుగులు వేసిన జగపతి బాబు మంచి విజయాలు సాధిస్తున్నాడు. ఒకప్పుడు హీరోగా అవకాశాల కోసం ఎదురుచూసిన జగపతి బాబు, ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలకు కూడా డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. తెలుగుతో పాటు తమిళ, మళయాల భాషల్లో కూడా సత్తా చాటుతున్నాడు. అదే బాటలో మరో సీనియర్ హీరో శ్రీకాంత్ కూడా విలన్ పాత్రలో నటించేందుకు రెడీ అవుతున్నాడు.

చాలా రోజులుగా హీరోగా సక్సెస్ సాధించలేకపోతున్న శ్రీకాంత్, కొంతకాలంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటిస్తున్నాడు. గోవిందుడు అందరి వాడేలే, సరైనోడు సినిమాల్లో హీరో బాబాయ్గా నటించిన శ్రీకాంత్, ఓ తమిళ సినిమాలో విలన్ పాత్రలో నటించనున్నాడు. ప్రస్తుతానికి చర్చల దశలోనే ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలో అధికారిక ప్రకటన రానుంది. ఇన్నాళ్లు విలన్ల కొరతతో పరభాష నటుల మీద ఆధారపడ్డ తెలుగు దర్శక నిర్మాతలు సీనియర్ హీరోల నిర్ణయంతో ఆనందంగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement